sun risers
-
సన్‌రైజర్స్ టీమ్ ఓనర్ వద్ద ప్రీమియం కార్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) యజమానిగా, సన్ టీవీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కావ్య మారన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. బిజినెస్‌తోపాటు ఆమెకు కార్లంటే మక్కువ ఎక్కువే. ఆమె గ్యారేజీని ప్రీమియం కార్లతో నింపేయడమే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం తన వద్ద ఉన్న హై-ఎండ్ కార్ల వివరాలు కింద తెలుసుకుందాం.రోల్స్ రాయిస్ ఫాంటమ్ 8 ఈడబ్ల్యూబీదీని ధర భారతదేశంలో సుమారు రూ.12.2 కోట్లు.బెంట్లీ బెంటాయ్గా ఈడబ్ల్యూబీఈ బ్రాండ్ తయారు చేసిన మొదటి ఎస్యూవీ ఇది. దీని ధర సుమారు రూ.6 కోట్లు. ఇది 4.0-లీటర్ ట్విన్-టర్బో వి8 ఇంజిన్‌తో వస్తుంది.బీఎమ్‌డబ్ల్యూ ఐ7ఆమె వద్ద బ్లాక్ సఫైర్ మెటాలిక్ పెయింట్‌తో కూడిన బీఎమ్‌డబ్ల్యూ ఐ7 కారు ఉంది. దీని ధర రూ.2.5 కోట్లుగా ఉంది.ఫెరారీ రోమాఇటాలియన్ ఫెరారీ గ్రాండ్ టూరింగ్ కారు ధర సుమారు రూ.3.76 కోట్లు.కావ్య మారన్ 1999 నవంబర్ 3న తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజీలో బీకామ్ పూర్తి చేసిన ఆమె న్యూయార్క్ యూనివర్సిటీలోని స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ చేశారు. ఎస్ఆర్హెచ్, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ సహా సన్ గ్రూప్ స్పోర్ట్స్ ఫ్రాంచైజీల నిర్వహణలో కావ్య మారన్ కీలక పాత్ర పోషిస్తోంది.ఇదీ చదవండి: ఇంకెంత కాలం జాబ్ చేస్తారు.. ఇకనైనా మారండిఆమె సారథ్యంలో 2016లో ఐపీఎల్ ఛాంపియన్షిప్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 2018, 2024లో రన్నరప్‌గా నిలిచింది. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 2023, 2024లో ఎస్ఏ20 లీగ్ టైటిల్ గెలుచుకుంది. 2024లో దేవి అవార్డ్స్‌లో ‘ఫేస్ అండ్ ఫోర్స్ బిహైండ్ సన్‌రైజర్స్ హైదరాబాద్’ అవార్డు అందుకున్నారు. ఆమె నికర ఆస్తుల విలువ సుమారు 50 మిలియన్ డాలర్లు (రూ.409 కోట్లు) ఉంటుందని అంచనా. -
వార్నర్‌పై వేచి చూస్తున్నాం!
హైదరాబాద్: ఐపీఎల్ జట్టు రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్సీ నుంచి స్టీవ్ స్మిత్ తప్పుకోగానే ఇప్పుడు అందరి దృష్టి మరో కెప్టెన్ డేవిడ్ వార్నర్‌పై పడింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ఉన్న వార్నర్‌ను తప్పించే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీమ్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ వెల్లడించాడు. వార్నర్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తీసుకునే చర్యలను బట్టి తాము ముందుకు వెళతామని అతను స్పష్టం చేశాడు. ‘కేప్‌టౌన్‌లో జరిగిన ఘటన దురదృష్టకరం. అయితే సన్‌రైజర్స్ కెప్టెన్సీ గురించి అప్పుడే వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతుంది. మేం క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం. మాకు ప్రస్తుతం ట్యాంపరింగ్ అంశానికి సంబంధించి పరిమిత సమాచారం మాత్రమే అందుబాటులో ఉంది. సన్‌రైజర్స్ జట్టును ఇన్నేళ్లు వార్నర్ అద్భుతంగా నడిపించాడనంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికైతే మేం కెప్టెన్సీ మార్పు గురించి ఆలోచించడం లేదు’ అని లక్ష్మణ్ చెప్పాడు. -
పాండ్యాకు తృటిలో తప్పిన ప్రమాదం
-
ఆశలు సజీవం
-
ఆశలు సజీవం
చెన్నైని చిత్తు చేసిన హైదరాబాద్ చెలరేగిన వార్నర్, ధావన్ ధోని, హస్సీల శ్రమ వృథా రాంచీ: డేవిడ్ వార్నర్ (45 బంతుల్లో 90; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరోచిత పోరాటం, శిఖర్ ధావన్ (49 బంతుల్లో 64 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సమయోచిత బ్యాటింగ్‌తో కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చెలరేగిపోయింది. భారీ లక్ష్యాన్ని నీళ్లు తాగినంత సులువుగా ఛేదించి ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో చెన్నైపై ఘన విజయం సాధించింది. జేఎస్సీఏ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 3 వికెట్లకు 185 పరుగులు చేసింది. ధోని (41 బంతుల్లో 57 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), డేవిడ్ హస్సీ (33 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), స్మిత్ (28 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) విజృంభించారు. స్మిత్ రెండు కీలక భాగస్వామ్యాలతో శుభారంభాన్నిచ్చాడు. అనూహ్యంగా రనౌటైన డుప్లెసిస్ (11 బంతుల్లో 19; 4 ఫోర్లు)తో కలిసి తొలి వికెట్‌కు 33 పరుగులు; రైనా (4)తో కలిసి రెండో వికెట్‌కు 35 పరుగులు జోడించాడు. అయితే ధోని, హస్సీలు నాలుగో వికెట్‌కు 68 బంతుల్లో అజేయంగా 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో చెన్నై భారీ స్కోరు చేసింది. కరణ్ శర్మ 2 వికెట్లు తీశాడు. తర్వాత హైదరాబాద్ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగులు చేసి గెలిచింది. వార్నర్, ధావన్ ధాటిగా ఆడుతూ తొలి 10 ఓవర్లలో 100 పరుగులు చేసి శుభారంభాన్నిచ్చారు. ఇందులో ధావన్ 16 పరుగులు చేస్తే, వార్నర్ 80 పరుగులు సాధించాడు. కొద్దిసేపటికే వార్నర్ అవుట్‌కావడంతో తొలి వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. నమన్ ఓజా (19), ఫించ్ (7), స్యామీ (0) వెంటవెంటనే అవుటైనా ధావన్ నిలకడగా ఆడి లాంఛనం పూర్తి చేశాడు. హస్టింగ్స్, జడేజా, రైనా తలా ఓ వికెట్ తీశారు. వార్నర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. స్కోరు వివరాలు చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: స్మిత్ ఎల్బీడబ్ల్యు (బి) కరణ్ శర్మ 47; డుప్లెసిస్ రనౌట్ 19; రైనా (సి) ఫించ్ (బి) కరణ్ శర్మ 4; డేవిడ్ హస్సీ నాటౌట్ 50; ధోని నాటౌట్ 57; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 185. వికెట్ల పతనం: 1-33; 2-68; 3-77 బౌలింగ్: భువనేశ్వర్ 4-0-36-0; స్టెయిన్ 4-0-43-0; కరణ్ శర్మ 4-0-19-2; రసూల్ 4-0-35-0; ఇర్ఫాన్ 3-0-34-0; స్యామీ 1-0-11-0. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (బి) హస్టింగ్స్ 90; ధావన్ నాటౌట్ 64; ఓజా (సి) నేగి (బి) రైనా 19; ఫించ్ రనౌట్ 7; స్యామీ (సి) డుప్లెసిస్ (బి) జడేజా 0; వేణుగోపాల రావు నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: (19.4 ఓవర్లలో 4 వికెట్లకు) 189. వికెట్ల పతనం: 1-116; 2-168; 3-176; 4-184. బౌలింగ్: మోహిత్ శర్మ 3-0-33-0; అశ్విన్ 4-0-29-0; హస్టింగ్స్ 3-0-29-1; జడేజా 3.4-0-42-1; నేగి 4-0-38-0; రైనా 2-0-17-1. నేటి మ్యాచ్ కీలకం ఐపీఎల్లో నేడు పంజాబ్, రాజస్థాన్ల మధ్య జరిగే మ్యాచ్ ఫలితం కోసం సన్‌రైజర్స్ ఎదురు చూడాలి. ఒకవేళ రాజస్థాన్ గెలిస్తే... ఇటు సన్‌రైజర్స్, అటు ముంబై కూడా ప్లే ఆఫ్ ఆశలు వదులుకోవాల్సిందే. ఒకవేళ పంజాబ్ గెలిస్తే... సన్‌రైజర్స్ తమ చివరి మ్యాచ్‌లో కోల్‌కతాపై భారీ తేడాతో గెలిచి రన్‌రేట్‌ను మెరుగుపరుచుకోవాలి. దీనితో పాటు లీగ్‌లో చివరి మ్యాచ్ (రాజస్థాన్ ్ఠ ముంబై) ఫలితం కోసం చూడాలి. -
సన్‌రైజర్స్ ఘన విజయం
-
చివర్లో ‘వెలిగారు’
సన్‌రైజర్స్ ఘన విజయం 7 వికెట్లతో బెంగళూరు చిత్తు రాణించిన వార్నర్, ధావన్ కోహ్లి శ్రమ వృథా ఈ సీజన్లో సొంతగడ్డపై ఉన్న నాలుగు మ్యాచ్‌ల్లో తొలి మూడు ఓడిపోయి ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకున్న సన్‌రైజర్స్... చివరి మ్యాచ్‌లో మాత్రం అద్భుతంగా ఆడింది. కాస్త ఆలస్యంగానైనా హైదరాబాద్ అభిమానులకు విజయాన్ని రుచిచూపించి... ఈ సీజన్‌కు సొంతగడ్డపై మ్యాచ్‌లను ముగించింది. సాక్షి, హైదరాబాద్: తాము ముందుకెళుతున్నారా? లేక బెంగళూరును ముంచారా? మంగళవారం ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విజయం తర్వాత ఉదయించిన ప్రశ్న ఇది. మిగిలిన అన్ని మ్యాచ్‌లూ గెలిచినా కచ్చితంగా ప్లే ఆఫ్‌కు చేరతారని నమ్మకం లేని దశలో సన్‌రైజర్స్ తమ ఆటస్థాయిని ఒక్కసారిగా పెంచింది. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం అనుకున్న బెంగళూరుకు షాక్ ఇచ్చింది. ఆల్‌రౌండ్ నైపుణ్యంతో హైదరాబాద్ జట్టు బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌ను ఏడు వికెట్లతో ఓడించి... ఈ సీజన్లో సొంతగడ్డపై మ్యాచ్‌లను ముగించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (41 బంతుల్లో 67; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా, ఏబీ డివిలియర్స్ (17 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు మెరిపించాడు. అనంతరం సన్‌రైజర్స్ 19.4 ఓవర్లలో 3 వికెట్లకు 161 పరుగులు సాధించింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ డేవిడ్ వార్నర్ (46 బంతుల్లో 59; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), శిఖర్ ధావన్ (39 బంతుల్లో 50; 7 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 75 బంతుల్లోనే 100 పరుగులు జోడించి విజయాన్నందించారు. కీలక భాగస్వామ్యాలు... భువనేశ్వర్ హైదరాబాద్‌కు శుభారంభం అందించాడు. ఐదో బంతికే పార్థివ్ (4)ను పెవిలియన్ పంపించగా...మరో వైపు స్టెయిన్ పరుగులు ఇవ్వకుండా కట్టడి చేశాడు. ఫలితంగా ఆర్సీబీ ఇన్నింగ్స్ మందకొడిగా సాగింది. ఇబ్బంది పడుతూ ఆడిన గేల్ (20 బంతుల్లో 14; 1 ఫోర్) కరణ్ బౌలింగ్‌లో తొలి బంతికే అవుటయ్యాడు. పవర్‌ప్లేలో ఆ జట్టు 25 పరుగులు మాత్రమే చేయగలిగింది. యువరాజ్ (25 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్), కోహ్లి కలిసి ఇన్నింగ్స్ నడిపించారు. ఆరంభంలో మెల్లగా ఆడుతూ 19 బంతుల్లో 18 పరుగులు చేసిన కోహ్లి ఆ తర్వాత దూకుడు పెంచాడు. ఈ జోడి 43 బంతుల్లో 57 పరుగులు జోడించిన అనంతరం భారీ షాట్‌కు ప్రయత్నించి యువీ వెనుదిరిగాడు. డివిలియర్స్ అండతో దూసుకుపోయిన కోహ్లి 34 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 31 బంతుల్లోనే 61 పరుగులు జత చేసిన అనంతరం ఐదు పరుగుల వ్యవధిలో వీరిద్దరు వెనుదిరిగారు. తొలి 10 ఓవర్లలో 48 పరుగులు మాత్రమే చేసిన బెంగళూరు ఆ తర్వాతి 10 ఓవర్లలో 112 పరుగులు చేసింది. . ఓపెనింగ్ అదుర్స్... సన్‌రైజర్స్‌కు ధావన్, వార్నర్ అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. 