అప్పుడు తండ్రి.. ఇప్పుడు కుమారుడు | Suicide due to financial problems | Sakshi
Sakshi News home page

అప్పుడు తండ్రి.. ఇప్పుడు కుమారుడు

Dec 11 2014 11:09 PM | Updated on Nov 6 2018 7:56 PM

అప్పుడు తండ్రి.. ఇప్పుడు కుమారుడు - Sakshi

అప్పుడు తండ్రి.. ఇప్పుడు కుమారుడు

ఆర్థిక ఇబ్బందులతో రెండేళ్ల క్రితం తండ్రి.. ఇప్పుడు కుమారుడు ఆత్మహత్యలకు పాల్పడడంతో ఆ కుటుంబంలో అంతులేని విషాదం నెలకొంది.

ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య
 
రామాయంపేట : ఆర్థిక ఇబ్బందులతో రెండేళ్ల క్రితం తండ్రి.. ఇప్పుడు కుమారుడు ఆత్మహత్యలకు పాల్పడడంతో ఆ కుటుంబంలో అంతులేని విషాదం నెలకొంది. స్థానిక పోలీసుల కథనం మేరకు.. రామాయంపేట పట్టణానికి చెందిన కమ్మరి సుదర్శన్, రామలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. కమ్మరి దుకాణంతో కుటుంబం గడవక పోవడంతో పాటు అప్పులబాధ భరించలేక రెండేళ్ల క్రితం సుదర్శన్ తన దుకాణంలోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతరం కుమారుడు మహేష్ కుటుంబ బాధ్యతలు స్వీకరించి గత ఏడాది పెద్దసోదరి వివాహం చేశాడు.

తల్లి, చెల్లెలును పోషించుకుంటూ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. చెల్లెలు పెళ్లితో పాటు ఇతరత్రా ఖర్చులకు చేసిన అప్పులు రూ. 2 లక్షల వరకు పేరుకుపోయాయి. గత కొంతకాలంగా అప్పులబాధతో సతమతం అవుతున్న మహేష్ గురువారం తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనితో తల్లి, సోదరులు గుండెలవిసేలా విలపించారు. ఈ మేరకు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ-2 సందీప్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement