‘‘పిల్లా నువ్వు లేని జీవితం’ విజయం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. సక్సెస్ వేరు. మనసుకి నచ్చిన సక్సెస్ వేరు. ఆ చిత్రం రెండోరకం అనుభూతిని మిగిల్చింది’’ అని దర్శకుడు ఎ.యస్. రవికుమార్ చౌదరి అన్నారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా రవికుమార్ చౌదరి మాట్లాడుతూ - ‘‘గోపీచంద్‌తో ‘యజ్ఞం’ చేసిన పదేళ్లకు మళ్లీ తనతో కొత్త సినిమా చేస్తున్నాను. హార్ట్ టచింగ్ ఎమోషన్స్ ఉన్న మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఇప్పటివరకూ గోపీచంద్ సినిమాల్లో హయ్యస్ట్ కాస్టింగ్, బడ్జెట్‌తో రూపొందుతోన్న చిత్రం ఇదే. టైటిల్ ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఈ చిత్రం ద్వారా ఒక మంచి స్క్రిప్ట్‌ను హ్యాండిల్ చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత ఆనంద్ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నే రవి, రచయిత శ్రీధర్ సీపానలకు నా ధన్యవాదాలు.
డిసెంబర్ 25న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. ఆ రోజు పెద్ద పండగ చేసుకోనున్నాం. అంత కాన్ఫిడెన్స్ ఉంది’’ అన్నారు. ‘‘రకరకాల కారణాల వల్ల ఇంతకు ముందు నా కెరీర్లో సినిమాకీ, సినిమాకీ మధ్య గ్యాప్ ఎక్కువుం డేది. ఇకపై గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తా’’ అని రవికుమార్ చౌదరి చెప్పారు. ‘యజ్ఞం’, ‘బ్రోకర్’ చిత్రాల్లో లాగా ఇకపైనా నటిస్తారా అని అడిగినప్పుడు - ‘‘సరదా కోసం ఆ చిత్రాల్లో చిరుపాత్రలు చేశాను. నా దృష్టిలో డెరైక్టర్ ఇంజిన్ లాంటివాడు. నేనెప్పుడూ అలా ట్రైన్ ఇంజిన్లానే ఉండాలనుకుంటున్నా. అన్ని బోగీలను ఇంజిన్‌లా లాగడంలో ఓ తృప్తి ఉంటుంది’’ అని రవికుమార్ అన్నారు. ‘‘ఏ నిర్మాత అయినా తాను నిర్మించే చిత్రం సేలబులిటీని చూసుకుంటాడు. హీరోలు కూడా సక్సెస్ఫుల్ డెరైక్టర్‌తో సినిమా చేయాలనుకుంటారు. నేనూ హీరోల సక్సెస్ ట్రాక్‌ను పరిశీలించుకుంటాను. సో.. సక్సెస్‌లో ఉన్నవాళ్లకే అవకాశాలు ఇస్తారనే విషయాన్ని నేను తప్పుపట్టను’’ అని చెప్పారు. ఓ యువ హీరోతో పెద్ద సంస్థలో జనవరిలో సినిమా చేయనున్నానని, భవిష్యత్తులో కల్యాణ్ రామ్, సాయిధరమ్‌లతో చేసే అవకాశం ఉందని రవికుమార్ చౌదరి తెలిపారు.
ఆ రోజు... పెద్ద పండగ చేసుకుంటాం!
Published Tue, Aug 25 2015 12:40 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ప్రశాంతంగా జాతర జరుపుకోవాలి
నేరచరిత లేనివారిని బైండోవర్ చేయొద్దు
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
టమాట సీజన్ ప్రారంభం
No Headline
కూడేరులో జూనియర్ కాలేజ్ ఏర్పాటు
బాధ్యతగా విధులు నిర్వర్తించండి
ఆ ఇద్దరు టీచర్లపై విద్యాశాఖ ప్రేమ
ఆకట్టుకున్న మాక్‌డ్రిల్
27 నుంచి విజయవాడ రైలు రద్దు
తప్పక చదవండి
- మాక్స్వెల్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
- జీతాలపై ప్రభావం.. ఎయిర్ఇండియా ఉద్యోగుల ఆందోళన!
- విడాకుల రూమర్స్.. ఈ ప్రపంచం గురించి పట్టించుకోనంటున్న నటుడు
- ఒకపుడు జర్నలిస్టు, అంబానీని మించిన ఇంద్రభవనంలో : అత్యంత అందమైన రాణి
- ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు.. ఈసీ సీరియస్
- ఈవెంట్లో ప్రియాంక చోప్రా.. వందల కోట్ల విలువైన నెక్లెస్‌తో!
- T20: బంగ్లాకు షాకిచ్చిన పసికూన.. మినీ టీమిండియా అంటూ..
- చనుగొండ్లలో చిరుత పిల్లల సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు
- ఇజ్రాయెల్ హెచ్చరిక.. రాయబారులు వెనక్కి రండి
- నేమ్‌ప్లేట్ మార్చేసిన సూపర్ మామ్ సానియా మీర్జా ఫోటోలు వైరల్
Advertisement