39 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే ధావన్ రనౌటయ్యాడు. ఆ తర్వాత 41 బంతుల్లో సీజన్లో ఐదో అర్ధ సెంచరీ చేసిన వార్నర్, ఆరోన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. వార్నర్ అవుటయ్యాక 3.5 ఓవర్లలో 35 పరుగులు చేయాల్సిన స్థితిలో కాస్త ఒత్తిడికి లోనైనా... నమన్ ఓజా (20 బంతుల్లో 24; 2 సిక్స్‌లు)తో పాటు చివర్లో ఫించ్ (11 నాటౌట్), స్యామీ (10 నాటౌట్) కలిసి జట్టును గెలిపించారు. ఆరోన్ వేసిన 19వ ఓవర్లో 2 సిక్స్‌లు సహా 16 పరుగులు రావడంతో గెలుపు సులువైంది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: గేల్ (సి) రసూల్ (బి) కరణ్ 14; పార్థివ్ (ఎల్బీ) (బి) భువనేశ్వర్ 4; కోహ్లి (సి) స్టెయిన్ (బి) పఠాన్ 67; యువరాజ్ (సి) స్టెయిన్ (బి) రసూల్ 21; డివిలియర్స్ (బి) భువనేశ్వర్ 29; రాణా (నాటౌట్) 12; స్టార్క్ (రనౌట్) 6; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 160. వికెట్ల పతనం: 1-5; 2-23; 3-80; 4-141; 5-146; 6-160. బౌలింగ్: భువనేశ్వర్ 4-0-27-2; స్టెయిన్ 4-0-23-0; రసూల్ 4-0-26-1; కరణ్ 3-0-27-1; వేణు 1-0-7-0; పఠాన్ 3-0-28-1; స్యామీ 1-0-19-0. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: ధావన్ (రనౌట్) 50; వార్నర్ (సి) యువరాజ్ (బి) ఆరోన్ 59; నమన్ ఓజా (సి) యువరాజ్ (బి) ఆరోన్ 24; ఫించ్ (నాటౌట్) 11; స్యామీ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.4 ఓవర్లలో 3 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1-100; 2-126; 3-150. బౌలింగ్: మురళీధరన్ 4-0-26-0; స్టార్క్ 3.4-0-31-0; ఆరోన్ 4-0-36-2; అహ్మద్ 2.2-0-22-0; చహల్ 4-0-32-0; యువరాజ్ 1.4-0-10-0. -
ఉప్పల్ లో ఐపిఎల్ మ్యాచ్ దృశ్యాలు
-
నేడు ‘మ్యాక్స్’ వినోదం!
ఉప్పల్‌లో సన్‌రైజర్స్,కింగ్స్ ఎలెవన్ ఢీ సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో ఎప్పుడు ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగినా అభిమానులు చెన్నై సూపర్ కింగ్స్ కోసమో లేదంటే ముంబై ఇండియన్స్ కోసమో ఎదురుచూసేవారు. కారణం ఈ రెండు జట్లలో స్టార్లతో పాటు పరుగుల సునామీ సృష్టించే ఆటగాళ్లు ఉండటమే. అయితే ఈ సారి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అభిమానులంతా ఇప్పుడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కోసమే ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్లో విధ్వంసం సృష్టిస్తున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్... ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలోనూ అదే జోరు కొనసాగించి ఫోర్లు, సిక్సర్లతో కనువిందు చేస్తాడని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు ఉప్పల్‌లో జరగనున్న సన్‌రైజర్స్, పంజాబ్ మ్యాచ్‌కు భారీగా అభిమానులు వచ్చే అవకాశం ఉంది. సొంతగడ్డపై గాడిలో పడేనా ? ఉప్పల్ స్టేడియంలో మంచి రికార్డు ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సోమవారం ఆడిన తొలి హోమ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో చిత్తయింది. దీంతో బుధవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరగనున్న పోరు సన్‌రైజర్స్‌కు కీలకంగా మారింది. ఆడిన 9 మ్యాచ్‌ల్లో నాలుగింట విజయం సాధించిన సన్‌రైజర్స్ జట్టు ప్లే ఆఫ్ దశకు చేరుకోవాలంటే మిగిలిన ఐదు మ్యాచ్‌లూ కీలకమే. ఇందులో మూడు మ్యాచ్‌లు సొంతగడ్డ హైదరాబాద్‌లోనే జరగనున్నాయి. ఈ మూడింటిలో గెలిచి ప్లే ఆఫ్ ఆశల్ని సజీవంగా ఉంచుకోవాలని పట్టుదలగా ఉంది. అయితే జోరుమీదున్న పంజాబ్ బ్యాట్స్‌మెన్‌ను ఎలా అడ్డుకుంటుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. వికెట్లు తీసేందుకు బౌలర్లు అష్టకష్టాలు పడ్డారు. కీలక తరుణంలో స్టెయిన్, భువనేశ్వర్, హెన్రిక్స్, ఇర్ఫాన్ పఠాన్ బంతితో చెలరేగాల్సి ఉంటుంది. ఇక బ్యాట్స్‌మెన్‌లో ఫించ్, వార్నర్ ఫామ్‌లోకి వచ్చినా... కెప్టెన్ శిఖర్ ధావన్ మాత్రం తన బ్యాట్ పవర్ మాత్రం ఇంకా చూపలేకపోతున్నాడు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించి పంజాబ్‌ను ఓడించగలిగితే... మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లో ఆత్మవిశ్వాసంతో ఆడొచ్చు. ఈసారి ఎవరి వంతో? బ్యాట్స్‌మెన్ మెరుపులకు తోడు బౌలర్ల ప్రతిభ కారణంగా ఎవరూ ఊహించని విజయాలు సాధిస్తూ ప్లే ఆఫ్ దశకు చేరువైన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు గత మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో ఓడింది. అయితే ఇకముందు కూడా ఐపీఎల్లో అదే ఊపును కొనసాగించాలంటే సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై పంజాబ్ జట్టు సత్తా చాటాల్సి ఉంటుంది. మ్యాక్స్‌వెల్, మిల్లర్‌తో పాటు వీరూ కూడా ఫామ్‌లో ఉన్నాడు. వీరితో పాటు కెప్టెన్ బెయిలీ కూడా ప్రమాదకర ఆటగాడు. ఈ నలుగురిలో ఎవరు హైదరాబాద్ అభిమానులను తమ ‘హిట్టింగ్’తో అలరిస్తారో చూడాలి. అలాగే బౌలర్లు సందీప్ శర్మ, మిచెల్ జాన్సన్ రాణిస్తున్నారు. మరోసారి కలిసికట్టుగా రాణిస్తే పంజాబ్‌కు తిరుగుండదు. -
అపోలో ఆస్పత్రిలో సన్‌రైజర్స్ సందడి
బంజారాహిల్స్, న్యూస్‌లైన్: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు అపోలో ఆస్పత్రిలో సందడి చేశారు. క్యాన్సర్ బారిన పడిన చిన్నారులతో సరదాగా గడిపారు. కాసేపు చిన్నారులతో క్రికెట్ ఆడి వారి ముచ్చట తీర్చారు. ఇక్కడి అపోలో క్యాన్సర్ ఆస్పత్రి ఆవరణలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో సన్‌రైజర్స్ కెప్టెన్ శిఖర్ ధావన్, డేల్ స్టెయిన్, డారెన్ స్యామీ, ఇర్ఫాన్ పఠాన్, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మలు పాల్గొన్నారు. వీరంతా కలిసి, క్యాన్సర్ బాధిత చిన్నారుల జట్టుతో రెండు ఓవర్ల క్రికెట్ మ్యాచ్ ఆడారు. పిల్లల ఆట తీరు చూసి క్రికెటర్లు క్లీన్‌బౌల్డ్ అయ్యారు. ఈ మ్యాచ్‌ను ఆస్పత్రి సిబ్బందితో పాటు మిగతా క్యాన్సర్ రోగులు ఆసక్తిగా తిలకించారు. క్యూర్ ఫౌండేషన్... అపోలో క్యాన్సర్ ఆస్పత్రితో కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో క్రికెటర్లు క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారులను ఊరడించారు. పిచ్చాపాటి కబుర్లతో వారిని ఉల్లాసపరిచారు. పేసర్ డేల్ స్టెయిన్ మాట్లాడుతూ ఈ పిల్లల మనోధైర్యం మిగతా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న వారి మనోబలానికి జోహార్లు అని చెప్పారు. ఈ పిల్లల ధైర్యమే క్యాన్సర్‌ను తరిమికొడుతుందని వెల్లడించారు. క్యాన్సర్ బాధిత చిన్నారి కిషన్ మాట్లాడుతూ స్టార్ క్రికెటర్లతో క్రికెట్ ఆడటం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. క్రికెట్ బంతిని ఎదుర్కొన్నట్టే క్యాన్సర్‌ను కూడా తామంతా ధైర్యంతో ఎదుర్కొంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అపోలో క్యాన్సర్ ఆస్పత్రి డెరైక్టర్ పి.విజయ్ ఆనంద్‌రెడ్డి పాల్గొన్నారు. -
సొంతగడ్డపై తొలి పోరు
నేడు ఉప్పల్‌లో ముంబైతో సన్‌రైజర్స్ మ్యాచ్ సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్-7లో ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే సన్‌రైజర్స్ సొంతగడ్డపై సత్తా చాటాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక్కడి రాజీవ్‌గాంధీ స్టేడియంలో సోమవారం జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్, ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ సీజన్లో ఉప్పల్‌లో ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచుల్లో సన్‌రైజర్స్ 4 గెలిచి, 4 ఓడగా...ముంబై 2 గెలిచి, 6 ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఇరు జట్లకూ ఈ మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది. ఉప్పల్ స్టేడియంలో రైజర్స్‌కు చక్కటి రికార్డు ఉంది. గత సీజన్లో పెద్దగా భారీ స్కోర్లు నమోదు కాని ఇక్కడి పిచ్‌పై ఈ ఏడాది కూడా రైజర్స్ బౌలింగ్‌నే నమ్ముకుంది. మరో వైపు ముంబై ఈ మ్యాచ్‌లో గెలిచి గాడిలో పడాలని భావిస్తోంది. -
‘భువన’ విజయం
