Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Irregularities of voting machines coming out one by one
ఈవీఎంల గుట్టు విప్పేదెవరు?

సాక్షి, అమరావతి: ఎల్రక్టానిక్‌ ఓటింగ్‌ మెషిన్ల (ఈవీఎంలు) పనితీరుపై ముసురుకుంటున్న అనుమానాలతో ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈవీఎంల హ్యాకింగ్‌ అసాధ్యమేమీ కాదని, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పరిజ్ఞానం సాయంతో వాటిని సులభంగా హ్యాక్‌ చేయవచ్చని టెక్‌ దిగ్గజం, టెస్లా కంపెనీ అధినేత ఎలాన్‌ మస్క్‌ తాజాగా ట్వీట్‌ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈవీఎంలను మనుషులు కూడా హ్యాక్‌ చేసేందుకు ఆస్కారం ఉందని, అసలు వీటిని రద్దు చేయాలని చాట్‌ జీపీటీ నిపుణుడైన ఆయన గట్టిగా డిమాండ్‌ చేయడం గమనార్హం. మరోవైపు ముంబైలో గెలుపొందిన శివసేన (షిండే) అభ్యర్థి రవీంద్ర వైకర్‌ బంధువు ఒకరు మొబైల్‌ ద్వారా ఈవీఎంను హ్యాక్‌ చేసి ఆపరేట్‌ చేసినట్లు వెలుగులోకి రావడం ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ సైతం ఈవీఎంల పనితీరుపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో పారదర్శకత లేకుంటే భవిష్యత్తు లేదని హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఓటింగ్‌ సరళిపై ఇప్పటికే పలువురు నిపుణులు, పరిశీలకులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా తమ ఓట్లన్నీ ఏమయ్యాయంటూ గ్రామాలకు గ్రామాలే నిలదీస్తుండటం గమనార్హం. గెలుపొందిన అభ్యర్థులు సైతం ఊహించని స్థాయిలో మెజారిటీలు రావటంపై నీలి నీడలు అలుముకుంటున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఈవీఎంల పనితీరుపై సర్వత్రా సందేహాలు తలెత్తుతున్నా... తాము వేసిన ఓట్లు ఏమయ్యాయని ఓటర్లు ప్రశ్నిస్తున్నా.. 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయని యావత్‌ దేశం నిలదీస్తున్నా... ఇవిగో ఈవీఎం మోసాలంటూ ఆధారాలు చూపిస్తున్నా... కేంద్ర ఎన్నికల సంఘం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. ‘తాంబూలాలు ఇచ్చేశాం... ఇక తన్నుకు చావండి’ అనే రీతిలో ఎన్నికల ప్రక్రియ ముగిశాక తమకు సంబంధం లేదనే రీతిలో బాధ్యతల నుంచి ఈసీ పలాయనం చిత్తగించడం ఈ సందేహాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించిన అనంతరం అందులో లొసుగులు గుర్తించడంతో వాటిని నిషేధించిన దేశాల సంఖ్య పెరుగుతోంది. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఇప్పటికీ బ్యాలెట్‌ పేపర్‌ విధానాన్నే అనుసరిస్తున్న నేపథ్యంలో మన దేశంలో ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణ సరికాదని సాధారణ ఓటర్లతోపాటు నిపుణులు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగా పరీక్షిస్తే కానీ ఈ రహస్యం వీడదని టెక్‌ నిపుణులు వాŠయ్‌ఖ్యానిస్తున్నారు. చిప్‌లోనే చిదంబర రహస్యం..! ఈవీఎంలలో ఉపయోగిస్తున్న చిప్‌లపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిజ్ఞానంపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) సూటిగా సమాధానం చెప్పకపోవడం సందేహాలకు బలం చేకూరుస్తోంది. ఈవీఎంలను హ్యాక్‌ చేయవచ్చని పలువురు సవాళ్లు విసురుతున్నా ఈసీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఈసీ చేసిన ప్రకటన మరిన్ని సందేహాలకు తావిచ్చింది. ఈవీఎంలలలో బ్లూటూత్‌ టెక్నా­లజీ లాంటిది ఉండదు కాబట్టి హ్యాక్‌ చేయడం సాధ్యం కాదని ఈసీ ఇటీవల వరకు వాదిస్తూ వచ్చింది. అయితే ఈవీఎంలలో ప్రోగ్రామబుల్‌ చిప్‌లు ఉపయోగిస్తున్నామని, ఫ్లాష్‌ మెమరీ వాడకం కూడా ఉంటుందని ఈసీ ఇటీవల తొలిసారిగా అంగీకరించింది. ప్రోగ్రామబుల్‌ చిప్‌లు, ఫ్లాష్‌ మెమరీని హ్యాక్‌ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఈవీఎంలు భద్రమేనా? అంటే ఈసీ సూటిగా సమాధానం చెప్పడం లేదు. భద్రతా సందేహాస్పదమే ఈవీఎంల భద్రత, నిర్వహణపైనా నీలి నీడలు అలుముకుంటున్నాయి. నిపుణులు వ్యక్తం చేస్తున్న సందేహాలకు ఈసీ సూటిగా సమాధానాలు చెప్పడం లేదు. ఈవీఎంల నిర్వహణ విషయంలో ఎన్నో భద్రత లోపాలు, ఇతర లొసుగులు ఉన్నట్లు ఇప్పటికే చాలా సందర్భాల్లో రుజువైంది. 2017 డిసెంబరు నాటికే ఈవీఎంల చోరీ, ధ్వంసం ఉదంతాలు దాదాపు 70 వరకూ చోటు చేసుకున్నట్లు ‘ద వైర్‌’ ప్రచురించిన కథనం స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్‌కు చెందిన మాజీ మంత్రి సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఈసీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈవీఎంలను తయారు చేసే ఎల్రక్టానిక్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ప్రకటన ప్రకారం.. ఈసీఐ కోరిన దాని కంటే 1,97,368 ఈవీఎంలు, 3,55,747 కంట్రోల్‌ యూనిట్లు ఎక్కువగా తయారయ్యాయి. 2024 ఎన్నికల సందర్భంగా కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఈవీఎంలు ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద లభించాయి. ఇక చోరీకి గురైన ఈవీఎంలపై ఈసీ స్పందన విడ్డూరంగా ఉంది. ప్రతి ఈవీఎంకు ప్రత్యేకమైన ఐడీ ఉంటుందని, యంత్రం చోరీకి గురైనా, కనిపించకుండా పోయినా ఆ ఐడీని బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని పేర్కొంది. తద్వారా ఆ ఈవీఎంలలో నమోదైన ఓట్లు పోలైన ఓట్లలో కలవకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలిపింది. మరి చోరీకి గురైన యంత్రాల్లో పరికరాలను మార్చినా, ఓటింగ్‌ నమోదు చేసేందుకు వాడిన సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి ఇతర ఈవీఎంలతో కలిపేస్తే ఏమవుతుంది? అనే ప్రశ్నలకు ఈసీ మౌనం దాల్చడం గమనార్హం. ఈవీఎంలను భద్రపరుస్తున్న ప్రదేశాలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నాయా? సీసీ కెమెరాలు ఉంటే వాటి ఫుటేజీని అందరికీ ఎందుకు అందుబాటులోకి ఉంచడం లేదు? అందులో ఇబ్బంది ఏమిటి? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. పోలింగ్‌ ముగిసిన తరువాత ఓట్ల లెక్కింపు వరకు స్ట్రాంగ్‌ రూమ్‌లలో ఈవీఎంల భద్రత వ్యవస్థ ఎంతవరకు పటిష్టం? అనే సందేహాలున్నాయి. స్ట్రాంగ్‌ రూమ్‌ల సీసీ కెమెరాల ఫుటేజీలను అన్ని పార్టీలకూ అందుబాటులో ఉంచితే పారదర్శకంగా ఉంటుంది. ఈ డిమాండ్‌పై ఈసీ కనీసం స్పందించలేదు. ఒకవైపు ఈవీఎంలను హ్యాక్‌ చేయడం సాధ్యమేనని నిపుణులు బల్లగుద్ది చెబుతుండగా సందేహాలను నివృత్తి చేయాల్సిన ఈసీ దాగుడుమూతలు ఆడటం అనుమానాలను బలపరుస్తోంది. 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయి? దేశంలో ఏకంగా 20 లక్షల ఈవీఎంలు కనిపించకపోడం మొత్తం ఎన్నికల ప్రక్రియపైనే ప్రశ్నార్థకంగా మార్చేసింది. ఎన్నికల నిర్వహణ కోసం 60 లక్షల ఈవీఎంలను దిగుమతి చేసుకోగా వాటిలో 40 లక్షల ఈవీఎంలను ఎన్నికల ప్రక్రియకు కేటాయించినట్టు ఈసీ వెల్లడించింది. మరి మిగిలిన 20 లక్షల ఈవీఎంలు ఎక్కడున్నాయనే ప్రశ్నకు ఇటు ఈసీగానీ అటు కేంద్ర ప్రభుత్వంగానీ జవాబు చెప్పడం లేదు. ఆ 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయో చెప్పాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ గట్టిగా డిమాండ్‌ చేశారు. దేశంలో ఎంపిక చేసిన రాష్ట్రాలు, నియోజకవర్గాల్లో గుట్టు చప్పుడు కాకుండా ఈవీఎంలను మార్చి అక్రమాలకు పాల్పడినట్లు కమ్యూనిస్టు పార్టీలు ఆరోపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా విభ్రాంతి వ్యక్తమవుతోంది. వైఎస్సార్‌ సీపీ, బిజూ జనతాదళ్‌ పార్టీలు తమకు అత్యంత బలమైన స్థానాల్లో కూడా ఓడిపోవడం విస్మయపరుస్తోంది. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీకి ఏమాత్రం బలం లేని నియోజకవర్గాల్లో సైతం ఆ పార్టీల అభ్యర్థులకు అనూహ్య మెజార్టీలు వచ్చాయి. ఇక ఒడిశాలో బీజేపీ ఉనికి అంతంత మాత్రంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం గమనార్హం. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు పడ్డ పాట్లన్నీ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. బస్సులు, ప్రైవేట్‌ వాహనాల్లో.. కర్ణాటకలో ఓ బీజేపీ ఎంపీ అభ్యర్థి వాహనంలో ఈవీఎంలు తరలిస్తున్న విషయం ఎన్నికల ముందే బయటపడింది. పిఠాపురం నియోజకవర్గంలో ఈవీఎంలను బస్సులో తరలించారు. ఓ ప్రైవేట్‌ వాహనంలో సైతం ఈవీఎంలు తరలించినట్లు బయటపడ్డా ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా పలుచోట్ల ఇదే రీతిలో ఈవీఎంలను ప్రైవేట్‌ వ్యక్తుల పర్యవేక్షణలో తరలించినట్లు తెలుస్తోంది. అవన్నీ కనిపించకుండాపోయిన 20 లక్షల ఈవీఎంలలోనివేనని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. అదృశ్యమైన 20 లక్షల ఈవీఎంలు ఎక్కడున్నాయో వెల్లడించాలని వామపక్షాలతోపాటు ఇతర పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు డిమాండ్‌ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 40 లక్షల ఈవీఎంతోనే ఎన్నికలు నిర్వహించామని, మిగిలిన 20 లక్షల ఈవీఎంల సంగతి తమకు తెలియదంటూ ఈసీ దాటవేత వైఖరి అనుసరిస్తోంది. ఈసీ, కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కై ఈ అంశాన్ని కప్పిపుచ్చేందుకు యత్నిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈవీఎంలను నిషేధించాలి: ప్యూర్టోరికోలో ఎన్నికల అక్రమాలపై ఎక్స్‌లో ఎలాన్‌ మస్క్‌ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలంటే ఈవీఎంలను నిషేధించాలి. ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణ సరికాదు. వాటిని సులభంగా హ్యాక్‌ చేయవచ్చు. ఈ భూమ్మీద హ్యాక్‌ చేయలేనిది ఏదీ లేదు. సంబంధిత వార్త: ఈవీఎంలు హ్యాక్‌ చేయొచ్చు! ఎలాగంటే..ఈవీఎంలు బ్లాక్‌ బాక్స్‌లు: ఎక్స్‌లో రాహుల్‌గాందీఈవీఎంలు బ్లాక్‌ బాక్సులు లాంటివి. వాటిని పరిశీలించేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వరు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం తీవ్ర ఆందోళనకరం. నిషేధిస్తూ విధాన నిర్ణయాలుప్రపంచంలో మెజార్టీ దేశాలు ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా విధాన నిర్ణయం తీసుకున్నాయి. భారత్‌తోపాటు బ్రెజిల్, వెనిజులా తదితర దేశాల్లో మాత్రమే ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అత్యధిక దేశాల్లో ఈవీఎంలను పూర్తిగా నిషేధించగా మరికొన్ని దేశాల్లో ఇతర పద్ధతులను జోడించి ఓటింగ్‌ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. మొబైల్‌తో ఈవీఎం హ్యాకింగ్‌ఈవీఎంలు ఎంత లోపభూయిష్టమో... వాటిని ఎంత సులువుగా హ్యాక్‌ చేయవచ్చో బహిర్గతమైంది. ముంబై నుంచి వెలువడే ప్రముఖ దినపత్రిక ‘మిడ్‌ డే’ కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని వాయువ్య ముంబై నియోజకవర్గం నుంచి ఎంపీగా కేవలం 48 ఓట్లతో విజయం సాధించిన శివసేన (ఏక్‌నాథ్‌ షిండే) అభ్యర్థి రవీంద్ర వైకర్‌ సమీప బంధువు మంగేశ్‌ పండిల్కర్‌ తన మొబైల్‌ ఫోన్‌ ద్వారా ఈవీఎంను అన్‌లాక్‌ చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఈ నెల 4న ముంబైలోని నెస్కో సెంటర్‌లో నిర్వహించారు. ఎంపీ బంధువు మంగేశ్‌ పండిల్కర్‌ ఈ సందర్భంగా తన మొబైల్‌ ఫోన్‌ ద్వారా ఈవీఎంను అన్‌లాక్‌ చేశారు. ఓటీపీ జనరేట్‌ చేయడం ద్వారా ఈవీఎంను అన్‌లాక్‌ చేయడం గమనార్హం. మొదట్లో శివసేన(ఉద్ధవ్‌ ఠాక్రే) అభ్యర్థి అమోల్‌ సంజన కీర్తికర్‌ కంటే వెనుకబడిన రవీంద్ర వైకర్‌ అనూహ్యంగా కేవలం 48 ఓట్లతో విజయం సాధించడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా కౌంటింగ్‌ కేంద్రంలోకి మొబైల్‌ ఫోన్‌ తీసుకువెళ్లడం, అదే ఫోన్‌ ద్వారా శివసేన (ఏక్‌నాథ్‌ షిండే) అభ్యర్థి పలువురితో మంతనాలు జరపడంపై ముంబై పోలీసులు ఈ నెల 14న కేసు నమోదు చేసి నిందితులకు నోటీసులు జారీ చేశారు. మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్‌ పరీక్షకు పంపారు. అయితే మొబైల్‌ ద్వారా ఈవీఎంను హ్యాక్‌ చేశారన్న మిడ్‌ డే పత్రిక కథనాన్ని ఎన్నికల కమిషన్‌ ఖండించింది.

TDP Ayyanna Pathrudu May Appointed As AP Assembly Speaker
ఏపీ శాసనసభ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు పేరును సీఎం చంద్రబాబు ఫైనల్‌ చేశారు. ఇక డిప్యూటీ స్పీకర్‌గా జనసేన నుంచి లోకం మాధవికి ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.అయితే, మొదటి నుంచి టీడీపీ నేతలు బుచ్చయ చౌదరి, కళా వెంకట్రావ్‌కు ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ, చివరకు అయ్యన్నపాత్రుడి పేరును చంద్రబాబు ఫైనల్‌ చేశారు.

Upcoming OTT Release Movies Telugu June 3rd Week 2024
ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ రెండు స్పెషల్!

డార్లింగ్ ప్రభాస్ 'కల్కి' సినిమా థియేటర్లలోకి వచ్చే వారమే రానుంది. దీంతో ఈ వారం థియేటర్లలోకి చెప్పుకోదగ్గ మూవీస్ అయితే రిలీజ్ కావడం లేదు. హనీమూన్ ఎక్స్‌ప్రెస్, ఓ మంచి ఘోస్ట్, సీతా కల్యాణ వైభోగమే, ప్రభుత్వ జూనియర్ కళాశాల లాంటి చిన్న చిత్రాలు మాత్రమే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరోవైపు ఓటీటీలో మాత్రం పలు ఇంట్రెస్టింగ్ మూవీస్ స్ట్రీమింగ్ కానున్నాయి.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు లేటెస్ట్ హారర్ మూవీ)ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ విషయానికొస్తే.. ఓవరాల్‌గా 20 వరకు సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో బాక్, నడికల్ తిలకం, మహారాజ్ చిత్రాలతో పాటు హౌస్ ఆఫ్ డ్రాగన్ రెండో సీజన్ ఉన్నంతలో ఆసక్తి రేపుతున్నాయి. ఇవి కాకుండా ఏవైనా తెలుగు స్ట్రెయిట్ మూవీస్ సడన్‌గా ఓటీటీలో రిలీజ్ కావొచ్చు. ఇంతకీ ఏయే ఓటీటీల్లో ఏయే మూవీస్ రాబోతున్నాయి? వాటి లిస్ట్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం.ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ లిస్ట్ (జూన్ 17 - 23 వరకు)నెట్‌ఫ్లిక్స్ఏజెంట్స్ ఆఫ్ మిస్టరీ (కొరియన్ సిరీస్) - జూన్ 18ఔట్ స్టాండింగ్: ఏ కామెడీ రివల్యూషన్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 18క్లెక్స్ అకాడమీ (పోలిష్ మూవీ) - జూన్ 19లవ్ ఈజ్ బ్లైండ్ బ్రెజిల్ సీజన్ 4 (పోర్చుగీస్ సిరీస్) - జూన్ 19మహారాజ్ (హిందీ చిత్రం) - జూన్ 19అమెరికన్ స్వీట్ హార్ట్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 20కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 (హిందీ సిరీస్) - జూన్ 20గ్యాంగ్స్ ఆఫ్ గలీషియా (స్పానిష్ సిరీస్) - జూన్ 21నడికర్ తిలకం (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 21ద విక్టిమ్స్ గేమ్ సీజన్ 2 (మాండరిన్ సిరీస్) - జూన్ 21ట్రిగ్గర్ వార్నింగ్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 21రైజింగ్ ఇంపాక్ట్ (జపనీస్ సిరీస్) - జూన్ 22హాట్‌స్టార్బాక్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూన్ 21బ్యాడ్ కాప్ (హిందీ సిరీస్) - జూన్ 21ద బేర్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 21ఆహాసీరగన్ (తమిళ సినిమా) - జూన్ 18అమెజాన్ మినీ టీవీఇండస్ట్రీ (హిందీ సిరీస్) - జూన్ 19జియో సినిమాహౌస్ ఆఫ్ డ్రాగన్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 17బిగ్ బాస్ ఓటీటీ (హిందీ రియాలిటీ షో) - జూన్ 21బుక్ మై షోలాస్ట్ నైట్ ఆఫ్ అమోర్ (ఇటాలియన్ మూవీ) - జూన్ 21(ఇదీ చదవండి: కూతురు ఐశ్వర్య ప్రేమ పెళ్లి.. హీరో అర్జున్ ఇం‍ట్రెస్టింగ్ కామెంట్స్)

YS Jagan Bakrid Wishes To Muslims: Andhra Pradesh
ముస్లింలకు వైఎస్‌ జగన్‌ బక్రీద్‌ శుభాకాంక్షలు

గుంటూరు, సాక్షి: ముస్లిం సోదర, సోద­రీ­­మ­ణు­లకు వైఎస్సా­ర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ బక్రీద్‌ శుభా­కాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉదయం తన ఎక్స్‌ ఖాతాలో ఆయన సందేశం ఉంచారు. కరుణ, త్యాగం, భక్తి విశ్వాసాలకు ప్రతీక బక్రీద్. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ, ఆయన చూపిన మార్గంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు.— YS Jagan Mohan Reddy (@ysjagan) June 17, 2024అంతకు ముందు.. ఓ ప్రకటనలోనూ ఆయన బక్రీద్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగ­నిరతికి, ధర్మ­బద్ధ­తకు, దాతృత్వానికి బక్రీద్‌ ప్రతీకగా నిలుస్తుంద­న్నారు. దైవ ప్రవక్త ఇబ్ర­హీం త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకొంటారన్నా­రు. పేద, ధనిక తారత­మ్యాలు లేకుండా, రాగద్వేషా­లకు అతీతంగా ముస్లింలందరూ ఈ పండు­గను భక్తిశ్రద్ధలతో నిర్వ­హించుకుంటారని చెప్పారు. అల్లాహ్‌ ఆశీ­స్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని అభిలషించారు.

Those in Rushikonda are government buildings: Andhra Pradesh
రుషికొండ ప్రభుత్వ భవనాలపై విషం కక్కుతున్న టీడీపీ అండ్‌ కో

సాక్షి, అమరావతి: రుషికొండ భవనాలపై టీడీపీ, టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారాలకు దిగిన వేళ.. అవి ప్రభుత్వ భవనాలేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మరోమారు స్పష్టం చేసింది. ‘ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అవి. అవేమీ ప్రైవేటు ఆస్తులు కావు. అవి ఎవరి సొంతం కూడా కాదు. విశాఖప­ట్నా­నికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ భవనాలను నిర్మించారు. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ప్రభు­త్వం ఇష్టం..అలాంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీయించి, వాటికి వక్రీకరణలకు జోడించి బురదజల్లాలని ప్రయత్నించడం వెనుక ఉద్దేశాలేంటో ప్రజలు గమనిస్తున్నారు. 1995 నుంచి కూడా విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చంద్రబాబు ఊదరగొడుతూనే ఉన్నారు. ఇప్పటికి నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. విశాఖ నగరానికి ఒక ప్రధానమంత్రి వచ్చినా, ఒక రాష్ట్రపతి వచ్చినా, ముఖ్యమంత్రి వెళ్లినా, గవర్నర్‌లాంటి వ్యక్తులు వెళ్లినా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదన్న విషయాన్ని గుర్తించండి. రుషికొండ రిసార్ట్స్‌ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీసి, పైత్యం ప్రదర్శించడంవల్ల మీకు మానసిక తృప్తి కలుగుతుందేమోగాని, విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదు’ అని సామాజిక మాధ్యమంలో పేర్కొంది. రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అవి. అవేమీ ప్రైవేటు ఆస్తులు కావు. అవి ఎవరి సొంతంకూడా కాదు. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ భవనాలను నిర్మించారు. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ప్రభుత్వం ఇష్టం. అలాంటి… https://t.co/o3m2GSOrAk— YSR Congress Party (@YSRCParty) June 16, 2024చీటికి మాటికి దుష్ప్రచారం తగదు: ఎమ్మెల్సీ వరుదు కల్యాణిరుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలేనని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి పేర్కొ­న్నారు. ఇలా ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్లి చీటికిమా­టికి తమ పార్టీపై దుష్ప్రచారం చేయటం తగద­న్నారు. ఆమె ఆదివారం సాక్షితో మాట్లాడుతూ అవేమీ ప్రైవేటు ఆస్తులు కావని తమ ప్రభుత్వం అధికారంలో ఉండగానే స్పష్టం చేసిందని గుర్తుచే­శారు. ‘ప్రజలు విజ్ఞులు. అన్నీ గమనిస్తూ ఉంటారు. టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మే ప్రసక్తేలేదు. అధికారం ఇచ్చింది ప్రజలకు సేవచేయమని. కల్పితకథలు సృష్టించి వైఎస్సార్‌సీపీపై నిందలు వేయమని కాదు..’ అని చెప్పారు. ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తే టీడీపీ వారికే నష్టం అని ఆమె పేర్కొన్నారు.

Babar Azam reveals future course of action after shock T20 WC Exit
చాలా సంతోషంగా ఉంది.. కానీ తప్పు ఎక్కడ జరిగిందో తెలియదు: బాబర్‌

టీ20 వరల్డ్‌కప్‌-2024ను పాకిస్తాన్‌ విజయంతో ముగించింది. ఇప్పటికే సూపర్‌-8 అవకాశాలను కోల్పోయిన పాకిస్తాన్‌.. తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. ఐరీష్‌ బ్యాటర్లలో గారెత్‌ డెలానీ(31) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. జోష్‌ లిటిల్‌ (18 బంతుల్లో 22 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించాడు. పాక్‌ బౌలర్లలో ఇమాద్‌ వసీమ్, షాహిన్‌ అఫ్రిది చెరో 3 వికెట్లు పడగొట్టగా... ఆమిర్‌కు 2 వికెట్లు దక్కాయి.తీవ్రంగా శ్రమించిన పాక్‌..అనంతరం 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధిం​చేందుకు పాక్‌ తీవ్రంగా శ్రమించింది. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయినప్పటకి కెప్టెన్‌ బాబర్‌ ఆజం(32) ఆజేయంగా నిలవగా.. ఆఖరిలో షాహిన్‌ అఫ్రిది (5 బంతుల్లో 13 నాటౌట్‌; 2 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి పాక్‌కు రెండో విజయాన్ని అందించాడు.107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాక్‌ 18.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేజ్‌ చేసింది. ఇక ఈ విజయంపై మ్యాచ్‌ అనంతరం పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం స్పందించాడు."టోర్నమెంట్‌ను విజయంతో ముగించడం చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌లో మేము బాగానే రాణించాము. ఆరంభంలోనే వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి జట్టును ఒత్తడిలోకి నెట్టాము. ఫ్లోరిడా వికెట్‌ పరిస్థితులకు తగ్గట్టు మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు.కానీ బ్యాటింగ్‌లో మాత్రం మేము మా మార్క్‌ను చూపించలేకపోయాము. వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డాము. ఏదో విధంగా టెయిలాండర్ల సాయంతో మ్యాచ్‌ను ముగించాము. ఇంతకుముందు మ్యాచ్‌ల్లో కూడా యూఎస్‌ఎ, భారత్‌పై కూడా దగ్గరకు వచ్చి ఓడిపోయాం. జట్టు అవసరం బట్టి నేను ఏ పొజిషన్‌లోనైనా బ్యాటింగ్‌ చేసేందుకు సిద్దంగా ఉన్నారు. అది ఓపెనింగ్‌ అయినా, ఫస్ట్‌డౌన్‌ అయినా కావచ్చు. ఇక జట్టులో మాత్రం అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు. మాకు కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత మేము బంగ్లాపర్యటనకు వెళ్లనున్నాం. ఈ నేపథ్యంలో మా బాయ్స్‌ తిగిరి కమ్‌బ్యాక్‌ ఇస్తారని నేను ఆశిస్తున్నాను. ​అయితే ఈ టోర్నమెంట్‌లో ఎక్కడ తప్పు జరిగిందో అంచనా వేయాల్సిన అవసరం మాకు ఉందని" పోస్ట్‌మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో బాబర్‌ పేర్కొన్నాడు.చదవండి: సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్‌.. 143 పరుగుల తేడాతో ఘన విజయం

US Pez Biden Bakrid Eid ul Adha 2024 On Gaza
‘గాజా యుద్ధ ముగింపునకు అత్యుత్తమ మార్గమిదే!’

వాషింగ్టన్‌: హమాస్‌-ఇజ్రాయెల్‌ యుద్ధంతో నిత్యనరకం చూస్తున్న ఇస్లాం పౌరులు.. ఇకనైనా ప్రశాంతంగా జీవించాల్సిన అవసరం ఉంది. యుద్ధం ముగిస్తేనే అది సాధ్యపడుతుంది. అందుకు అమెరికా ప్రతిపాదించిన కాల్పుల ఉల్లంఘన ఒప్పందం ఒక్కటే అత్యుత్తమ మార్గమని పేర్కొన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఆదివారం బక్రీద్‌(Eid ul Adha) సందేశం విడుదల చేశారు. ‘‘గాజా యుద్ధంతో ఎందరో అమాయకులు చనిపోయారు. అందులో వేల మంది చిన్నారులు ఉన్నారు. తమ కళ్ల ముందే తమ వాళ్లను పొగొట్టుకుని.. సొంత ప్రాంతాల నుంచి పారిపోయిన ముస్లింలు ఇంకెందరో. వాళ్ల బాధ అపారమైంది.. .. ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య ఈ మూడు దశల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదించింది. గాజాలో హింసకు ముగింపు పలకాలన్నా.. అంతిమంగా యుద్దం ముగిసిపోవాలన్నా ఇదే అత్యుత్తమ మార్గం అని బైడెన్‌ తన సందేశంలో స్పష్టం చేశారు.అంతేకాదు.. మయన్మార్‌లో రోహింగ్యాలు, చైనాలో ఉయిగర్లు.. ఇలా ఇతర ముస్లిం తెగల హక్కుల పరిరక్షణ కోసం అమెరికా ప్రయత్నాలు కొనసాగుతాయన్నారు. అలాగే.. సూడాన్‌లో కొనసాగుతున్న అంతర్యుద్ధం ముగింపునకు శాంతిపూర్వకం తీర్మానం రూపకల్పన దిశగా అమెరికా అడుగులు వేస్తున్నట్లు తెలిపారాయన. తన పరిపాలన ఇస్లామోఫోబోబియా, ఇతరత్ర రూపాల్లో ఉన్న పక్షపాత ధోరణిని ఎదుర్కొనేందుకు జాతీయ వ్యూహాన్ని అనుసరిస్తోందని.. ఇది ముస్లింలకు మాత్రమే కాకుండా అరబ్‌, సిక్కు, దక్షిణాసియా అమెరికన్లపై కూడా ప్రభావం చూపెడుతుందని తన బక్రీద్‌ సందేశంలో బైడెన్‌ పేర్కొన్నారు.బైడెన్‌ ప్రతిపాదించిన ఒప్పందం ఇదే.. మొదటి దశ.. ఇది ఆరు వారాలు కొనసాగుతుంది. ఇందులో ఇజ్రాయెల్‌-హామాస్‌ బలగాలు పూర్తిస్థాయిలో కాల్పుల విరమణను పాటించాలి. గాజాలోని జనాలు ఉండే ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్‌ బలగాలు వెనుదిరగాలి. వందల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్‌ విడుదల చేయాలి. ప్రతిగా మహిళలు, వృద్ధులు సహా పలువురు బందీలను హమాస్‌ అప్పగించాలి. రెండో దశలో.. సైనికులు సహా సజీవ ఇజ్రాయెలీ బందీలందరినీ హమాస్‌ విడిచిపెట్టాలి. గాజా నుంచి ఇజ్రాయెల్‌ బలగాలు పూర్తిగా వెనక్కి వచ్చేయాలి. మూడో దశలో.. గాజాలో పునర్నిర్మాణ పనులు భారీస్థాయిలో ప్రారంభమవుతాయి. బందీలుగా ఉన్నప్పుడు ప్రాణాలు కోల్పోయినవారి అవశేషాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించాలి.

INDIA bloc will try to ensure support for TDP if it contests LS Speaker
Sanjay Raut: టీడీపీ స్పీకర్‌ పదవికి పోటీ చేస్తే.. ఇండియా కూటమి మద్దతిస్తుంది

ముంబై: లోక్‌సభ స్పీకర్‌ పదవికి అధికార ఎన్డీఏ పక్షంలోని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) పోటీ చేస్తే ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలన్నీ మద్దతిచ్చే అవకాశముందని శివసేన(యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌ చెప్పారు. లోక్‌సభ స్పీకర్‌ పోస్టు చాలా కీలకమైందని, ఈ పదవి బీజేపీకి దక్కితే, ప్రభుత్వానికి మద్దతిచ్చే టీడీపీ, జేడీయూలతో పాటు చిరాగ్‌ పాశ్వాన్, జయంత్‌ చౌదరిలకు చెందిన పార్టీలను ముక్కలు చేస్తుందని ఆరోపించారు. బీజేపీని నమ్మి మోసపోయిన అనుభవం తమకు కూడా ఉందని రౌత్‌ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘లోక్‌సభ స్పీకర్‌ పదవిని టీడీపీ కోరుతున్నట్లుగా విన్నాను. అదే జరిగితే, ఇండియా కూటమి ఈ విషయాన్ని చర్చిస్తుంది. మా భాగస్వామ్య పక్షాలన్నీ టీడీపీకి మద్దతిచ్చేందుకు ప్రయత్నిస్తాయి’అని చెప్పారు. నిబంధన ప్రకారం ప్రతిపక్ష పార్టీకి డిప్యూటీ స్పీకర్‌ పోస్టు కేటాయించాలన్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) అగ్ర నేతలు బీజేపీపై చేసిన వ్యాఖ్యలపై సంజయ్‌ రౌత్‌.. గతంలో బీజేపీ చేసిన తప్పిదాలను ఆర్‌ఎస్‌ఎస్‌ సరిచేయాలనుకోవడం మంచి పరిణామమేనని పేర్కొన్నారు. జూన్‌ 7వ తేదీన పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో జరిగిన భేటీలో ప్రధాని మోదీ ఎన్డీఏ పార్లమెంటరీ పక్షం నేతగా, బీజేపీ పార్లమెంటరీ పార్టీ, లోక్‌సభలో బీజేపీ నేతగా ఎన్నికయ్యారని రౌత్‌ అన్నారు. ‘బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రత్యేకంగా జరగలేదు. అలా జరిగిన పక్షంలో నేత ఎవరనే ప్రశ్న ఉదయిస్తుంది, అప్పుడిక పరిణామాలు వేరుగా ఉంటాయి’అని అభిప్రాయపడ్డారు. మోదీ ఎన్డీఏ పార్లమెంటరీ పక్షం నేతగా మాత్రమే ఎన్నికవడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని రౌత్‌ వ్యాఖ్యానించారు.

