
విధిని గెలవడం సాధ్యమా?
మనిషి కలలో జరిగే సంఘటనలు నిజ జీవితంలో జరిగితే జీవితమే విపరీతం అవుతుంది. ఆ విపరీతాలనే విధి అనుకుంటే దాన్ని
మనిషి కలలో జరిగే సంఘటనలు నిజ జీవితంలో జరిగితే జీవితమే విపరీతం అవుతుంది. ఆ విపరీతాలనే విధి అనుకుంటే దాన్ని మనిషి గెలవగలడా? లేదా? అన్న ప్రశ్నలకు సమాధానమే విధి మది ఉల్టా అంటున్నారు ఆ చిత్ర దర్శకుడు విజయ్ బాలాజీ. ఏఆర్.మురుగదాస్ శిష్యుడైన ఈయన మెగా ఫోన్ పట్టిన ఈ చిత్రంలో డార్లింగ్-2 చిత్రం ఫేమ్ రమీజ్‌రాజా కథానాయకుడిగానూ జననీఅయ్యర్ నాయకిగానూ నటిస్తున్నారు. రైట్ మీడియా వర్క్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో డేనియల్ బాలాజీ, కరుణాకరన్, సెండ్రాయన్, చిత్రాలక్ష్మణన్,జ్ఞానసంబంధం ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది కామెడీతో కూడిన థ్రిల్లర్ కథా చిత్రం అని తెలిపారు.
ఈ చిత్రం కోసం ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ ఒక పాటను పాడారని తెలిపారు. ఈ పాటను హీరోహీరోయిన్లపై పాండిచ్చేరిలో చిత్రీకరించినట్లు వెల్లడించారు. అదే విధంగా గానాబాలా, ఆంథోనిదాస్ పాడిన నాన్‌దాండా మాస్ నీదాన్ ఎన్ బాస్ అనే పాటను రమీజ్‌రాజా, డేనియల్ బాలాజీ, కరుణాకరన్, సెండ్రాయన్‌లపై చిత్రీకరించినట్లు తెలిపారు. తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న విధి మది ఉల్టా చిత్రం అన్ని వర్గాలను అలరించే జనరంజక చిత్రంగా ఉంటుందని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతాన్ని అశ్విన్, పాటలను కపిలన్, ఎడిటింగ్‌ను భువన సుందర్, ఫైట్స్ కంపోజింగ్‌ను శ్యామ్ ఆంటోనీ అందిస్తున్నారు.