భువనేశ్వర్ 4-0-14- 4 రాజస్థాన్‌ను మట్టికరిపించిన సన్‌రైజర్స్ చెలరేగిన భువనేశ్వర్ వాట్సన్ హ్యాట్రిక్ వృథా చేసింది కేవలం 134 పరుగులు... ప్రత్యర్థి రాజస్థాన్ జట్టులో ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్. ఈ స్థితిలో సన్‌రైజర్స్ మ్యాచ్ గెలవాలంటే అద్భుతమే జరగాలి. సరిగ్గా అదే అద్భుతం చేసి చూపించారు హైదరాబాద్ బౌలర్లు. భువనేశ్వర్ కుమార్ సంచలన బౌలింగ్‌కు... స్పిన్నర్ల పొదుపు తోడవడంతో సీజన్లో మూడో విజయం సాధించారు. దీంతో వరుసగా నాలుగు విజయాలు సాధించిన రాయల్స్ జోరుకు బ్రేక్ పడింది. అహ్మదాబాద్ : స్వల్ప లక్ష్యాలను కాపాడుకోవడంలో సన్‌రైజర్స్ దిట్ట. గత ఏడాది ఐపీఎల్లో చిన్న లక్ష్యాలను కాపాడుకుని అనేక మ్యాచ్‌లు గెలిచినా... ఈ సీజన్లో మాత్రం ఇప్పటిదాకా స్టెయిన్ అండ్ కో గాడిలో పడలేదు. ఇలాంటి నేపథ్యంలో... తమ స్థాయికి తగ్గ బంతులతో చెలరేగిన సన్‌రైజర్స్... రాజస్థాన్‌పై విజయం సాధించింది. గురువారం సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ధావన్ సేన 32 పరుగుల తేడాతో రాజస్థాన్‌పై నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 134 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (20 బంతుల్లో 33; 7 ఫోర్లు) అందించిన శుభారంభాన్ని మిగతా బ్యాట్స్‌మెన్ అందుకోవడంలో విఫలమయ్యారు. చివర్లో ఇర్ఫాన్ పఠాన్ (21 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు) మెరిశాడు. షేన్ వాట్సన్ (3/13) రూపంలో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ రాజస్థాన్ హ్యాట్రిక్ నమోదు చేసింది. రజత్ భాటియాకు కూడా మూడు వికెట్లు దక్కాయి. అనంతరం రాజస్థాన్... భువనేశ్వర్ (4/14) ధాటికి 19.5 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. స్మిత్ (33 బంతుల్లో 22) టాప్ స్కోరర్. స్టెయిన్‌కు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ భువనేశ్వర్ కు లభించింది. ధావన్ మినహా.. సన్‌రైజర్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ తొలి బంతినే ఫోర్‌గా మలిచి దూకుడును కనబరచాడు. ఆ తర్వాత వరుస ఓవర్లలో బౌండరీలు బాదుతూ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. అయితే బంతిపై మంచి ఆధిపత్యం చూపుతున్న ధావన్‌ను వాట్సన్ నాలుగో ఓవర్ చివరి బంతికి దెబ్బ తీశాడు. వన్‌డౌన్‌లో దిగిన లోకేశ్ రాహుల్ (18 బంతుల్లో 18; 2 ఫోర్లు) కూడా జోరును చూపించడంతో పవర్‌ప్లే 6 ఓవర్లలో హైదరాబాద్ 50 పరుగులు చేయగలిగింది. అయితే స్వల్ప వ్యవధిలోనే హిట్టర్ ఫించ్ (10 బంతుల్లో 9; 1 ఫోర్)తో పాటు రాహుల్ కూడా పెవిలియన్ బాట పట్టడంతో 67 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ఇక 12వ ఓవర్లో సన్‌రైజర్స్‌కు అసలైన షాక్ తగిలింది. మిడిల్ ఓవర్ల కోసం బ్యాటింగ్ ఆర్డర్లో కిందికి దిగిన డేవిడ్ వార్నర్ (7 బంతుల్లో 6) జట్టుకు ఉపయోగపడలేదు. సంచలన బౌలర్ ప్రవీణ్ తాంబే విసిరిన గూగ్లీకి తను స్టంప్ అయ్యాడు. ఆ మరుసటి ఓవర్లోనే నమన్ ఓజా (19 బంతుల్లో 17; 1 ఫోర్)ను భాటియా అవుట్ చేయడంతో 89 పరుగులకే సగం జట్టు డగౌట్లో కూర్చుంది. ఆ తర్వాత కూడా పరిస్థితిలో ఏ మార్పు కనిపించలేదు. స్యామీ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన ఆల్‌రౌండర్ హెన్రిక్స్ (13 బంతుల్లో 9; 1 ఫోర్) ఏమాత్రం ప్రభావం చూపలేదు. చివర్లో ఇర్ఫాన్ పఠాన్ (21 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు) పోరాడాడు. ఆదిలోనే ఝలక్ స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ను ప్రారంభంలో సన్‌రైజర్స్ బౌలర్లు వణికించారు. తొలి ఓవర్ మూడో బంతికే అజింక్యా రహానేను భువనేశ్వర్ దెబ్బతీశాడు. అప్పటికి జట్టు ఇంకా పరుగుల ఖాతా తెరువలేదు. శామ్సన్ (16 బంతుల్లో 16; 1 ఫోర్; 1 సిక్స్), కరుణ్ నాయర్ (9 బంతుల్లో 12; 3 ఫోర్లు), కెప్టెన్ వాట్సన్ (10 బంతుల్లో 11; 1 ఫోర్) నాలుగు ఓవర్ల వ్యవధిలో వెనుదిరగడంతో 41 పరుగులకే రాజస్థాన్ నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితిలో స్టువర్ట్ బిన్ని (19 బంతుల్లో 12), స్టీవ్ స్మిత్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా... వార్నర్ డెరైక్ట్ హిట్‌తో బిన్నీని రనౌట్ చేశాడు. ఇక్కడి నుంచి సన్‌రైజర్స్ బౌలర్లు మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ప్రత్యర్థికి పరుగులు రావడం కష్టమైంది. స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో స్టెయిన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన స్మిత్ అవుట్ కాగా... భువనేశ్వర్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి రాజస్థాన్ వెన్నువిరిచాడు. దీంతో వాట్సన్ సేన పరాజయం ఖాయమైంది. వాట్సన్ హ్యాట్రిక్ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ షేన్ వాట్సన్ హ్యాట్రిక్ సాధించాడు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో ఆఖరి బంతికి ధావన్‌ను బౌల్డ్ చేసిన వాట్సన్... మళ్లీ 17వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చాడు. ఈసారి తొలి రెండు బంతుల్లో హెన్రిక్స్, కరణ్శర్మలను అవుట్ చేశాడు. దీంతో మూడు వరుస బంతుల్లో వాట్సన్ మూడు వికెట్లు తీసినట్లయింది. రాజస్థాన్ ఆడిన గత మ్యాచ్ (కోల్‌కతాతో)లో తాంబే హ్యాట్రిక్ సాధించగా... ఈసారి వాట్సన్ ఈ ఘనత సాధించాడు. సీజన్లో నమోదైన రెండు హ్యాట్రిక్లూ రాజస్థాన్ బౌలర్ల నుంచి రావడం విశేషం. 13 ఓవరాల్‌గా ఐపీఎల్ చరిత్రలో ఇది 13వ హ్యాట్రిక్ మిశ్రా ‘సిల్లీ’ రనౌట్ ఒక బ్యాట్స్‌మన్ ఇంత నిర్లక్ష్యంగా కూడా రనౌట్ అవుతాడా? సన్‌రైజర్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రాను చూస్తే ఇదే అనిపిస్తుంది. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ చివరి ఓవర్లో నాలుగో బంతిని ఆడబోయిన మిశ్రా మిస్ అయ్యాడు. కానీ బై కోసం పరిగెత్తాడు. బంతిని పట్టుకున్న కీపర్ శామ్సన్ వికెట్ల వైపు విసిరాడు. అది మిస్ అయి బౌలర్ ఫాల్కనర్ చేతుల్లోకి వెళ్లింది. మళ్లీ ఫాల్క్‌నర్ విసిరాడు. వికెట్లు మిస్ అయి మళ్లీ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. ఈ లోగా మామూలుగా కూడా పరుగు వస్తుంది. కానీ మిశ్రా వెనక్కి చూసుకుంటూ క్రీజులోకి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లాడు. ఇది గమనించిన కీపర్ శామ్సన్ మళ్లీ బంతిని విసిరాడు. ఈసారి స్టంప్‌లకు తగిలింది. మిశ్రా రనౌట్ అయ్యాడు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ ఇన్నింగ్స్: ధావన్ (బి) వాట్సన్ 33; ఫించ్ (సి) రహానే (బి) భాటియా 9; రాహుల్ (బి) భాటియా 18; నమన్ ఓజా (బి) భాటియా 17; వార్నర్ (స్టంప్డ్) సామ్సన్ (బి) తాంబే 6; హెన్రిక్స్ (సి) రహానే (బి) వాట్సన్ 9; ఇర్ఫాన్ నాటౌట్ 21; కరణ్ శర్మ (సి) శామ్సన్ (బి) వాట్సన్ 0; స్టెయిన్ (రనౌట్) 9; మిశ్రా (రనౌట్) 0; భువనేశ్వర్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 134. వికెట్ల పతనం: 1-37; 2-55; 3-67; 4-85; 5-89; 6-106; 7-106; 8-125; 9-129. బౌలింగ్: రిచర్డ్సన్ 4-0-28-0; కులకర్ణి 2-0-19-0; వాట్సన్ 2-0-13-3; ఫాల్క్‌నర్ 4-0-20-0; భాటియా 4-0-23-3; తాంబే 4-0-21-1. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: రహానే (సి) వార్నర్ (బి) భువనేశ్వర్ 0; నాయర్ (సి) ఓజా (బి) స్టెయిన్ 12; శామ్సన్ (బి) శర్మ 16; వాట్సన్ (సి) ఓజా (బి) హెన్రిక్స్ 11; బిన్ని (రనౌట్) 12; స్మిత్ (సి) ఇర్ఫాన్ (బి) స్టెయిన్ 22; భాటియా (సి) వార్నర్ (బి) భువనేశ్వర్ 4; ఫాల్క్‌నర్ (సి) ఫించ్ (బి) భువనేశ్వర్ 4; రిచర్డ్సన్ (సి అండ్ బి) భువనేశ్వర్ 1; కులకర్ణి నాటౌట్ 7; తాంబే (సి) స్టెయిన్ (బి) ఇర్ఫాన్ 3; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 102. వికెట్ల పతనం: 1-0; 2-27; 3-37; 4-41; 5-78; 6-82; 7-89; 8-89; 9-91; 10-102. బౌలింగ్: భువనేశ్వర్ 4-0-14-4; స్టెయిన్ 4-0-31-2; కరణ్ శర్మ 4-0-20-1; హెన్రిక్స్ 2-0-11-1; మిశ్రా 4-0-13-0; ఇర్ఫాన్ 1.5-0-8-1. -
హైదరాబాద్‌లో మ్యాచ్‌లకు... టిక్కెట్ల అమ్మకాలు మొదలు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త. నగరంలో 12 నుంచి 20 వరకు జరిగే నాలుగు సన్‌రైజర్స్ మ్యాచ్‌లకు టిక్కెట్ల అమ్మకాలు మంగళవారం మొద లయ్యాయి. సన్‌రైజర్స్ జట్టు ఈ నెల 12న ముంబై ఇండియన్స్ (రా. గం. 8.00 నుంచి)తో, 14న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (సా. గం. 4.00 నుంచి)తో, 18న కోల్‌కతా నైట్‌రైడర్స్ (రా. గం. 8.00 నుంచి)తో, 20న బెంగళూరు రాయల్ చాలెంజర్స్ (సా. గం. 4.00 నుంచి)తో తలపడనుంది. ఈ నాలుగు మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లు హైదరాబాద్ జింఖానా స్టేడియంలోని కౌంటర్లో అందుబాటులో ఉన్నాయి. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు టికెట్లు కొనుక్కోవచ్చు. అలాగే ఫిల్మ్‌నగర్, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్, సింధి కాలనీ, దిల్షుక్నగర్, హిమాయత్‌నగర్‌లోని ‘కేఫ్ కాఫీ డే’ అవుట్లెట్ల నుంచి టికెట్లు కొనుక్కోవచ్చు. బంజారాహిల్స్, క్లాక్‌టవర్, కూకట్పల్లి 2, హైదర్‌నగర్, మాదాపూర్, బోయిన్పల్లి, మైత్రివనంలోని ఎంపిక చేసిన ‘మొబైల్ స్టోర్’ అవుట్లెట్లలో కూడా టికెట్లను అమ్ముతున్నారు. ఇక ఆన్లైన్లో ఠీఠీఠీ. ఛౌౌజుఝడటజిౌఠీ.ఛిౌఝ అనే వెబ్సైట్లోనూ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. -
డివిలియర్స్ విధ్వంసం