Political row erupts over Mumbai North-West seat results
మహా ఈవీఎం వివాదం

18వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్‌ 4న అందరి దృష్టిని ఆకర్షించిన లోక్‌సభ స్థానం ముంబై నార్త్‌వెస్ట్‌. ఎందుకంటే అక్కడ గెలుపొందిన శివసేన అభ్యర్థి రవీంద్ర వాయ్‌కర్‌కు వచి్చంది కేవలం 48 ఓట్ల ఆధిక్యం. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇదే అత్యల్ప మెజారిటీ. ఇప్పుడు దానిచుట్టే రగడ మొదలైంది. వాయ్‌కర్‌కు అనుకూలంగా కౌంటింగ్‌ కేంద్రంలో ఉన్న ఆయన బంధువు మొబైల్‌ ఫోన్‌తో ఈవీఎంను హ్యాక్‌ చేశారనే వార్తా కథనం సంచలనం రేకెత్తిస్తోంది. ఈ కథనం క్లిప్పింగ్‌తో ఆరోపణలు మొదలయ్యాయి. అయితే ఈవీఎంలను హ్యాక్‌ చేయడానికి వీల్లేదని, వాటిని తెరవడానికి ఓటీపీ అవసరమే లేదని, బాహ్య వ్యవస్థలతో ఎలాంటి అనుసంధానం లేకుండా ఈవీఎంలు స్వతంత్రంగా పనిచేస్తాయని ముంబై నార్త్‌వెస్ట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ వందనా సూర్యవంశీ చెప్పారు. అనధికారికంగా కౌంటింగ్‌ కేంద్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఫోన్‌ను వాడిన వాయ్‌కర్‌ బంధువుపై కేసు నమోదైందని వెల్లడించారు. ముంబై: ఎల్రక్టానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌ (ఈవీఎం)లు బాహ్య ప్రపంచంతో ఎలాంటి అనుసంధానం, సాంకేతిక సంబంధాలు లేకుండా స్వతంత్రంగా పనిచేస్తాయని, సురక్షితమని ముంబై వాయువ్య లోక్‌సభ నియోజకవర్గం రిటరి్నంగ్‌ అధికారి వందనా సూర్యవంశీ ఆదివారం తెలిపారు. సమాచార మారి్పడికి ఈవీఎంలలో ఎలాంటి ఏర్పాటు ఉండదని పేర్కొన్నారు. ఈవీఎంలను తెరవడానికి ఎలాంటి ఓటీపీ అవసరం లేదని, వాటిపై ఉండే బటన్‌ను నొక్కడం ద్వారా ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఆమె వివరించారు. ముంబై నార్త్‌వెస్ట్‌లో శివసేన అభ్యర్థి రవీంద్ర వాయ్‌కర్‌ కేవలం 48 ఓట్లతో నెగ్గారు. రవీంద్ర వాయ్‌కర్‌ బంధువు మంగేష్‌ పాండిల్కర్‌ కౌంటింగ్‌ కేంద్రంలో ఈవీఎంకు అనుసంధానమైన మొబైల్‌ ఫోన్‌ను వాడారని, దీని ద్వారా ఈవీఎంను అన్‌లాక్‌ చేశారని, హ్యాక్‌ చేశారని మిడ్‌–డే పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. దీనిపై రిటరి్నంగ్‌ ఆఫీసర్‌ వందన స్పందిస్తూ.. ‘ఈవీఎంలు సాంకేతికంగా లోపరహితమైనవి. బయటినుంచి ఏ ఇతర సాంకేతిక వ్యవస్థలపై ఆధారపడకుండా స్వతంత్రంగా పనిచేస్తాయి. వాటిని ప్రోగ్రామ్‌ చేయడం కుదరదు. వైర్‌లెస్‌గా, వైర్లను కనెక్ట్‌ చేసి సమాచార మారి్పడి చేయడానికి ఈవీఎంలలో ఎలాంటి ఏర్పాటు లేదు’ అని తెలిపారు. రవీంద్ర వాయ్‌కర్‌ బంధువు మొబైల్‌ ఫోన్‌ ద్వారా ఈవీఎంను అన్‌లాక్‌ చేశారనే వాదనలను కొట్టిపారేశారు. ఇది శుద్ధ అబద్ధం. ఒక పత్రిక దీన్ని వ్యాపింపచేస్తోంది. మిడ్‌–డే పత్రికకు ఐపీసీ 499, 505 సెక్షన్ల కింద పరువునష్టం, అసత్య వార్తల ప్రచారానికి గాను నోటీసులు జారీచేశామని వందనా సూర్యవంశీ వెల్లడించారు. ముంబై నార్త్‌వెస్ట్‌లో శివసేన (యూబీటీ) అభ్యర్థి అమోల్‌ సజానన్‌ కీర్తికర్‌ గెలిచారని తొలుత వార్తలు వెలువడ్డాయి. అయితే రవీంద్ర వాయ్‌కర్‌ (శివసేన– షిండే) 48 ఓట్లతో గెలిచారని ఎన్నికల సంఘం ప్రకటించింది. మేము గెలిచినందుకేనా ఈ సందేహాలు: ఏక్‌నాథ్‌ షిండే ముంబై నార్త్‌వెస్ట్‌లో తమ (శివసేన) అభ్యర్థి రవీంద్ర వాయ్‌కర్‌ గెలిచినందుకే ఈవీఎంలపై అనుమానాలు రేకెత్తిస్తున్నారని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే మండిపడ్డారు. ఈ ఒక్క నియోజకవర్గం ఫలితంపైనే ఎందుకు సందేహాలు లేవనెత్తుతున్నారు. రాష్ట్రంలోని మిగతా స్థానాల ఫలితాలపై ఎందుకు అనుమానాలు వ్యక్తం చేయడం లేదు? ఎందుకంటే ముంబై నార్త్‌వెస్ట్‌లో నా అభ్యర్థి వాయ్‌కర్‌ గెలిచారు. వారి అభ్యర్థి (శివసేన–యూబీటీ) ఓడిపోయారు.. అని షిండే వ్యాఖ్యానించారు. ప్రజాతీర్పు వాయ్‌కర్‌కు అనుకూలంగా ఉందన్నారు. అది డాటా ఎంట్రీ ఆపరేటర్‌ మొబైల్‌ రవీంద్ర వాయ్‌కర్‌ బావమరిది మంగేష్‌ పాండిల్కర్‌ కాల్స్‌ చేయడానికి, అందుకోవడానికి కౌంటింగ్‌ కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్‌ దినేశ్‌ గౌరవ్‌ ఫోన్‌ వాడారని రిటరి్నంగ్‌ ఆఫీసర్‌ వందన వెల్లడించారు. కౌంటింగ్‌ కేంద్రంలో మొబైల్‌ వాడకూడదనే అధికారిక ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు ఐపీసీ 188 సెక్షన్‌ కింద మంగే‹Ùపై పోలీసు కేసు నమోదైంది. అలాగే దినేశ్‌ గౌరవ్‌పై కూడా కేసు నమోదైంది. డేటా ఎంట్రీ ఆపరేటర్‌ డేటాను పొందుపర్చడానికి మాత్రమే మొబైల్‌ ఫోన్‌ను వాడాలని, ఫోన్‌తో అవసరం తీరగానే సీనియర్‌ అధికారికి అప్పగించాలని, ఎల్లప్పుడూ మొబైల్‌ ఫోన్‌ను సైలెంట్‌ మోడ్‌లోనే పెట్టాలి. దినేశ్‌ ఈ నిబంధనలను పాటించలేదని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. మొబైల్‌ ఫోన్‌కు వచ్చే వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్‌.. సిస్టమ్‌లోకి లాగిన్‌ అవుతారు. డేటా ఎంట్రీ, ఓట్ల లెక్కింపు రెండు వేర్వేరు అంశాలు. కౌంటింగ్‌ ప్రక్రియకు, మొబైల్‌ ఫోన్‌ అనధికారిక ఉపయోగానికి ఎలాంటి సంబంధం లేదు. మొబైల్‌ ఫోన్‌ వాడకం దురదృష్టకర ఘటన, దీనిపై దర్యాప్తు జరుగుతోందని వందన వెల్లడించారు. ‘అధునాతన సాంకేతిక ఫీచర్లు, గట్టి అధికారిక నిఘా ఉందని.. అందువల్ల ఓట్లను తారుమారు చేసే అవకాశమే లేదని చెప్పారు. ప్రతిదీ అభ్యర్థులు లేదా వారి ఏజెంట్ల ఎదుటే జరుగుతుందన్నారు. రవీంద్ర వాయ్‌కర్‌ గాని, ఓటమి పాలైన అమోల్‌ కీర్తికర్‌ గాని రీ కౌంటింగ్‌ను కోరలేదని తెలిపారు. చెల్లని పోస్టల్‌ బ్యాలెట్లను పునఃపరిశీలించాలని డిమాండ్‌ చేయగా.. తాము అది చేశామని వివరించారు. అధీకృత కోర్టు ఆదేశాలు ఉంటే తప్ప సీసీటీవీ ఫుటేజీని బయటపెట్టలేమని తెలిపారు. ఫలితాన్ని నిలిపివేయాలి: పృథ్విరాజ్‌ చౌహాన్‌ ముంబై నార్త్‌వెస్ట్‌ నియోజకవర్గ ఫలితాన్ని నిలిపివేయాలని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్విరాజ్‌ చౌహాన్‌ ఆదివారం డిమాండ్‌ చేశారు. భారత ఎన్నికల సంఘం అన్ని పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ అంశాన్ని లోతుగా చర్చించాలని కోరారు. ‘మొబైల్‌ ఫోన్‌ అనధికారిక వినియోగంపై దర్యాప్తు జరగాలి. ఎఫ్‌ఐఆర్‌ను బహిరంగపర్చలేదు’ అని చౌహాన్‌ అన్నారు.

Horoscope Today: Rasi Phalalu On 17-06-2024 In Telugu
Daily Horoscope: ఈ రాశివారికి ప్రముఖుల నుంచి కీలక సందేశం

శ్రీ∙క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: శు.ఏకాదశి తె.4.26 వరకు(తెల్లవారితే మంగళవారం), తదుపరి ద్వాదశి, నక్షత్రం: చిత్త ప.12.35 వరకు, తదుపరి స్వాతి, వర్జ్యం: రా.6.40 నుండి 8.24 వరకు, దుర్ముహూర్తం: ప.12.27 నుండి 1.19 వరకు, తదుపరి ప.3.04 నుండి 3.56 వరకు, అమృతఘడియలు: తె.5.06 నుండి 6.50 వరకు(తెల్లవారితే మంగళవారం); రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు; యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు; సూర్యోదయం: 5.29; సూర్యాస్తమయం: 6.32. మేషం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి.వృషభం: ప్రముఖుల నుంచి కీలక సందేశం. విలాసవంతంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.మిథునం: పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆప్తుల నుంచి ఒత్తిడులు. భూవివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో అనుకోని మార్పులు.కర్కాటకం: నిర్ణయాలలో తొందరవద్దు. ఆరోగ్యసమస్యలు. శ్రమ పెరుగుతుంది. అనుకోని ప్రయాణాలు. దైవదర్శనాలు. పనులలో ఆటంకాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు.సింహం: నూతన పరిచయాలు. సంఘంలో ఆదరణ. విలువైన వస్తువులు సేకరిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో లక్ష్యసాధన. కళాకారులకు సత్కారాలు.కన్య: పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. సోదరులతో కలహాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. దైవచింతన.తుల: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖుల నుంచి పిలుపు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబసమస్యలు తీరతాయి. విందువినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పురోగతి.వృశ్చికం: పనులలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత ఒత్తిడులు.ధనుస్సు: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగి ఊరట చెందుతారు. దైవదర్శనాలు.మకరం: ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. ఆస్తి లాభం. సోదరులు,సోదరీలతో విభేదాలు తొలగుతాయి. కోర్టు కేసుల పరిష్కారం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.కుంభం: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమాధిక్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగమార్పులు.మీనం: పనులు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా. సోదరులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement