జరం గోలీకీ దిక్కులేదు


తెలుగు రాష్ట్రాల్లో ఆస్పత్రులపై కాగ్‌ అసంతృప్తి

ఆరోగ్య కేంద్రాల్లో కనీసం అత్యవసర మందులు లేవు


సాక్షి, న్యూఢిల్లీ:

తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య రంగం పనితీరుపై కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వాస్పత్రుల్లో కనీసం అత్యవసర మందులూ అందుబాటులో లేవని, సాధా రణ మందుల విషయం గురించి చెప్పాల్సిన అవస రం లేదని పేర్కొంది. ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉందని, వసతులు న్నచోట సిబ్బంది లేరని వివరించింది.  వివిధ విభాగాల పనితీరుపై కాగ్‌ ఇచ్చిన నివేది కలను పార్లమెంటుకు కేంద్రం సమర్పించింది . 2011–12 నుంచి 2016 వరకు ఐదేళ్ల కాలంలో వైద్య రంగానికి రూ. లక్ష కోట్లను కేంద్రం కేటాయించ గా..మౌలిక వసతులు, సిబ్బంది కొరత, నిధు ల వ్యయం, మళ్లింపు, మందుల సర ఫరా, ఆస్పత్రుల దురవస్థ అంశాలను ఎంపిక చేసిన ప్రాంతాల్లో పరిశీలించి కాగ్‌ నివేదిక ఇచ్చింది. 2011 –12లో ఖర్చు చేయని నిధులు రూ. 7,375 కోట్లుండగా.. 2015–16 లో ఆ మొత్తం రూ. 9,509 కోట్లకు చేరిందని పేర్కొంది. ఏపీ, తెలంగాణ సహా 6 రాష్ట్రాల్లో వేరే పథకాలకు నిధులు మళ్లించారని తెలి పింది.ఎక్స్‌పైరీ తేదీలూ చూడరా?..

తెలంగాణ సహా మరికొన్ని రాష్ట్రాల్లో ఎక్స్‌పైరీ తేదీలనూ చూడకుండా రోగుల కు మందులు ఇచ్చారని కాగ్‌ పేర్కొం ది. ఆశా వర్కర్ల వద్ద నవజాత శిశువుల బరువు కొలిచే, గర్భిణులకు బీపీ చూసే పరికరాలు, డెలివరీ, ప్రెగ్నెన్సీ కిట్లు, పారాసెటమల్, ఐరన్‌ మాత్ర లు వంటివేవీ లేవంది. ఏపీ సహా అనేక రాష్ట్రాల్లో పలు పీహెచ్‌సీలు వైద్యులు లేకుం డానే పనిచేస్తున్నాయంది. 28 రాష్ట్రాల్లో కనీ సం ఫోలిక్‌ యాసిడ్‌ టాబ్లెట్లూ లేవని తెలి పింది. దేశవ్యాప్తంగా అంబులెన్స్‌ల కోసం రూ. 175. 26 కోట్లు విడుదల చేస్తే రూ. 155. 93 కోట్లను వినియోగించనేలేదని పేర్కొంది.పరికరాలున్నా.. సిబ్బంది లేరు..

తెలంగాణ జనాభాకు అనుగుణంగా 768 పీహెచ్‌సీలకు గాను 668 మాత్రమే ఉన్నాయని.. మరో 78 సీహెచ్‌సీలు అవసరమని కాగ్‌ తెలిపింది. ఏపీలో మరో 25 పీహెచ్‌సీలు, 104 సీహెచ్‌సీలు అవసర మని పేర్కొంది. రెండు రాష్ట్రాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో మౌలిక వసతులు లేవని తెలిపింది. అనేక హెల్త్‌ సెంటర్లకు ప్రజా రవాణా, విద్యుత్, తాగునీరు వసతి లేదని, భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తయినా వినియోగంలోకి రాలేదని వాపోయింది. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య పరికరాలున్నా.. సిబ్బంది లేక నిరుపయోగంగా ఉన్నాయంది. ఈ రాష్ట్రాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో కనీసం అత్యవసర మందులూ లేవని.. పారాసిటమల్, విటమిన్‌–ఏ, బీ–కాంప్లెక్స్, అల్బెండజోల్, గర్భ నిరోధక మాత్రలు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, గైనకా లజీకి సంబంధించిన కిట్లు వంటివేవీ లేవని తెలిపింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top