సన్‌రైజర్స్ చిత్తు 4 వికెట్లతో బెంగళూరు గెలుపు వార్నర్, కరణ్ శ్రమ వృథా ఐపీఎల్-7లో ఇప్పటి వరకు పెద్దగా ఆకట్టుకోలేకపోయిన డివిలియర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మాత్రం విశ్వరూపం చూపాడు. సిక్సర్ల వర్షంతో చిన్నస్వామి స్టేడియాన్ని హోరెత్తించాడు. గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 73 పరుగులే చేసిన ఈ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ అసలు సమయంలో వీరబాదుడు బాదాడు. ఈ ఒక్క మ్యాచ్‌లోనే అజేయంగా 89 పరుగులు చేసి బెంగళూరుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. చివర్లో బౌలర్లు విఫలం కావడంతో ‘సన్’కు పరాజయం తప్పలేదు. బెంగళూరు: గేల్ దుమారం లేకపోయినా... కోహ్లి వెనుదిరిగినా... యువీ మెరుపులు మెరిపించకపోయినా...ఏబీ డివిలియర్స్ (41 బంతుల్లో 89 నాటౌట్; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్‌తో బెంగళూరు జట్టును గట్టెక్కించాడు. 95 పరుగులకే సగం జట్టు పెవిలియన్‌కు చేరుకున్నా... లోయర్ ఆర్డర్ సహకారంతో లక్ష్యాన్ని ఛేదించాడు. ఫలితంగా ఐపీఎల్-7లో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 4 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు చేసింది. వార్నర్ (49 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీతో చెలరేగగా, ధావన్ (36 బంతుల్లో 37; 4 ఫోర్లు) రాణించాడు. బెంగళూరు 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసింది. డివిలియర్స్‌తో పాటు గేల్ (19 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు. డివిలియర్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. వార్నర్ దూకుడు ధావన్ నెమ్మదిగా ఆడినా... రెండో ఓవర్లో సిక్సర్, ఫోర్‌తో విరుచుకుపడ్డ ఫించ్ (13) తర్వాతి ఓవర్లోనే వెనుదిరిగాడు. బౌండరీతో ఖాతా ప్రారంభించిన రాహుల్ (6) కూడా వెంటనే అవుట్ కావడంతో ‘సన్’ తడబడింది. వార్నర్, ధావన్ ఇన్నింగ్స్‌ను కుదుటపర్చే ప్రయత్నం చేసినా రన్‌రేట్ మాత్రం తగ్గకుండా చూశారు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి హైదరాబాద్ 2 వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లు కుదురుకోవడంతో వార్నర్, ధావన్‌లు సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేశారు. చివరకు ఆరోన్ ఈ జోడిని విడగొట్టాడు. వీరిద్దరి మధ్య మూడో వికెట్‌కు 9 ఓవర్లలో 62 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. దిండా వేసిన 18వ ఓవర్లో వార్నర్ రెండు సిక్సర్లు కొట్టి అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అయితే ఐదు బంతుల వ్యవధిలో ఓజా, వార్నర్ వెనుదిరిగారు. చివరి మూడు ఓవర్లలో 31 పరుగులు రావడంతో హైదరాబాద్ పోరాడే స్కోరు చేయగలిగింది. డివిలియర్స్ సిక్సర్ల వర్షం ఇన్నింగ్స్ రెండో ఓవర్లో భువనేశ్వర్... పార్థివ్ (3), కోహ్లి (0)లను అవుట్ చేయడంతో బెంగళూరు తడబడింది. ఆరంభంలో పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గేల్ షాట్లు కొట్టేందుకు ఇబ్బందిపడ్డాడు. దీంతో పరుగుల వేగం మందగించింది. స్టెయిన్ వేసిన మూడో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన గేల్, ఆ తర్వాత ఇషాంత్‌కు ఓ ఫోర్, రెండు సిక్సర్లు రుచి చూపించాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో బెంగళూరుకు పెద్ద షాక్ తగిలింది. స్పిన్నర్ కరణ్ శర్మ బౌలింగ్‌లో బంతిని గాల్లోకి లేపిన గేల్ బౌండరీ వద్ద స్యామీ చేతికి చిక్కాడు. దీంతో ఆర్సీబీ 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. రోసో, గేల్ మూడో వికెట్‌కు 32 పరుగులు జోడించారు. డివిలియర్స్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 21 పరుగులు జోడించాక రోసో (14) అవుటయ్యాడు. తర్వాత వచ్చిన యువరాజ్ (14) నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తే.. డివిలియర్స్ మాత్రం వేగంగా ఆడాడు. ఈ క్రమంలో 30 పరుగుల వద్ద క్యాచ్ అవుట్ నుంచి తప్పించుకున్నాడు. యువరాజ్ అవుటయ్యాక డివిలియర్స్ షో మొదలైంది. బౌలర్ ఎవరైనా సిక్సర్ల వర్షం కురిపించాడు. చేయాల్సిన రన్‌రేట్ పెరిగిపోతున్నా... ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా అనుకున్న లక్ష్యాన్ని అలవోకగా ఛేదించాడు. స్టార్క్‌తో కలిసి ఆరో వికెట్‌కు 57 పరుగులు జోడించాడు. స్యామీ ఓవర్లో 19, స్టెయిన్ ఓవర్లో 24 పరుగులు రావడంతో బెంగళూరు విజయం సులువైంది. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: ఫించ్ (సి) పార్థివ్ (బి) స్టార్క్ 13; ధావన్ (సి) డివిలియర్స్ (బి) ఆరోన్ 37; రాహుల్ (సి) గేల్ (బి) దిండా 6; వార్నర్ (బి) స్టార్క్ 61; స్యామీ (సి) స్టార్క్ (బి) హర్షల్ పటేల్ 8; ఓజా (సి) స్టార్క్ (బి) ఆరోన్ 15; ఇర్ఫాన్ నాటౌట్ 4; కరణ్ శర్మ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1-20; 2-29; 3-91; 4-115; 5-149; 6-150 బౌలింగ్: స్టార్క్ 4-0-21-2; దిండా 4-0-39-1; ఆరోన్ 4-0-33-2; హర్షల్ పటేల్ 4-0-29-1; చాహల్ 4-0-30-0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: గేల్ (సి) స్యామీ (బి) కరణ్ శర్మ 27; పార్థివ్ (బి) భువనేశ్వర్ 3; కోహ్లి (సి) ఓజా (బి) భువనేశ్వర్ 0; రోసోవ్ ఎల్బీడబ్ల్యు (బి) కరణ్ శర్మ 14; డివిలియర్స్ నాటౌట్ 89; యువరాజ్ (సి) (సబ్) హెన్రిక్స్ (బి) కరణ్ శర్మ 14; స్టార్క్ రనౌట్ 5; హర్షల్ పటేల్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: (19.5 ఓవర్లలో 6 వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1-5; 2-6; 3-38; 4-59; 5-95; 6-152. బౌలింగ్: స్టెయిన్ 4-0-39-0; భువనేశ్వర్ 4-0-16-2; ఇషాంత్ 3-0-35-0; కరణ్ శర్మ 4-0-17-3; ఇర్ఫాన్ 2.5-0-25-0; స్యామీ 2-0-25-0. -
‘సన్’కు చెన్నై స్ట్రోక్
సూపర్ కింగ్స్ మరో విజయం 5 వికెట్లతో హైదరాబాద్ ఓటమి చెలరేగిన డ్వేన్ స్మిత్ సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ బలం, బలగం జోరు ఒక్క మ్యాచ్‌కే పరిమితమైంది. జట్టు టాప్ ఆర్డర్ విఫలం కాగా... కనీస ప్రదర్శన ఇవ్వలేని పేలవమైన లైనప్‌తో ఆ జట్టు మరోసారి భంగపడింది. మరోవైపు మొదటి మ్యాచ్‌లో పరాజయం తర్వాత చెన్నై సమష్టి ప్రదర్శనతో ప్రత్యర్థిపై పూర్తి ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఫలితంగా సూపర్ కింగ్స్ ఐపీఎల్లో వరుసగా నాలుగో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోగా... సన్‌రైజర్స్ మూడో ఓటమిని మూటగట్టుకుంది. షార్జా: ఐపీఎల్లో జోరు మీదున్న ధోని సేన మరో గెలుపును సొంతం చేసుకుంది. ఆదివారం ఇక్కడ షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్ (45 బంతుల్లో 44; 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మోహిత్ శర్మ, హిల్ఫెన్హాస్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అదనపు బౌలర్‌గా ఇషాంత్ శర్మను తీసుకోవడంతో హైదరాబాద్ బ్యాటింగ్ బలహీనంగా మారి తక్కువ స్కోరుకే పరిమితమైంది. అనంతరం డ్వేన్ స్మిత్ (46 బంతుల్లో 66; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్ ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్ 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 146 పరుగులు చేసింది. బ్రెండన్ మెకల్లమ్ (33 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా కీలకపాత్ర పోషించాడు. మెరుపులే లేవు... చెన్నై కట్టుదిట్టమైన బౌలింగ్‌తో నెమ్మదిగా ఆరంభమైన సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ ఏ దశలోనూ వేగంగా సాగలేదు. హిల్ఫెన్హాస్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. మిడ్ వికెట్లో క్యాచ్ ఇచ్చి ధావన్ (7) వెనుదిరగ్గా... వార్నర్ (0) అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి బలయ్యాడు. లెగ్‌స్టంప్ బయట పడిన బంతి, వార్నర్ ప్యాడ్లపై చాలా ఎత్తులో తాకినా అంపైర్ అవుటిచ్చాడు. ఈ దశలో ఫించ్, రాహుల్ (27 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్) కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 37 పరుగులకు చేరింది. రాహుల్‌ను స్మిత్ అవుట్ చేయడంతో 52 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత వచ్చిన వేణుగోపాలరావు (13) కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. మోహిత్ శర్మ బౌలింగ్‌లో ఫించ్ వెనుదిరిగాడు. 18 ఓవర్లు ముగిసే సరికి సన్ స్కోరు 113 పరుగులు మాత్రమే. అయితే స్యామీ (15 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), కరణ్ శర్మ (7 బంతుల్లో 17 నాటౌట్; 2 సిక్స్‌లు) భారీ షాట్లు ఆడి చివరి 2 ఓవర్లలో 32 పరుగులు రాబట్టారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు అజేయంగా 16 బంతుల్లో 36 పరుగులు జోడించారు. సూపర్ ఓపెనింగ్... వరుస విజయాలతో జోరు మీదున్న చెన్నైకి ఓపెనర్లు స్మిత్, మెకల్లమ్ మరోసారి శుభారంభం అందించారు. వీరిద్దరు చక్కటి సమన్వయంతో బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవడంతో జట్టు పవర్ ప్లేలో 47 పరుగులు చేసింది. ముఖ్యంగా స్మిత్ భారీ షాట్లతో చెలరేగాడు. ఇషాంత్ తొలి ఓవర్లో అతను రెండు భారీ సిక్సర్లు కొట్టి ఊపు తెచ్చాడు. ఎట్టకేలకు కరణ్ శర్మ బౌలింగ్‌లో మెకల్లమ్ వెనుదిరిగడంతో 85 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెర పడింది. మరోవైపు ఫామ్‌లో ఉన్న స్మిత్ 37 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే రైనా (14) ఎక్కువ సేపు నిలబడలేకపోయాడు. ధాటిగా ఆడుతున్న స్మిత్‌తో పాటు డు ప్లెసిస్ (0)ను భువనేశ్వర్ ఒకే ఓవర్లో అవుట్ చేయగా, వెంటనే జడేజా (6) కూడా వెనుదిరగడంతో సన్ శిబిరంలో ఆశలు రేగాయి. అయితే ధోని (14 బంతుల్లో 13 నాటౌట్; 1 ఫోర్) నిలబడి మూడు బంతుల ముందే జట్టును గెలిపించాడు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: ఫించ్ (బి) మోహిత్ 44; ధావన్ (సి) మన్హాస్ (బి) హిల్ఫెన్హాస్ 7; వార్నర్ (ఎల్బీ) (బి) హిల్ఫెన్హాస్ 0; రాహుల్ (సి) పాండే (బి) స్మిత్ 25; వేణు (సి) స్మిత్ (బి) మోహిత్ 13; స్యామీ (నాటౌట్) 23; కరణ్ (నాటౌట్) 17; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 145 వికెట్ల పతనం: 1-15; 2-15; 3-67; 4-98; 5-109. బౌలింగ్: హిల్ఫెన్హాస్ 4-0-32-2; పాండే 3-0-22-0; మోహిత్ 4-0-27-2; అశ్విన్ 4-0-17-0; జడేజా 3-0-23-0; స్మిత్ 2-0-11-1. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: స్మిత్ (సి) వార్నర్ (బి) భువనేశ్వర్ 66; మెకల్లమ్ (బి) కరణ్ 40; రైనా (సి) వేణు (బి) ఇషాంత్ 14; ధోని (నాటౌట్) 13; డు ప్లెసిస్ (సి) రాహుల్ (బి) భువనేశ్వర్ 0; జడేజా (బి) ఇషాంత్ 6; మన్హాస్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.3 ఓవర్లలో 5 వికెట్లకు) 146 వికెట్ల పతనం: 1-85; 2-114; 3-126; 4-127; 5-138. బౌలింగ్: స్టెయిన్ 4-0-20-0; భువనేశ్వర్ 4-0-23-2; కరణ్ శర్మ 4-0-35-1; మిశ్రా 3.3-0-27-0; ఇషాంత్ 4-0-37-2. -
‘రైజింగ్’ మొదలైంది!
