Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

AP Political News: June 19 YSRCP Key Meeting
YS Jagan: 19న వైఎస్సార్‌సీపీ కీలక సమావేశం

గుంటూరు, సాక్షి: ఎన్నికల ఓటమి తర్వాత ఢీలా పడ్డ పార్టీ కేడర్‌లో ధైర్యం నింపేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఫలితాలను సమీక్షిస్తూనే.. పార్టీ కీలక నేతలతో వరుస చర్చలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎల్లుండి కీలక సమావేశం నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు.అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులతో ఈ నెల 19వ తేదీన తన కార్యాలయంలో వైఎస్‌జగన్‌ భేటీ కానున్నారు. భవిష్యత్‌ కార్యాచరణ, టీడీపీ దాడులే ప్రధానాంశాలుగా ఈ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో.. ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై సమగ్రంగా చర్చించి పలు కీలక సూచనలతో వాళ్లకు ఆయన దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఆయన భేటీ నిర్వహించారు. ఇప్పుడే ఏం అయిపోలేదని.. అధైర్య పడొద్దని, పార్టీ చేసిన మంచిని ప్రజలు అంత సులువుగా మరిచిపోరని, త్వరలోనే పార్టీ పుంజుకుంటుందని వాళ్లందరికీ ధైర్యం చెప్పారాయన. అలాగే.. ప్రతిపక్షాలకు కాస్త టైం ఇద్దామని, ఆ తర్వాత ప్రజల తరఫున గట్టిగా పోరాటం చేద్దామని సూచించారు. మరోవైపు.. టీడీపీ శ్రేణుల్లో గాయపడ్డ వాళ్లను పరామర్శించేందుకు త్వరలోనే రాష్ట్రవ్యాప్త పర్యటన చేస్తారని ప్రకటించారు కూడా.

West Bengal: Goods train rams into Kanchenjunga Express Updates
Train Accident: బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం.. పెరిగిన మృతుల సంఖ్య

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ఘోర రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటిదాకా 15 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. మరో 60 మంది ప్రయాణికులు గాయపడినట్లు చెబుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతుండడం.. క్షతగాత్రులకు తీవ్ర గాయాలు కావడంతో మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు అంటున్నారు.సోమవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. న్యూ జల్‌పాయ్‌గురి వద్ద ఓ గూడ్స్‌ రైలు కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ రైలును ఢీ కొట్టింది. అస్సాం సిల్చార్‌- కోల్‌కతా సీల్దా మధ్య కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌(13174) నడుస్తుండగా.. ప్రమాదానికి కారణమైన గూడ్స్‌ అగర్తల నుంచి సీల్దా వస్తోంది. ఈ క్రమంలో.. సోమవారం ఉదయం 9గం. ప్రాంతంలో న్యూ జల్‌పాయ్‌గురి రంగపాని-నిజ్బారి స్టేషన్ల మధ్య గూడ్స్‌, కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను ఢీ కొట్టింది. पश्चिम बंगाल में रेल हादसा, डाउन कंचनजंगा एक्सप्रेस से टकराई मालगाड़ी, फिलहाल 6 घायलों की सूचनाअभी तक किसी जनहानि की खबर नहीं, राहत और बचाव के लिए रेलवे दल रवाना...#WestBengal #TrainAccident @IRCTCofficial @RailMinIndia pic.twitter.com/mhsDQpXHTw— Manraj Meena (@ManrajM7) June 17, 2024ప్రమాదం ధాటికి రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఓ బోగీ గాల్లోకి లేచింది. మూడు బోగీల్లోని ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. వీళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. ప్రమాదంలో గూడ్స్‌ డ్రైవర్‌, అసిస్టెంట్‌ పైలట్‌.. కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ గార్డ్‌ మరణించినట్లు రైల్వే శాఖ ధృవీకరించింది. అయితే మృతుల వివరాలను ఇంకా వెల్లడించాల్సి ఉంది.Shocked to learn, just now, about a tragic train accident, in Phansidewa area of Darjeeling district. While details are awaited, Kanchenjunga Express has reportedly been hit by a goods train. DM, SP, doctors, ambulances and disaster teams have been rushed to the site for rescue,…— Mamata Banerjee (@MamataOfficial) June 17, 2024మరోవైపు ఘటన గురించి తెలియగానే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘటనా స్థలానికి వెళ్లారు. ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్దీప్‌ ధన్‌కడ్‌, దేశ ప్రధాని నరేంద్ర మోదీ తదితరులు సోషల్‌ మీడియా ద్వారా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై రైల్వే శాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఎక్స్‌ ద్వారా స్పందించారు. 👉:​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఈ ప్రమాదం బాధాకరమని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారాయన. ఇంకోవైపు కేంద్రం ప్రమాదంలో మరణించిన వాళ్లకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. రైల్వే శాఖ తరఫున మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వాళ్లకు 2.5 లక్షలు, గాయపడిన వాల్లకు రూ.50వేలు ప్రకటించారు మంత్రి అశ్వినీ వైష్ణవ్‌. Unfortunate accident in NFR zone. Rescue operations going on at war footing. Railways, NDRF and SDRF are working in close coordination. Injured are being shifted to the hospital. Senior officials have reached site.— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 17, 2024ప్రమాదం ఎలా జరిగింది?ప్రమాదం అనంతరం ఆ ప్రాంతమంతా బీతావహ వాతావరణం నెలకొంది. ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు రావడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అయితే గూడ్స్‌ రైలు సిగ్నల్‌ను పట్టించుకోకుండా వేగంగా క్రాస్‌ చేసి వెళ్లిపోయిందని ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే.. ప్రమాదానికి గల కారణంపై రైల్వే శాఖ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

