- మలుపు వద్ద అతివేగం వల్లే ఘటన
సాక్షి, తిరుమల: విధి వక్రీకరించింది. కుటుంబ సభ్యులతో కలసి దేవదేవుడిని దర్శించుకుందామని మంగళవారం తమిళనాడు నుండి ఓ వృద్ధుడు తిరుమలకు వచ్చారు. ఆర్టీసీ బస్సు ప్రమాదంలో పొలిమేరలోనే దుర్మణం చెందారు. తమిళనాడులోని కోయంబత్తూరుకు సమీపంలోని పుల్లాచ్చికి చెందిన మారిముత్తు (63) మొత్తం ఐదు మంది కుటుంబ సభ్యులతో కలసి తిరుమలకు వచ్చారు. తిరుపతి అలిపిరి డిపోకు చెందిన ఏపీ29జెడ్ 0058 ఆర్టీసీ బస్సులో తిరుమలకు బయలుదేరారు. మధ్యాహ్నం 3 గంటలకు బస్సు తిరుమలలోని జీఎన్సీ టోల్‌గేట్‌కు చేరుకుంది. తర్వాత మలుపు వద్ద అతివేగంగా బస్సు తిరిగింది. దీంతో అక్కడే బస్సు మెట్లపై ఉన్న వృద్ధుడు అతివేగం వల్ల అదుపు తప్పి రోడ్డుపై పడ్డాడు. తీవ్ర రక్తగాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. 108 అంబులెన్స్‌లో ఎక్కించి, అశ్విని ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు మధ్యాహ్న భోజనానికి వెళ్లటంతో వైద్య చర్యలు ఆలస్యమయ్యాయి. తర్వాత అపోలో ప్రథమ చికిత్సా కేంద్రానికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్దారించారు. తిరుమలకు చేరుకున్నామన్న ఆనందంలో ఆ వృద్ధుడు బస్సు మెట్ల వరకు రావటం, మలుపు వద్ద అతివేగంతో బస్సును తిప్పటం వల్లే ఈ ఘటన జరిగింది. కళ్లముందే జరిగిన ఘటనతో బాధితుడి కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు. సంఘటన సమయంలో టూ టౌన్ ఎస్ఐ తులసీరామ్ స్టేషన్లోనే ఉండటంతో క్షణాల్లోనే అక్కడికి చేరుకుని బాధితుడికి వైద్యం అందించే చర్యలు చేపట్టినా తుది శ్వాస విడవటం విషాదం. మృతదేహాన్ని అంబులెన్స్‌లో సొంతూరుకు తరలించే ఏర్పాట్లు చేశారు.
ఆర్టీసీ బస్సు ప్రమాదంలో ఒకరి మృతి
Published Tue, Aug 23 2016 9:30 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ప్రశాంతంగా జాతర జరుపుకోవాలి
నేరచరిత లేనివారిని బైండోవర్ చేయొద్దు
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
టమాట సీజన్ ప్రారంభం
No Headline
కూడేరులో జూనియర్ కాలేజ్ ఏర్పాటు
బాధ్యతగా విధులు నిర్వర్తించండి
ఆ ఇద్దరు టీచర్లపై విద్యాశాఖ ప్రేమ
ఆకట్టుకున్న మాక్‌డ్రిల్
27 నుంచి విజయవాడ రైలు రద్దు
తప్పక చదవండి
- మాక్స్వెల్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
- జీతాలపై ప్రభావం.. ఎయిర్ఇండియా ఉద్యోగుల ఆందోళన!
- విడాకుల రూమర్స్.. ఈ ప్రపంచం గురించి పట్టించుకోనంటున్న నటుడు
- ఒకపుడు జర్నలిస్టు, అంబానీని మించిన ఇంద్రభవనంలో : అత్యంత అందమైన రాణి
- ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు.. ఈసీ సీరియస్
- ఈవెంట్లో ప్రియాంక చోప్రా.. వందల కోట్ల విలువైన నెక్లెస్‌తో!
- T20: బంగ్లాకు షాకిచ్చిన పసికూన.. మినీ టీమిండియా అంటూ..
- చనుగొండ్లలో చిరుత పిల్లల సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు
- ఇజ్రాయెల్ హెచ్చరిక.. రాయబారులు వెనక్కి రండి
- నేమ్‌ప్లేట్ మార్చేసిన సూపర్ మామ్ సానియా మీర్జా ఫోటోలు వైరల్
Advertisement