1869 వరకు హైదరాబాద్ పోలీస్ కమిషనరే మున్సిపల్ కమిషనర్‌గా, మేజిస్ట్రేట్‌గా సర్వాధికాధికారిగా ఉండేవారు.
1869 వరకు హైదరాబాద్ పోలీస్ కమిషనరే మున్సిపల్ కమిషనర్‌గా, మేజిస్ట్రేట్‌గా సర్వాధికాధికారిగా ఉండేవారు. 1869లో హైదరాబాద్ మున్సిపల్ బోర్డు, చాదర్‌ఘాట్ బోర్డుల్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో నాలుగు, చాదర్‌ఘాట్ బోర్డులో ఐదు డివిజన్లు ఉండేవి. అప్పట్లో విస్తీర్ణం 55 చ.కి.మీ. మాత్రమే. జనాభా 3.50 లక్షలు. 1886లో చాదర్‌ఘాట్ మున్సిపల్ బోర్డు పూర్తిస్థాయి మున్సిపాలిటీగా మారింది.
1934 తొలిసారి ఓటుహక్కు వినియోగం: హైదరాబాద్ మున్సిపాలిటీలో చాదర్ ఘాట్‌ను 1933లో విలీనం చేశారు. హైదరాబాద్ మున్సిపల్ యాక్ట్‌కు చేసి ‘కార్పొరేషన్’ హోదా కల్పించారు. 1934లో హైదరాబాద్‌కు తొలిసారి ఎన్నికలు జరిగాయి. 1937లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాలను కలిపి జూబ్లీహిల్స్ మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు.
నేతల మధ్య విభేదాలతో 1942లో హైదరాబాద్‌కు కార్పొరేషన్ హోదా రద్దు చేశారు. 1945లో సికింద్రాబాద్ మున్సిపాలిటీ ఏర్పాటైంది. 1950లో అమల్లోకి వచ్చిన హైదరాబాద్ యాక్ట్‌తో హైదరాబాద్, సికింద్రాబాద్ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ మున్సిపాలిటీని హైదరాబాద్‌లో విలీనం చేశారు.
1960 ‘ఎంసీహెచ్’గా మార్పు: 1960, ఆగస్టు 3న జంటనగరాల కార్పొరేషన్లు విలీనమై ‘మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్’ (ఎంసీహెచ్)గా అవతరించింది. ఆ సమయంలో నగర విస్తీర్ణం 73 చ.కి.మీ. కార్పొరేషన్ బడ్జెట్ రూ. 1.5 కోట్లు. 2005 నాటికి వంద డివిజన్లతో 179 చ.కి.మీ. విస్తరించింది. బల్దియా బడ్జెట్ రూ. 400 కోట్లకు పెరిగింది.
2007 జీహెచ్‌ఎంసీ అవతరణ: నగర పరిపాలన విస్తీర్ణం పెంచాలని నిర్ణయించి 2007 ఏప్రిల్ 16న శివార్లలోని 12 మున్సిపాలిటీలను విలీనం చేసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ)గా ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీకి 2009 నవంబర్‌లో తొలిసారి ఎన్నికలు జరిగాయి.