If I Have To Leave Captaincy: Babar Azam After Pakistan Poor T20 WC Exit Defends
కెప్టెన్సీకి గుడ్‌ బై?.. బాబర్‌ ఆజం ఘాటు స్పందన

‘‘నేను ఎప్పుడైతే నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగాలని భావించానో అప్పుడే(2023) కెప్టెన్సీ వదిలేశాను. ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించాను కూడా!ఆ తర్వాత మళ్లీ బోర్డు నాకు ఈ బాధ్యతలు అప్పగించింది. ఇది పూర్తిగా పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు నిర్ణయం. ఇక్కడి నుంచి తిరిగి వెళ్లిన తర్వాత.. ఏం జరిగిందన్న అంశం గురించి చర్చిస్తాం.ఎక్కడ పొరపాటు జరిగిందో సమీక్షించుకుంటాం. ఒకవేళ నేను కెప్టెన్సీ వదిలేయాల్సి వస్తే.. కచ్చితంగా అందరి ముందు నేనే ప్రకటిస్తా. ఇందులో దాచాల్సిన విషయం ఏమీ లేదు.ఏం జరిగినా అంతా ఓపెన్‌గానే ఉంటుంది. అయితే, నేనిప్పుడు దాని గురించి ఆలోచించడం లేదు. ఈ విషయంలో పీసీబీదే తుది నిర్ణయం’’ అని పాకిస్తాన్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం స్పష్టం చేశాడు.వన్డే వరల్డ్‌కప్‌-2023లో వైఫల్యం తర్వాతపాక్‌ బోర్డు ఆదేశాల మేరకే సారథిగా కొనసాగాలా లేదా అన్న విషయమై నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నాడు. కాగా భారత్‌ వేదికగా వన్డే వరల్డ్‌కప్‌-2023లో పాకిస్తాన్‌ ఘోరంగా వైఫల్యం చెందిన విషయం తెలిసిందే.గ్రూప్‌ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించడంతో నైతిక బాధ్యత వహిస్తూ బాబర్‌ ఆజం కెప్టెన్‌ పదవికి రాజీనామా చేశాడు. అతడి స్థానంలో స్టార్‌ పేసర్‌ షాహిన్‌ ఆఫ్రిది టీ20 కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు.అయితే, అతడిని పీసీబీ ఎక్కువకాలం కొనసాగించలేదు. బోర్డు యాజమాన్యం మారిన తర్వాత మళ్లీ బాబర్‌ ఆజంనే వన్డే, టీ20 కెప్టెన్‌గా నియమించింది. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్‌-2024లో బాబర్‌ సారథ్యంలో పాకిస్తాన్‌ ