ఎవరీ మోనాలిసా? ఓవర్‌నైట్‌లో జాక్‌పాట్‌ కొట్టిన తేనె కళ్ల సుందరి (ఫోటోలు) | How Monalisa Bhonsle became Maha Kumbh's unexpected star: Photos | Sakshi
Sakshi News home page

ఎవరీ మోనాలిసా? ఓవర్‌నైట్‌లో జాక్‌పాట్‌ కొట్టిన తేనె కళ్ల సుందరి (ఫోటోలు)

Jan 22 2025 8:51 PM | Updated on Jan 22 2025 9:22 PM

How Monalisa Bhonsle became Maha Kumbh's unexpected star: Photos1
1/11

సోషల్ మీడియా ఆ మహిళను ప్రపంచానికి పరిచయం చేసింది. అంతకుముందు తాను ఎవరో కూడా చాలామందికి తెలియదు. ఎందుకంటే ఆమె సెలబ్రిటీ కాదు.. రాజకీయ నాయకురాలు అంత కన్నా కాదు.

How Monalisa Bhonsle became Maha Kumbh's unexpected star: Photos2
2/11

ఆమె ఓ సాధారణ మహిళ. పొట్టికూటి కోసం రోడ్డు వెంట చిన్న చితకా వస్తువులు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. ఇప్పుడేమో ఆ మహిళ ఏకంగా పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్‌ తెచ్చుకుంది.

How Monalisa Bhonsle became Maha Kumbh's unexpected star: Photos3
3/11

ఒక్కసారిగా సోషల్ మీడియాను షేక్ చేసింది. అంతేకాదు బాలీవుడ్‌ సినిమాలో ఛాన్స్ కొట్టిసిందేనే వార్త నెట్టింట తెగ వైరలవుతోంది. అదేంటో తెలుసుకుందాం.

How Monalisa Bhonsle became Maha Kumbh's unexpected star: Photos4
4/11

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహకుంభ్ మేళా మోనాలిసా అనే మహిళకు ఒక్కసారిగా ఫేమ్ తీసుకొచ్చింది. ఆమెను ఓవర్‌నైట్ స్టార్‌ను చేసింది. దానికి కారణం ఆమె కళ్లు.

How Monalisa Bhonsle became Maha Kumbh's unexpected star: Photos5
5/11

తేనేలాంటి కళ్లతో మహాకుంభ్‌ మేళాలో పూసల దండలు విక్రయిస్తున్న మోనాలిసా అనే మహిళను ఓ భక్తుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంకేముంది ఆ తర్వాత అది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది.

How Monalisa Bhonsle became Maha Kumbh's unexpected star: Photos6
6/11

ఏ సోషల్ మీడియా చూసిన ఆమె వీడియోలే దర్శనమిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మోనాలిసా పేరు వైరల్ కావడంతో ఏకంగా సినిమా ఛాన్స్ కొట్టేసింది. ఆమెకు ఓ బాలీవుడ్ డైరెక్టర్ ఏకంగా సినిమా ఛాన్స్ కూడా ఆఫర్ చేస్తున్నాడు.

How Monalisa Bhonsle became Maha Kumbh's unexpected star: Photos7
7/11

మహా కుంభమేళాలో పూసల దండలు అమ్ముకుంటున్న మోనాలిసా భోస్లే.. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన అమ్మాయి. వారి కుటుంబం పూసలు దండలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నది. తన తమ్ముడిని చదివించేందుకు ఈ పని చేస్తున్నట్లు తెలిపింది. అదే సమయంలో అందరి కళ్లను తనవైపు తిప్పుకుంది ఈ తేనేకళ్ల సుందరి మోనాలిసా.

How Monalisa Bhonsle became Maha Kumbh's unexpected star: Photos8
8/11

ఆమెను చూసిన ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన మూవీలో ఛాన్స్‌ ఇస్తానని ప్రకటించాడు.

How Monalisa Bhonsle became Maha Kumbh's unexpected star: Photos9
9/11

దీనికి కారణం ఆమెకున్న స్పెషల్ ‍అట్రాక్షన్‌ కళ్లు. ఆ అందమైన కళ్లతోనే అందరి దృష్టిని ఆకర్షించింది.

How Monalisa Bhonsle became Maha Kumbh's unexpected star: Photos10
10/11

తన సినిమాలో అమ్మాయి కోసం వెతుకున్న బాలీవుడ్ డైరెక్టర్‌కు మోనాలిసా గురించి తెలిసింది. డైరీ ఆఫ్ మణిపూర్ మూవీలో ఆమెకు అవకాశమివ్వనున్నట్లు సనోజ్ మిశ్రా తెలిపారు.

How Monalisa Bhonsle became Maha Kumbh's unexpected star: Photos11
11/11

ఆమెకు తన సినిమాలో ఓ రైతుకు బిడ్డగా నటించే పాత్ర ఇస్తానని ప్రకటించారు. దీంతో సోషల్ మీడియా వల్ల ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిన మోనాలిసా ఏకంగా సినిమా ఛాన్స్ కొట్టేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Advertisement
Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement