
ప్రపంచ స్నూకర్ చాంపియన్‌గా జావో జిన్‌టాంగ్
ఫెఫీల్డ్ (ఇంగ్లండ్): బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, డైవింగ్, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, షూటింగ్, వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాంశాల్లో ఎంతోమంది ప్రపంచ చాంపియన్‌లను అందించిన చైనా నుంచి తాజాగా ప్రొఫెషనల్ స్నూకర్ క్రీడాంశంలో తొలిసారి విశ్వవిజేత అవతరించాడు. ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచ ప్రొఫెషనల్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో చైనాకు చెందిన 28 ఏళ్ల జావో జిన్‌టాంగ్ మొదటిసారి చాంపియన్‌గా నిలిచాడు. ‘బెస్ట్ ఆఫ్ 35’ ఫ్రేమ్స్ పద్ధతిలో రెండు రోజులపాటు జరిగిన ఫైనల్లో క్వాలిఫయర్ జావో జిన్‌టాంగ్ 18–12 ఫ్రేమ్‌ల తేడాతో వేల్స్‌కు చెందిన మూడుసార్లు ప్రపంచ చాంపియన్ మార్క్ విలియమ్స్‌పై విజయం సాధించాడు. జావో జిన్‌టాంగ్ 141–0, 100–38, 47–44, 28–66, 77–49, 71–61, 119–0, 95–0, 0–86, 8–65, 85–9, 74–0, 14–62, 0–72, 96–23, 71–63, 43–71, 76–5, 18–66, 65–7, 85–45, 104–1, 14–84, 79–26, 63–36, 30–101, 1–62, 6–96, 0–73, 110–8 స్కోరుతో 50 ఏళ్ల విలియమ్స్‌ను ఓడించాడు. విజేత జిన్‌టాంగ్‌కు 5,00,000 పౌండ్‌లు (రూ. 5 కోట్ల 63 లక్షలు) ప్రైజ్‌మనీగా దక్కింది.