భారత్‌లో అతి చౌక 4జీ ఫోన్ | First impressions: Lenovo A6000 4G smartphone | Sakshi
Sakshi News home page

భారత్‌లో అతి చౌక 4జీ ఫోన్

Jan 17 2015 2:27 AM | Updated on Sep 2 2017 7:46 PM

భారత్‌లో అతి చౌక 4జీ ఫోన్

భారత్‌లో అతి చౌక 4జీ ఫోన్

లెనొవొ కంపెనీ భారత్‌లో అత్యంత చౌకైన 4జీ ఫోన్, లెనొవొ ఏ6000ను మార్కెట్లోకి తెచ్చింది.

న్యూఢిల్లీ: లెనొవొ కంపెనీ భారత్‌లో అత్యంత చౌకైన 4జీ ఫోన్, లెనొవొ ఏ6000ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ ఫోన్ ధర రూ.6,999 అని లెనొవొ ఇండియా డెరైక్టర్ (స్మార్ట్‌ఫోన్స్) సుధిన్ మాధుర్ చెప్పారు. షియోమి కంపెనీ రెడ్‌మి నోట్ 4జీ(ధర రూ.9,999), ఈ కామర్స్ సంస్థ, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్‌ను విక్రయిస్తున్నామని మాధుర్ పేర్కొన్నారు. ఈ నెల 28న జరిగే ఫ్లాష్ సేల్ మోడల్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఐదు అంగుళాల డిస్‌ప్లే ఫోన్ పనిచేస్తుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement