'రాంలీలా'లో దీపికా, రణ్ వీర్ ల శృంగార లీలలు! | Deepika Padukone, Ranveer Singh's hot and romantic stills from 'Ramleela' | Sakshi
Sakshi News home page

'రాంలీలా'లో దీపికా, రణ్ వీర్ ల శృంగార లీలలు!

Sep 16 2013 3:59 PM | Updated on Apr 3 2019 6:23 PM

చారిత్రాత్మక ప్రేమ కథా చిత్రంగా ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రూపొందిస్తున్న రాంలీలాలో దీపికా పదుకొనె, రణ్ వీర్ సింగ్ లు నటిస్తున్నారు.

బాలీవుడ్ లో బెంగళూరు భామ దీపికా పదుకోనె, రాణ్ వీర్ సింగ్ ల మధ్య తెరమీదే కాకుండా బయటకూడా ప్రేమాయణం జోరుగానే సాగుతోందని ముంబై సినీ బజార్ లో రూమర్లు ఇటీవల కాలంలో జోరుగా షికారు చేస్తున్నాయి.

బాలీవుడ్ లో ఏ నోట విన్నా దీపికా, రణ్ వీర్ ల హల్ చల్ గురించేనని మీడియా కోడైకూస్తోంది.

వీరిద్దరూ కలిసి సంజయ్ లీలా భన్సాలీ రూపొందిస్తున్న రామ్ లీలా చిత్రంలో నటిస్తున్నారు.ఇటీవల దీపికా, రణ్ వీర్ లపై హాట్ హాట్ గా లవ్ సీన్లను షూటింగ్ చేశారన్న వార్త బాలీవుడ్ లో సెన్సెషనల్ టాపిక్ గా మారింది.

ఓ అందమైన చారిత్రాత్మక ప్రేమకథా చిత్రంగా రూపొందిస్తున్న రామ్ లీలా చిత్రంలో రామ్ పాత్రలో రణ్ వీర్, గుజరాతీ అమ్మాయి లీలాగా దీపికా నటిస్తోంది.

భారీ అంచనాలు ఈ చిత్రం నవంబర్ లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా ఓ ఐటమ్ సాంగ్ లో నర్తించింది.

Advertisement
 
Advertisement
Advertisement