సన్‌రైజర్స్ హైదరాబాద్ బోణి 4 పరుగులతో ఢిల్లీపై విజయం ఫించ్, వార్నర్ మెరుపులు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పేలవ ప్రదర్శన తర్వాత... సన్‌రైజర్స్ జట్టు తేరుకుంది. జట్టు ప్రధాన బలం టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ తొలిసారి చెలరేగిపోవడంతో హైదరాబాద్ జట్టు ఐపీఎల్-7లో బోణీ చేసింది. మరోవైపు పీటర్సన్ బరిలోకి దిగినా ఢిల్లీ ఆటతీరు ఇంకా గాడిలో పడలేదు. దుబాయ్: ఐపీఎల్లో తక్కువ స్కోర్లను కాపాడుకోవడంలో సన్‌రైజర్స్ దిట్ట. కానీ భారీ స్కోర్ల విషయంలో మాత్రం కాదు. గతంలో ఈ జట్టు 150 పైచిలుకు స్కోర్లు చేసిన మూడుసార్లూ ఓడిపోయింది. ఈసారి కూడా భారీస్కోరు సాధించినా సన్‌రైజర్స్ తడబడింది. ఢిల్లీ డేర్‌డెవిల్స్ పోరాటంతో ఆఖరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో గట్టెక్కింది. శుక్రవారం దుబాయ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్.. 20 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 184 పరుగుల భారీస్కోరు సాధించింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఆరోన్ ఫించ్ (53 బంతుల్లో 88 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), డేవిడ్ వార్నర్ (45 బంతుల్లో 58 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేయగా, కెప్టెన్ ధావన్ (22 బంతుల్లో 33; 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా ధాటిగా ఆడాడు. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 180 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్లు మురళీ విజయ్ (40 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్), డి కాక్ (30 బంతుల్లో 48; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. స్టెయిన్ రెండు వికెట్లు తీశాడు. భారీ భాగస్వామ్యం తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు ధావన్, ఫించ్ ధాటిగా ఆడి శుభారంభం ఇచ్చారు. పవర్ ప్లేలో హైదరాబాద్ 55 పరుగులు చేసింది. అయితే కొద్ది సేపటికే నదీమ్ బౌలింగ్‌లో పీటర్సన్‌కు క్యాచ్ ఇచ్చి ధావన్ వెనుదిరగడంతో 56 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. అదే ఓవర్లో సున్నా వద్ద వార్నర్ ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ కార్తీక్ వదిలేశాడు. మధ్య ఓవర్లలో ఫించ్, వార్నర్ నెమ్మదిగాఆడారు. దీంతో 7-14 ఓవర్ల మధ్య కేవలం 44 పరుగులే వచ్చాయి. ఆ తర్వాత స్లాగ్ ఓవర్లలో ఇద్దరూ చెలరేగారు. చివరి 6 ఓవర్లలో సన్‌రైజర్స్ 85 పరుగులు చేసింది. ఫించ్, వార్నర్ 82 బంతుల్లోనే అభేద్యంగా 128 పరుగులు జోడించారు. ఐపీఎల్లో ఆ జట్టు ఆడిన 20 మ్యాచుల్లో ఇదే (184) అత్యధిక స్కోరు కావడం విశేషం. విజయ్, డి కాక్ శుభారంభం భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్ కూడా జోరుగా సాగింది. డి కాక్, విజయ్ తొలి వికెట్‌కు 99 పరుగులు జత చేశారు. కానీ 4 పరుగుల వ్యవధిలో ఈ ఇద్దరూ అవుటయ్యారు. పీటర్సన్ (16), కార్తీక్ (15) ఓ మాదిరిగా ఆడినా.. . స్టెయిన్ ఈ ఇద్దరినీ వరుస బంతుల్లో అవుట్ చేశాడు. విజయానికి చివరి మూడు ఓవర్లలో 49 పరుగులు చేయాల్సిన స్థితిలో... డుమిని (7 బంతుల్లో 20 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు), తివారి (13 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. 2 ఓవర్లలో 29 పరుగులు చేశారు. భువనేశ్వర్ వేసిన ఆఖరి ఓవర్లో 15 పరుగులు చేసినా... ఓటమి తప్పలేదు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: ధావన్ (సి) పీటర్సన్ (బి) నదీమ్ 33; ఫించ్ (నాటౌట్) 88; వార్నర్ (నాటౌట్) 58; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో వికెట్ నష్టానికి) 184. వికెట్ల పతనం: 1-56; బౌలింగ్: నదీమ్ 4-0-24-1; షమీ 4-0-36-0; పార్నెల్ 4-0-38-0; ఉనాద్కట్ 4-0-43-0; డుమిని 2-0-19-0; శుక్లా 2-0-21-0. ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: డి కాక్ (సి) ఫించ్ (బి) కరణ్ 48; విజయ్ (సి) స్టెయిన్ (బి) స్యామీ 52; పీటర్సన్ (సి) స్యామీ (బి) స్టెయిన్ 16; కార్తీక్ (సి) రాహుల్ (బి) స్టెయిన్ 15; డుమిని (నాటౌట్) 20; తివారి (నాటౌట్) 23; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 180. వికెట్ల పతనం: 1-99; 2-103; 3-135; 4-135. బౌలింగ్: భువనేశ్వర్ 4-0-40-0; స్టెయిన్ 4-0-33-2; వేణు 1-0-9-0; కరణ్ 4-0-23-1; స్యామీ 3-0-34-1; మిశ్రా 4-0-38-0. -
షార్జాలో లైట్ల బాధ!
షార్జా: సన్‌రైజర్స్, పంజాబ్ మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఫీల్డర్ల తడబాటును గమనించే ఉంటారు. 11 పరుగుల వద్ద మ్యాక్స్‌వెల్ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను వార్నర్ వదిలేశాడు. అదే ఓవర్లో పుజారా కొట్టిన బంతిని అందుకునేందుకు వచ్చిన స్యామీ అకస్మాత్తుగా వెనక్కు తిరిగాడు. నిజానికి ఈ ఇద్దరూ మంచి ఫీల్డర్లు మరి ఎందుకు ఇలా? ఈ ప్రశ్నకు సమాధానం సన్‌రైజర్స్ కోచ్ టామ్ మూడీ చెప్పారు. ‘షార్జా స్టేడియం పక్కనే ఉన్న ఫుట్‌బాల్ స్టేడియంలో లైట్లు ఇక్కడ ఫీల్డర్ల మీద పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బంతిని చూడటం ఇబ్బంది అవుతోంది. స్యామీ బంతిని వదిలేసి వెనక్కి తిరగడానికి కారణం కూడా అదే’ అని చెప్పారు. కానీ దీనికి చెన్నై జట్టు చాలా సింపుల్‌గా పరిష్కారం కనుక్కుంది. అదేంటంటే... మ్యాచ్ ముందు రోజు రాత్రి అదే మైదానానికి వెళ్లి ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేయడం. మిగిలిన జట్లు ఇది తెలుసుకునే సరికే ఆలస్యం అయిపోయింది. ఇక ఈ స్టేడియంలో మూడు మ్యాచ్‌లు మాత్రమే మిగిలున్నాయి. -
అదే విధ్వంసం.. అదే ఫలితం
మ్యాక్స్‌వెల్ మరో సంచలన ఇన్నింగ్స్ పంజాబ్‌కు ‘హ్యాట్రిక్’ విజయం 72 పరుగులతో ఓడిన సన్‌రైజర్స్ గత రెండు మ్యాచ్‌ల్లో భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన మ్యాక్స్‌వెల్... ఈసారి టార్గెట్ నిర్దేశించడంలోనూ తన సత్తా చాటాడు. సునామీని తలపిస్తూ బ్యాటింగ్ చేసి పరుగుల ప్రవాహాన్ని సృష్టించాడు. మ్యాక్స్ దెబ్బకు ‘సన్’ బౌలర్లు చిన్నబోయారు. టోర్నీలో తొలిసారి పంజాబ్ బౌలర్లు అద్భుతంగా రాణించడంతో... కింగ్స్ ముచ్చటగా మూడో విజయాన్ని అందుకుంది. షార్జా: బౌలర్ ఎవరైనా... ఫీల్డర్లు ఎంత మంది ఉన్నా... బంతి బ్యాట్‌ను తగిలితే బౌండరీ దాటాల్సిందే.. టి20ల్లో పరుగులు రాబట్టాలంటే ఏ బ్యాట్స్‌మన్ అయినా ఈ పద్ధతిని కచ్చితంగా అమలు చేస్తారు. గత రెండు మ్యాచ్‌ల్లో అలాంటి ఆటతీరునే ప్రదర్శించిన మ్యాక్స్‌వెల్... సన్‌రైజర్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లోనూ సునామీని మించిన విధ్వంసం సృష్టించాడు. ఫలితంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 72 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించింది. షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ (43 బంతుల్లో 95; 5 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంసకర బ్యాటింగ్ చేసినా మరోసారి సెంచరీ చేజార్చుకున్నాడు. సెహ్వాగ్ (22 బంతుల్లో 30; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), పుజారా (32 బంతుల్లో 35; 6 ఫోర్లు) శుభారంభాన్నిచ్చారు. 11 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద వార్నర్ సులభమైన క్యాచ్ వదిలేయడంతో ఊపిరిపీల్చుకున్న మ్యాక్స్‌వెల్... ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భువనేశ్వర్ 3, మిశ్రా 2 వికెట్లు తీశారు. మ్యాక్స్‌వెల్ ఆడుతున్న సమయంలో స్టెయిన్, భువనేశ్వర్‌లతో బౌలింగ్ చేయించకపోవడం ఆశ్చర్యపరిచింది. తర్వాత సన్‌రైజర్స్ 19.2 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది. లోకేష్ రాహుల్ (27 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్సర్) టాప్ స్కోరర్. ఫించ్ (15 బంతుల్లో 19; 2 ఫోర్లు, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించినా మిగతా బ్యాట్స్‌మెన్ నిరాశపర్చారు. బాలాజీ 4, జాన్సన్, అక్షర్ చెరో రెండు వికెట్లు తీశారు. మ్యాక్స్‌వెల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: పుజారా (సి) వేణుగోపాల్ రావు (బి) స్యామీ 35; సెహ్వాగ్ (సి) స్యామీ (బి) మిశ్రా 30; మ్యాక్స్‌వెల్ (సి) స్యామీ (బి) మిశ్రా 95; మిల్లర్ (సి) వార్నర్ (బి) భువనేశ్వర్ 10; బెయిలీ (సి) వార్నర్ (బి) భువనేశ్వర్ 10; జాన్సన్ (బి) భువనేశ్వర్ 4; అక్షర్ పటేల్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 193. వికెట్ల పతనం: 1-51; 2-86; 3-154; 4-179; 5-189; 6-193 బౌలింగ్: స్టెయిన్ 4-0-26-0; భువనేశ్వర్ 4-0-19-3; ఇర్ఫాన్ 2-0-28-0; కరణ్ శర్మ 4-0-37-0; మిశ్రా 4-0-56-2; స్యామీ 2-0-22-1 సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: ఫించ్ (బి) బాలాజీ 19; ధావన్ (సి) సాహా (బి) జాన్సన్ 1; వార్నర్ (బి) మాక్స్వెల్ (బి) బాలాజీ 8; రాహుల్ (సి) మిల్లర్ (బి) అక్షర్ పటేల్ 27; వేణుగోపాల్ రావు (బి) సందీప్ 11; ఇర్ఫాన్ (బి) అక్షర్ పటేల్ 5; స్యామీ (సి) పటేల్ (బి) బాలాజీ 15; కరణ్ శర్మ (సి) మిల్లర్ (బి) జాన్సన్ 10; స్టెయిన్ (బి) బాలాజీ 12; మిశ్రా నాటౌట్ 4; భువనేశ్వర్ (సి) జాన్సన్ (బి) ధావన్ 1; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: (19.2 ఓవర్లలో ఆలౌట్) 121. వికెట్ల పతనం: 1-11; 2-31; 3-33; 4-49; 5-74; 6-93; 7-95; 8-114; 9-118; 10-121 బౌలింగ్: సందీప్ శర్మ 4-0-26-1; జాన్సన్ 4-0-26-2; బాలాజీ 4-0-13-4; రిషీ ధావన్ 2.2-0-23-1; అక్షర్ పటేల్ 4-0-20-2; మాక్స్వెల్ 1-0-10-0. -
రాయల్స్ రాజసంగా...
సన్‌రైజర్స్‌పై గెలుపుతో రాజస్థాన్ శుభారంభం రాణించిన రహానే ఐపీఎల్-7 కొత్త లుక్‌తో అదరగొడదామని బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌కు తొలి మ్యాచ్‌లోనే షాక్ తగిలింది. పేలవ ఆటతీరుతో బ్యాటింగ్‌లో విఫలం కాగా... బౌలర్లు ప్రారంభంలో వికెట్లు తీసినా ఆ తర్వాత లయ తప్పారు. మరోవైపు గత సీజన్లో ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా తమ దృష్టంతా విజయంపైనే అని వాట్సన్ సేన నిరూపించుకుని ఏడో సీజన్లో శుభారంభం చేసింది. అబుదాబి: 31 పరుగులకే మూడు వికెట్లు పడిన దశలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు అజింక్యా రహానే (53 బంతుల్లో 59; 6 ఫోర్లు) నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లు పట్టు సాధిస్తున్న వేళ ఓపిగ్గా ఎదురు నిలిచి జట్టుకు కావాల్సిన పరుగులు సాధించాడు. చివర్లో ఉత్కంఠ నెలకొన్నా... స్టువర్ట్ బిన్నీ (32 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు; 1 సిక్స్) జట్టును ఒడ్డున పడేశాడు. తద్వారా షేక్ జాయెద్ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఐపీఎల్-7 మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (34 బంతుల్లో 38; 3 ఫోర్లు; 1 సిక్స్), డేవిడ్ వార్నర్ (35 బంతుల్లో 32; 1 ఫోర్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. లోకేశ్ రాహుల్ (18 బంతుల్లో 20; 1 ఫోర్; 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. ధావల్ కులకర్ణి, రిచర్డ్సన్, భాటియాలకు రెండేసి వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత స్వల్ప లక్ష్యం కోసం బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 19.3 ఓవర్లలో ఆరు వికెట్లకు 135 పరుగులు చేసింది. రహానేకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం దక్కింది. ఆది నుంచీ తడబాటే.. తొలి ఓవర్లోనే సన్‌రైజర్స్ ఓపెనర్ ఫించ్ (2) వికెట్‌ను కోల్పోయింది. దీంతో బరిలో స్టార్ హిట్టర్లు శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్లున్నా ఆటలో జోరు కనిపించలేదు. వికెట్ నెమ్మదించడంతో ఈ జోడి ఆచితూచి ఆడుతూ సింగిల్స్‌కే పరిమితమైంది. తొలి పవర్‌ప్లేలో 41 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొమ్మిదో ఓవర్లో ధావన్ బ్యాట్ నుంచి ఇన్నింగ్స్‌లో తొలి సిక్స్ నమోదైంది. ఆ తర్వాత ఓవర్లో బౌండరీతో టచ్‌లో కనిపించినా 12వ ఓవర్లో రజత్ భాటియా బౌలింగ్‌లో డీప్ స్క్వేర్‌లెగ్‌లో క్యాచ్ ఇచ్చాడు. దీంతో రెండో వికెట్‌కు 55 పరుగులు నమోదయ్యాయి. భాటియా తన మరుసటి ఓవర్లో వార్నర్‌ను అవుట్ చేయడంతో సన్‌రైజర్స్ కష్టాల్లో పడింది. స్లాగ్ ఓవర్లలో తుపాన్ ఆటతీరును చూపే డారెన్ స్యామీ (6) జట్టును ఆదుకుంటాడని ఆశించినా తనూ నిరాశపరిచాడు. లోకేశ్ రాహుల్ ఉన్న కాసేపు వేగంగా ఆడినా వీరిద్దరు నాలుగు బంతుల వ్యవధిలో పెవిలియన్‌కు చేరారు. చివర్లో వేణుగోపాల్ (12 బంతుల్లో 16 నాటౌట్; 1 ఫోర్) బ్యాట్ ఝుళిపించడంతో సన్‌రైజర్స్‌కు ఆమాత్రం స్కోరైనా వచ్చింది. నిదానంగా... రాజస్థాన్‌ను కూడా సన్‌రైజర్స్ తొలి ఓవర్లోనే దెబ్బతీసింది. స్టెయిన్ వేసిన తొలి బంతినే బౌండరీకి తరలించిన నాయర్ (4) మూడో బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. నాలుగో ఓవర్లో యువ ఆటగాడు సామ్సన్ (3) ధావన్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న రహానేకు తోడు కెప్టెన్ షేన్ వాట్సన్ (3) రాకతో ఇన్నింగ్స్ కుదుటపడుతుందనుకున్నప్పటికీ ఏడో ఓవర్లో ఇషాంత్ శర్మ గట్టి దెబ్బ తీశాడు. కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వాట్సన్ వెనుదిరిగాడు. రహానే, స్టువర్ట్ బిన్నీ జోడి మధ్య ఓవర్లను సమర్థవంతంగా ఎదుర్కొంది. స్యామీ బౌలింగ్‌లో బిన్నీ భారీ సిక్స్, ఫోర్ బాది స్కోరు వేగాన్ని పెంచాడు. ఆ తర్వాత వీరి ఇన్నింగ్స్‌లో దూకుడు కనిపించకపోయినప్పటికీ పిచ్ పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు సాగారు. ఎక్కువగా సింగిల్స్‌కే పరిమితమవుతూ లక్ష్యాన్ని అందుకున్నారు. స్టెయిన్ వేసిన 15వ ఓవర్లో వరుస బంతుల్లో రెండు ఫోర్లు సాధించిన రహానే తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. అయితే ఆ తర్వాతమిశ్రా తన వరుస ఓవర్లలో రహానే, హాడ్జ్‌ను అవుట్ చేసి మ్యాచ్‌లో ఉత్కంఠ రేపాడు. అయితే బిన్నీ, ఫాల్క్‌నర్ (2 బంతుల్లో 8; 2 ఫోర్లు) లాంఛనాన్ని పూర్తి చేశారు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: ఫించ్ (సి) రిచర్డ్సన్ (బి) కులకర్ణి 2; ధావన్ (సి) రిచర్డ్సన్ (బి) భాటియా 38; వార్నర్ (సి) రిచర్డ్సన్ (బి) భాటియా 32; రాహుల్ (సి) రహానే (బి) కులకర్ణి 20; స్యామీ (సి) సామ్సన్ (బి) రిచ ర్డ్సన్ 6; వేణుగోపాల్‌రావు నాటౌట్ 16; కరణ్ శర్మ (సి) హాడ్జ్ (బి) రిచర్డ్సన్ 4; స్టెయిన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో ఆరు వికెట్లకు) 133 వికెట్ల పతనం: 1-2; 2-77; 3-82; 4-108; 5-111; 6-130. బౌలింగ్: కులకర్ణి 4-0-23-2; రిచర్డ్సన్ 4-0-25-2; ఫాల్క్‌నర్ 3-0-27-0; తాంబే 4-0-23-0; భాటియా 4-0-22-0; బిన్నీ 1-0-7-0. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: నాయర్ ఎల్బీడబ్ల్యు (బి) స్టెయిన్ 4; రహానే (సి) ఫించ్ (బి) మిశ్రా 59; సామ్సన్ (సి) ధావన్ (బి) భువనేశ్వర్ 3; వాట్సన్ (సి) రాహుల్ (బి) ఇషాంత్ 3; బిన్నీ నాటౌట్ 48; హాడ్జ్ (సి) స్యామీ (బి) మిశ్రా 1; ఫాల్క్‌నర్ నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (19.3 ఓవర్లలో ఆరు వికెట్లకు) 135 వికెట్ల పతనం: 1-4; 2-15; 3-31; 4-108; 5-111, 6-121 బౌలింగ్: స్టెయిన్ 4-0-29-2; భువనేశ్వర్ 3.3-0-21-1; ఇషాంత్ 4-0-29-1; స్యామీ 2-0-19-0; మిశ్రా 4-0-26-2; కరణ్ శర్మ 2-0-8-0. ఐపీఎల్లో నేడు బెంగళూరు రాయల్ చాలెంజర్స్ X ముంబై ఇండియన్స్ సా. గం. 4.00 నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్ X ఢిల్లీ డేర్ డెవిల్స్ రా. గం. 8.00 నుంచి వేదిక: దుబాయ్ సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
లక్ష్యం... వరల్డ్ కప్!
ఐపీఎల్లో బాగా ఆడటమే మార్గం సన్‌రైజర్స్ సమతూకంగా ఉంది క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్య న్యూఢిల్లీ: భారత జట్టులో పునరాగమనం చేసి 2015లో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో ఆడటమే తన లక్ష్యమని ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానించాడు. అందుకు ఈ ఏడాది జరిగే ఐపీఎల్-7ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటానని అతను అన్నాడు. భారత్ తరఫున 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టి20 మ్యాచ్‌లు ఆడిన ఇర్ఫాన్... ఆఖరిసారిగా 2012 టి20 ప్రపంచ కప్‌లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఐపీఎల్లో అతను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాడిగా బరిలోకి దిగనున్నాడు. ‘2015 ప్రపంచ కప్ ఆడటమే నా లక్ష్యం. అయితే అంతకుముందు చాలా మ్యాచ్‌లు ఉన్నాయి. ముందుగా భారత జట్టులో చోటు సంపాదించేందుకు ప్రయత్నిస్తాను. ఐపీఎల్ టోర్నీలో సన్‌రైజర్స్ జట్టు మరీ లోయర్ ఆర్డర్లో కాకుండా కాస్త ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం కల్పిస్తోందని ఆశిస్తున్నా’ అని ఇర్ఫాన్ చెప్పాడు. తన శరీర స్థాయిని మించి చేసిన అదనపు శ్రమతో తరచుగా గాయాల పాలయ్యానని, అయితే ఎన్సీఏలో ప్రత్యేక శిక్షణ అనంతరం ఇప్పుడు పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించాడు. బౌలింగ్‌లో వేగంకంటే స్వింగ్కే తన ప్రాధాన్యత అని అతను చెప్పాడు. ‘145 కిమీ.కు పైగా వేగం చేయాలని ప్రయత్నించి లయ తప్పడం నాకిష్టం లేదు. వేగంకంటే బంతిని స్వింగ్ చేయగలగడం నా సహజ నైపుణ్యంగా భావిస్తా. అందుకే దానితోనే మంచి ఫలితాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తా’ అని ఈ బరోడా ఆటగాడు తెలిపాడు. సమతూకంతో ఉన్న సన్‌రైజర్స్ జట్టుకు ఈసారి ఐపీఎల్లో విజయావకాశాలు ఉన్నాయని ఇర్ఫాన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. -
త్వరలో సోలార్ టాయిలెట్లు!
నీటిచుక్క కూడా అవసరం లేకుండా సూర్యరశ్మితో పనిచేసే కొత్త రకం టాయిలెట్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచంలోనే ఇలాంటి పర్యావరణహిత టాయిలెట్లను రూపొందించడం ఇదే మొదటిసారి. వచ్చేనెలలో మన దేశంలోనే వీటిని ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టుకు బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ ఆర్థికసహాయం అందించింది. దీనికి కొలెరెడొ యూనివర్సిటీ ప్రొఫెసర్ కార్ల్లిండన్ నేతృత్వం వహించారు. ఈ టాయిలెట్‌ను రోజుకు ఆరుగురు ఉపయోగించుకోవచ్చు. సూర్యరశ్మి ఆధారంగా పనిచేసే ఇది మానవవ్యర్థాలను అత్యధిక ఉష్ణోగ్రత వద్ద వేడిచేసి బొగ్గుగా మారుస్తుంది. ఈ బొగ్గును కార్బన్డయాక్సైడ్ ఉద్గారాల తగ్గింపునకు, పంట దిగుబడి పెరుగుదలకు ఉపయోగించుకోవచ్చని ప్రొఫెసర్ కార్ల్లిండన్ తెలిపారు. -
ఇక సన్ రైజర్స్‌కు కష్టమే!
రాంచీ: చాంపియన్స్ లీగ్‌లో ఇక సన్‌రైజర్స్ సెమీస్‌కు చేరితే అది అద్భుతమే అనుకోవాలి. గ్రూప్ ‘బి’ లో వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడిపోవడం, రన్‌రేట్ కూడా దారుణంగా పడిపోవడంతో ఈ హైదరాబాద్ ఫ్రాంఛైజీ ఈ సారి లీగ్ దశతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చేట్లుంది. జేఎస్సీఏ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాకు చెందిన టైటాన్స్ చేతిలో ఓడిపోయింది. టాస్ గెలిచిన టైటాన్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా... సన్‌రైజర్స్ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (21 బంతుల్లో 37; 7 ఫోర్లు, 1 సిక్సర్), పార్థీవ్ పటేల్ (24 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి వికెట్‌కు 39 బంతుల్లోనే 62 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. అయితే టైటాన్స్ బౌలర్లు పుంజుకుని వరుస విరామాల్లో వికెట్లు తీసి స్కోరును నియంత్రించారు. పెరీరా (11), డుమిని (17), స్యామీ (1) విఫలమయ్యారు. దీంతో ఓ దశలో సన్‌రైజర్స్ 112 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. చివర్లో స్టెయిన్ (12 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కరణ్ శర్మ (6 బంతుల్లో 11 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) వేగంగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. టైటాన్ ఆల్‌రౌండర్ వీస్ మూడు కీలక వికెట్లు తీసుకున్నాడు. టైటాన్స్ జట్టు 16.3 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 147 పరుగులు చేసి అలవోకగా గెలిచింది. కెప్టెన్ డేవిడ్స్ (42 బంతుల్లో 64; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఓపెనర్ రుడాల్ఫ్ (42 బంతుల్లో 49 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) చివరి వరకూ బాధ్యతగా బ్యాటింగ్ చేశాడు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 12.1 ఓవర్లలో 112 పరుగులు జోడించి విజయాన్ని సులభం చేశారు. ఈ విజయంతో టైటాన్స్ జట్టు సెమీస్ ఆశలను సజీవంగా నిలబెట్టుకుంది. సన్‌రైజర్స్ బౌలర్లలో స్టెయిన్, ఇషాంత్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. డేవిడ్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: పార్థీవ్ (బి) వీస్ 26; శిఖర్ ధావన్ (సి) మోర్కెల్ (బి) వీస్ 37; డుమిని (బి) డిలాంజ్ 17; విహారి (సి) డేవిడ్స్ (బి) వీస్ 6; సామంత్రె (స్టం) మోసెహెలె (బి) డేవిడ్స్ 0; పెరీరా రనౌట్ 11; స్యామీ (సి) బెహర్డిన్ (బి) రిచర్డ్స్ 1; కరణ్ శర్మ నాటౌట్ 11; స్టెయిన్ నాటౌట్ 27; ఎక్స్‌ట్రాలు (బై 1, లెగ్‌బై 1, వైడ్లు 7) 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి) 145 వికెట్ల పతనం: 1-62; 2-71; 3-83; 4-86; 5-102; 6-105; 7-112. బౌలింగ్: డేవిడ్స్ 4-0-18-1; మోర్నీ మోర్కెల్ 4-0-42-0; రిచర్డ్స్ 4-0-24-1; డిలాంజ్ 4-0-42-1; వీస్ 4-0-17-3. టైటాన్స్ ఇన్నింగ్స్: రుడాల్ఫ్ నాటౌట్ 49; డేవిడ్స్ (సి) స్యామీ (బి) స్టెయిన్ 64; డివిలియర్స్ (సి) పెరీరా (బి) ఇషాంత్ 9; కున్ నాటౌట్ 15; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బైస్ 6, వైడ్లు 4) 10; మొత్తం (16.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి) 147 వికెట్ల పతనం: 1-112; 2-123. బౌలింగ్: క రణ్ శర్మ 1-0-9-0; స్టెయిన్ 4-0-23-1; ఇషాంత్ 4-0-32-1; పెరీరా 2.3-0-29-0; అమిత్ మిశ్రా 2-0-17-0; డుమిని 1-0-14-0; స్యామీ 2-0-17-0. -
పెరీరా మెరుపులు
క్వాలిఫయింగ్ పోటీల ద్వారా ప్రధాన మ్యాచ్‌లకు అర్హత సాధించిన సన్‌రైజర్స్.... చాంపియన్స్ లీగ్‌ను ఘనంగా ప్రారంభించింది. ట్రినిడాడ్‌తో జరిగిన మ్యాచ్‌లో పెరీరా సంచలన బ్యాటింగ్‌తో ఒంటిచేత్తో హైదరాబాద్‌కు విజయాన్ని అందించాడు. మొహాలీ: ప్రధాన మ్యాచ్‌లకు ఒక్క రోజు ముందు సన్‌రైజర్స్ ఆటగాళ్లపై ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి సమయంలో ఆటగాళ్ల స్థైర్యం కాస్తో కూస్తో దెబ్బతింటుంది. కానీ ఆ ప్రభావం తమపై ఏమాత్రం పడలేదని తమ ఆటతీరుతోనే నిరూపించారు సన్‌రైజర్స్ స్టార్స్. తిసార పెరీరా (32 బంతుల్లో 57 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) సంచలన హిట్టింగ్తో హైదరాబాద్ జట్టు లీగ్‌లో పాయింట్ల బోణీ చేసింది. పీసీఏ స్టేడియంలో మంగళవారం జరిగిన గ్రూప్ బి లీగ్ మ్యాచ్‌లో ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్టుపై సన్‌రైజర్స్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. 161 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్... 19.3 ఓవర్లలో ఆరు వికెట్లకు 164 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు పార్థీవ్ (15 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్సర్), కెప్టెన్ ధావన్ (18 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్సర్) తొలి నాలుగు ఓవర్లలో 35 పరుగులు జోడించి మంచి ఆరంభాన్నిచ్చారు. అయితే ట్రినిడాడ్ బౌలర్లు పది పరుగుల వ్యవధిలో ఈ ఇద్దరినీ అవుట్ చేశారు. డుమిని (16 బంతుల్లో 17; 2 ఫోర్లు) నిలకడగా ఆడుతున్న దశలో రనౌట్ అయ్యాడు. విహారి (13) కూడా నిరాశపరిచాడు. దీంతో సన్‌రైజర్స్ 95 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో తిసార పెరీరా అద్భుతమైన హిట్టింగ్తో ట్రినిడాడ్ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. రెండో ఎండ్‌లో డారెన్ స్యామీ (15 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్సర్) కూడా చెలరేగిపోయాడు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు కేవలం 4.4 ఓవర్లలోనే 47 పరుగులు జోడించి మ్యాచ్‌ను మలుపు తిప్పారు. అయితే నరైన్ వరుస బంతుల్లో స్యామీ, ఆశిష్‌లను అవుట్ చేసి ట్రినిడాడ్ ఆశలను సజీవంగా నిలిపాడు. అయితే పెరీరా ఏ మాత్రం ఒత్తిడికి లోను కాకుండా కరణ్ శర్మ (5 బంతుల్లో 13 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) సాయంతో జట్టును గట్టెక్కించాడు. ట్రినిడాడ్ బౌలర్లలో నరైన్ (4/9) అద్భుతంగా బౌలింగ్ చేసినా ఫలితం లేకపోయింది. అంతకు ముందు టాస్ గెలిచిన సన్‌రైజర్స్ బౌలింగ్ ఎంచుకోగా... ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ సిమ్మన్స్ (0) స్టెయిన్ బౌలింగ్‌లో తొలి బంతికే అవుటయ్యాడు. కానీ డారెన్ బ్రేవో (44 బంతుల్లో 66; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అర్ధసెంచరీ చేసి ట్రినిడాడ్ ఇన్నింగ్స్‌కు మూలస్తంభంలా నిలిచాడు. లూయిస్ (14 బంతుల్లో 22; 4 ఫోర్లు), కెప్టెన్ రామ్‌దిన్ (15 బంతుల్లో 21; 3 ఫోర్లు) రాణించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఇషాంత్ శర్మ, పెరీరా, స్యామీ రెండేసి వికెట్లు తీసుకున్నారు. లెగ్‌స్పిన్నర్ కరణ్‌శర్మ తుది జట్టులో ఉన్నా... అతడితో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయించలేదు. తిసార పెరీరాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. స్కోరు వివరాలు ట్రినిడాడ్ అండ్ టొబాగో ఇన్నింగ్స్: సిమ్మన్స్ (సి) పార్థీవ్ (బి) స్టెయిన్ 0; లూయిస్ (సి) పార్థీవ్ (బి) ఇషాంత్ 22; డారెన్ బ్రేవో (సి) ధావన్ (బి) ఇషాంత్ 66; జాసన్ మహమ్మద్ (బి) స్యామీ 19; రామ్‌దిన్ (సి) స్టెయిన్ (బి) పెరీరా 21; పూరన్ (సి) పార్థీవ్ (బి) స్యామీ 6; స్టీవార్ట్ (బి) పెరీరా 17; నరైన్ రనౌట్ 0; ఎమ్రిట్ నాటౌట్ 3; బద్రీ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బై 1, వైడ్లు 3, నోబాల్ 1) 5; మొత్తం (20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి) 160. వికెట్ల పతనం: 1-0; 2-49; 3-110; 4-110; 5-124; 6-153; 7-154; 8-156. బౌలింగ్: స్టెయిన్ 4-0-41-1; ఇషాంత్ 4-0-36-2; విహారి 1-0-8-0; పెరీరా 4-0-26-2; మిశ్రా 3-0-27-0; స్యామీ 4-0-21-2. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: పార్థీవ్ పటేల్ (సి) స్టీవార్ట్ (బి) నరైన్ 17; శిఖర్ ధావన్ (సి) అండ్ (బి) స్టీవార్ట్ 23; డుమిని రనౌట్ 17; విహారి (స్టం) రామ్‌దిన్ (బి) నరైన్ 13; పెరీరా నాటౌట్ 57; స్యామీ (సి) బద్రీ (బి) నరైన్ 15; ఆశిష్ రెడ్డి (సి) అండ్ (బి) నరైన్ 0; కరణ్ శర్మ నాటౌట్ 13; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బైస్ 2, వైడ్లు 4, నోబాల్స్ 3) 9; మొత్తం (19.3 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి) 164. వికెట్ల పతనం: 1-35; 2-45; 3-70; 4-95; 5-142; 6-142. బౌలింగ్: రామ్‌పాల్ 4-0-39-0; బద్రీ 4-0-25-0; ఎమ్రిట్ 4-0-57-0; నరైన్ 4-1-9-4; స్టీవార్ట్ 3.3-0-32-1. చాంపియన్స్ లీగ్‌లో నేడు ఒటాగో x పెర్త్ సా. గం. 4.00 నుంచి రాజస్థాన్ x లయన్స్ రా. గం. 8.00 నుంచి వేదిక: జైపూర్ స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ఒటాగో, సన్‌రైజర్స్ ‘పాస్’
చాంపియన్స్ లీగ్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్, ఒటాగో వోల్ట్స్ జట్లు ప్రధాన పోటీలకు అర్హత సాధించాయి. ఈ రెండు జట్లూ వరుసగా రెండు రోజుల పాటు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి.... మూడో మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేకుండానే క్వాలిఫయింగ్‌లో ‘పాస్’ అయ్యాయి. పాకిస్థాన్‌కు చెందిన ఫైసలాబాద్ వోల్వ్స్, శ్రీలంకకు చెందిన కందురతా మారూన్స్కు నిరాశే మిగిలింది. శుక్రవారం జరిగే క్వాలిఫయింగ్ చివరి మ్యాచ్‌ల ద్వారా ఎవరు ‘టాప్’ అనేది తేలుతుంది. ఒటాగో, సన్రైజర్స్ల మ్యాచ్ విజేత క్వాలిఫయర్-1గా ప్రధాన పోటీల బరిలోకి దిగుతుంది. ఫైసలాబాద్, కందురతాల మధ్య జరిగే పోరు నామమాత్రం. ఒంటిచేత్తో.... మొహాలీ: ఇంగ్లండ్ నుంచి బుధవారం ఉదయం మొహాలీ వచ్చిన టెన్ డష్కటె... కేవలం ఆరు గంటల విశ్రాంతి తర్వాత నేరుగా మైదానంలోకి దిగాడు. సుదీర్ఘ ప్రయాణం చేసిన అలసటను అధిగమించి ఒంటిచేత్తో ఒటాగో వోల్ట్స్ను గెలిపించాడు. డష్కటె (2/9, 32 బంతుల్లో 64; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆల్‌రౌండ్ షో తో... పీసీఏ క్రికెట్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఒటాగో వోల్ట్స్ జట్టు కందురతా మారూన్స్పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన ఒటాగో ఫీల్డింగ్ ఎంచుకోగా... కందురతా మారూన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఓపెనర్ తరంగ (56 బంతుల్లో 76; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) నిలకడగా ఆడినా... సంగక్కర సహా మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ఆరంభంలో నెమ్మదిగా ఆడటం, చివర్లో ఒటాగో బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో కందురతా ఓ మాదిరి స్కోరు సాధించింది. ఒటాగో బౌలర్ బట్లర్ నాలుగు బంతుల వ్యవధిలో మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును దెబ్బ తీశాడు. టెన్ డష్కటె రెండు వికెట్లు తీసుకున్నాడు. ఒటాగో జట్టు 18 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి అలవోకగా గెలిచింది. డష్కటెతో పాటు నీషమ్ (19 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్సర్) చెలరేగిపోయాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు కేవలం 30 బంతుల్లో 57 పరుగులు జోడించడం విశేషం. ఓపెనర్లు బ్రూమ్ (25), రూథర్‌ఫోర్డ్ (20) కూడా రాణించారు. కందరుతా బౌలర్ దిల్హారా మూడు వికెట్లు పడగొట్టాడు. ఆల్‌రౌండ్ షో కనబరచిన టెన్ డష్కటెకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. స్కోరు వివరాలు కందురతా మారూన్స్ ఇన్నింగ్స్: తరంగ (సి) బి.మెకల్లమ్ (బి) బట్లర్ 76; షెహాన్ జయసూర్య (బి) మెక్‌మిలన్ 13; సంగక్కర (సి) టెన్ డష్కటె (బి) నీషమ్ 13; దిల్హారా (సి) రూథర్‌ఫోర్డ్ (బి) టెన్ డష్కటె 15; తిరిమన్నె (సి) బి.మెకల్లమ్ (బి) టెన్ డష్కటె 6; చమరసిల్వ ఎల్బీడబ్ల్యు (బి) బట్లర్ 6; లోకురాచి (బి) బట్లర్ 0; కులశేఖర (బి) వాగ్నర్ 14; కాందంబి రనౌట్ 5; రణ్‌దివ్ నాటౌట్ 1; మెండిస్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు (బై 1, లెగ్‌బైస్ 2, వైడ్లు 2) 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1-25; 2-52; 3-99; 4-112; 5-134; 6-134; 7-135; 8-146; 9-154. బౌలింగ్: బట్లర్ 4-0-21-3; మెక్‌మిలన్ 3-0-17-1; వాగ్నర్ 4-0-28-1; ఎన్.మెకల్లమ్ 2-0-30-0; నీషమ్ 4-0-39-1; టెన్ డష్కటె 2-0-9-2; బెర్డ్ 1-0-7-0. ఒటాగో వోల్ట్స్ ఇన్నింగ్స్: బ్రూమ్ (సి) కాందంబి (బి) దిల్హారా 25; రూథర్‌ఫోర్డ్ (సి) దిల్హారా (బి) రణ్‌దివ్ 20; బి. మెకల్లమ్ (స్టం) సంగక్కర (బి) దిల్హారా 8; టెన్ డష్కటె (సి) కులశేఖర (బి) దిల్హారా 64; నీషమ్ నాటౌట్ 32; ఎన్.మెకల్లమ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు (బైస్ 3, లెగ్‌బైస్ 2, వైడ్లు 2, నోబాల్ 1) 8; మొత్తం (18 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1-31; 2-45; 3-89; 4-146. బౌలింగ్: కులశేఖర 3-0-31-0; రణ్‌దివ్ 4-0-36-1; మెండిస్ 4-0-26-0; దిల్హారా 4-0-20-3; లోకురాచి 2-0-24-0; జయసూర్య 1-0-15-0. అలవోకగా... మొహాలీ: చాంపియన్స్‌లీగ్‌లో హైదరాబాద్‌తో ఆడాల్సిన జట్లన్నింటికీ హై అలెర్ట్. శిఖర్ ధావన్ భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. కెప్టెన్ ధావన్ (50 బంతుల్లో 59; 6 ఫోర్లు, 1 సిక్సర్) వరుసగా రెండో అర్ధసెంచరీ సాధించడంతో... సన్‌రైజర్స్ అలవోకగా ఫైసలాబాద్పై నెగ్గి లీగ్ ప్రధాన పోటీలకు అర్హత సాధించింది. పీసీఏ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 7 వికెట్ల తేడాతో ఫైసలాబాద్ వోల్వ్స్‌పై నెగ్గింది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఫైసలాబాద్ వోల్వ్స్ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 127 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్లు అమ్మర్ (31), అలీ (16) 48 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చినా... మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. కెప్టెన్ మిస్బావుల్ హక్ (40 బంతుల్లో 56 నాటౌట్; 1 ఫోర్, 5 సిక్సర్లు) ఒంటరి పోరాటంతో కనీసం ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. సన్‌రైజర్స్ బౌలర్లంతా సమష్టిగా రాణించారు. ఇషాంత్, మిశ్రా, కరణ్, పెరీరా, స్యామీ ఒక్కో వికెట్ తీసుకున్నారు. సన్‌రైజర్స్ 17.3 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 131 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ పార్థీవ్ పటేల్ (21 బంతుల్లో 23; 3 ఫోర్లు), ధావన్ కలిసి తొలి వికెట్‌కు 68 పరుగులతో శుభారంభాన్నిచ్చారు. ఈ ఇద్దరూ అవుటైనా... డుమిని (27 బంతుల్లో 20 నాటౌట్; 1 ఫోర్) నిలకడగా ఆడాడు. చివర్లో స్యామీ (6 బంతుల్లో 14 నాటౌట్; 3 ఫోర్లు) చకచకా పరుగులు చేసి మ్యాచ్‌ను త్వరగా ముగించాడు. సన్‌రైజర్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా (1/13)కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. స్కోరు వివరాలు ఫైసలాబాద్ వోల్వ్స్ ఇన్నింగ్స్: అమ్మర్ మొహమ్మద్ (సి) మిశ్రా (బి) స్యామీ 31; అలీ వకాస్ (సి) ఆశిష్ (బి) మిశ్రా 16; ఆసిఫ్ అలీ ఎల్బీడబ్ల్యు (బి) కరణ్ 0; మిస్బావుల్ హక్ నాటౌట్ 56; ఇమ్రాన్ ఖాలిద్ (సి) పెరీరా (బి) ఇషాంత్ 2; ఖుర్రమ్ షెహ్జాద్ (బి) పెరీరా 4; సల్మాన్ నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు (బైస్ 4, లెగ్‌బైస్ 6, వైడ్లు 4, నోబాల్ 1) 15; మొత్తం (20 ఓవర్లలో ఐదు వికెట్లకు) 127. వికెట్ల పతనం: 1-48; 2-50; 3-69; 4-92; 5-101. బౌలింగ్: స్టెయిన్ 4-0-20-0; ఇషాంత్ 4-0-26-1; పెరీరా 4-0-33-1; అమిత్ మిశ్రా 4-1-13-1; కరణ్ శర్మ 2-0-11-1; స్యామీ 2-0-14-1. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: పార్థీవ్ పటేల్ (సి) ఖుర్రమ్ (బి) అదిల్ 23; శిఖర్ ధావన్ (బి) ఖాలిద్ 59; డుమిని నాటౌట్ 20; సామంత్రె ఎల్బీడబ్ల్యు (బి) ఖాలిద్ 0; స్యామీ నాటౌట్ 14; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బైస్ 6, వైడ్లు 8, నోబాల్ 1) 15; మొత్తం (17.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి) 131. వికెట్ల పతనం: 1-68; 2-112; 3-112. బౌలింగ్: సమియుల్లా 4-0-36-0; అసద్ అలీ 3.3-0-27-0; అజ్మల్ 4-0-25-0; అదిల్ 3-0-14-1; ఖుర్రమ్ 1-0-9-0; ఖాలిద్ 2-0-14-2.