రోబోల కోసం కొత్తరకం చర్మం | scientiests developes smart skin for robos | Sakshi
Sakshi News home page

రోబోల కోసం కొత్తరకం చర్మం

Apr 15 2016 9:41 AM | Updated on Aug 30 2018 5:27 PM

రోబోల కోసం కొత్తరకం చర్మం - Sakshi

రోబోల కోసం కొత్తరకం చర్మం

రోబోల కోసం చైనా శాస్త్రవేత్తలు కొత్తరకం చర్మాన్ని తయారుచేశారు.

బీజింగ్: రోబోల కోసం చైనా శాస్త్రవేత్తలు కొత్తరకం చర్మాన్ని తయారుచేశారు. పారదర్శకంగా ఉండే ఈ చర్మం సాయంతో రోబోలు తమ చుట్టూ ఉన్న పరిసరాలను స్పృశించి, వాటి గురించి అర్థం చేసుకుంటాయి. ఇదివరకే ఇటువంటి చర్మాన్ని తయారు చేసినా దాని కోసం వేర్వేరు రకాల 'స్ట్మార్ట్ స్కిన్స్'ను వాడారు. దీనివల్ల చర్మం మందం పెరగడంతోపాటు ఖర్చు కూడా పెరిగింది. పైగా ఇది పనిచేసేందుకు బ్యాటరీలను కూడా వినియోగించాల్సి వచ్చేది.

అయితే చైనాకు చెందిన పెకింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించిన చర్మంలో అల్ట్రా థిన్ ప్లాస్టిక్ ఫిల్ములను వాడారు. సిల్వర్ నానోవైర్లను ఉపయోగించి కేవలం నాలుగే ఎలక్ట్రోడ్లతో ఈ చర్మాన్ని రూపొందించారు. రోబో చేతులు, కాళ్లను కదిలించినప్పుడు విద్యుత్ ఉత్పత్తి అయ్యే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంతో అదనంగా బ్యాటరీల ద్వారా విద్యుత్ను సరఫరా చేయాల్సిన పనిలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement