‘స్విస్’ కింగ్ ప్రణయ్ | Badminton: HS Prannoy wins the 2016 Swiss Open men's singles | Sakshi
Sakshi News home page

‘స్విస్’ కింగ్ ప్రణయ్

Mar 21 2016 12:44 AM | Updated on Sep 3 2017 8:12 PM

‘స్విస్’ కింగ్ ప్రణయ్

‘స్విస్’ కింగ్ ప్రణయ్

ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి... ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ...

 కెరీర్‌లో రెండో గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ సొంతం
బాసెల్ (స్విట్జర్లాండ్): ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి... ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ... భారత బ్యాడ్మింటన్ యువతార హెచ్.ఎస్.ప్రణయ్ తన ఖాతాలో రెండో గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. ఆదివారం ముగిసిన స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో ఈ కేరళ ప్లేయర్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో ప్రపంచ 27వ ర్యాంకర్ ప్రణయ్ 21-18, 21- 15తో ప్రపంచ 19వ ర్యాంకర్ మార్క్ జ్విబ్లెర్ (జర్మనీ)పై గెలిచాడు. 2014లో ఇండోనేసియా గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్‌ను సాధించిన ప్రణయ్ తాజా విజయంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు.

సెమీఫైనల్లో మూడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని విజయం సాధించిన ప్రణయ్ ఫైనల్లో మాత్రం తనకంటే మెరుగైన జ్విబ్లెర్‌పై ఆరంభం నుంచే ఆధిపత్యం కనబరిచాడు. 60 ఏళ్ల చరిత్ర కలిగిన స్విస్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్ సాధించిన రెండో భారతీయ క్రీడాకారుడిగా ప్రణయ్ గుర్తింపు పొందాడు. గతేడాది హైదరాబాద్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ విజేతగా నిలిచాడు. మహిళల విభాగంలో సైనా నెహ్వాల్ రెండుసార్లు ఈ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో ప్రణయ్‌కు 9 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 లక్షల 97 వేలు)తోపాటు 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement