రజనీ సెల్వీ! | Jyothika to play a Rajinikanth fan in her next? | Sakshi
Sakshi News home page

రజనీ సెల్వీ!

May 9 2018 12:31 AM | Updated on May 9 2018 12:31 AM

Jyothika to play a Rajinikanth fan in her next? - Sakshi

రజనీకాంత్‌కి ఎంతమంది అభిమానులు? అంటే చెప్పడం కష్టం. అభిమానులు కానివాళ్లు ఎంతమంది? అంటే వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. వీరిలో జ్యోతిక ఒకరు. రజనీ అంటే ఆమెకు అభిమానం. రీల్‌పై కూడా తన అభిమానాన్ని చూపెట్టనున్నారట. ఓ సినిమాలో ఆమె రజనీకాంత్‌ అభిమానిగా నటించనున్నారని టాక్‌. ఇది షాజిద్‌ దర్శకత్వంలో మంజు వారియర్‌ ముఖ్యతారగా రూపొందిన మలయాళ చిత్రం ‘మోహన్‌లాల్‌’కి రీమేక్‌. మలయాళంలో మోహన్‌లాల్‌ అభిమానిగా హీరోయిన్‌ మంజు వారియర్‌ నటించారు.

తమిళంలో రజనీ అభిమానిగా కథ మార్చుతున్నారట. మలయాళ చిత్రానికి కథ రాసిన సునీష్‌ వర్నాడ్, చిత్రదర్శకుడు సాజిద్‌ యహియా తమిళ వెర్షన్‌కి జ్యోతిక అయితేనే బాగుంటుందనుకున్నారట. త్వరలో ‘మోహన్‌లాల్‌’ సినిమాని ఆమెకు చూపించాలనుకుంటున్నారు. మరి.. నచ్చితే జ్యోతిక కాదంటారా? అన్నట్లు.. ఈ చిత్రానికి ‘రజనీ సెల్వీ’ అనే టైటిల్‌ని అనుకుంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement