ప్లాస్టిక్‌ అనే నేను.. మిమ్మల్ని ముంచేస్తున్నాను..

Recycling process of plastic is not an east thing - Sakshi

ప్లాస్టిక్‌.. మన అవసరం కోసం సృష్టించాం.. అవసరానికి వాడుకున్నాం.. తర్వాత తర్వాత అవసరాన్ని మించి వాడుకున్నాం.. దీంతో ఇప్పుడది మనల్ని వాడేసుకుంటోంది.. ఈ ప్రపంచంతో ఆడేసుకుంటోంది.. భూతమై భయపెడుతోంది.. పుడమి నిండా పరిచేసుకుని.. పెను విలయాన్ని సృష్టిస్తోంది.. జనంతోపాటు జలచరాలను కబళి స్తోంది.. ఏటా ప్లాస్టిక్‌ వ్యర్థాల వల్ల లక్షలాది జలచరాలు, పక్షులు మృత్యువాత పడుతున్నాయి.

మీకో విషయం తెలుసా? ఒక ప్లాస్టిక్‌ బాటిల్‌ పూర్తిగా భూమిలో కలిసిపోవడానికి(బయోడీగ్రేడ్‌) 450 ఏళ్ల సమయం పడుతుంది. దీనికి విరుగుడు ఏమిటి? వాడకం తగ్గించడం.. రీసైక్లింగ్‌ ప్రక్రియను పెంచడం.. 1980 వరకూ  రీసైక్లింగ్‌ ఉండేది కాదు.. తర్వాత మొదలైంది. ప్రస్తుతం ఏటా ఉత్పత్తవుతున్న ప్లాస్టిక్‌(30 కోట్ల టన్నులు)లో 18% వరకూ రీసైక్లింగ్‌ అవుతోంది.

అయితే.. అన్ని రకాల ప్లాస్టిక్‌లు రీసైకిల్‌ కావు.. కొన్ని సులువుగా అయితే.. మరికొన్నిటిని చేయడం కష్టం. ప్లాస్టిక్‌ బాటిళ్లు వంటివాటిని రీసైక్లింగ్‌ చేయడం ఈజీ.. స్ట్రాలు వంటివాటిని చేయడం కష్టం.. కొందరు నిపుణులైతే.. డ్రింక్స్‌ తాగడానికి స్ట్రాలను వాడొద్దని చెబుతున్నారు. దీని వల్ల ఎంతో కొంత పుడమికి మనం మేలు చేయవచ్చని చెబుతున్నారు. అసలు ప్లాస్టిక్‌లో రకాలు? వాటి రీసైక్లింగ్‌ తీరుపై లుక్కేస్తే..      – సాక్షి, తెలంగాణ డెస్క్‌

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top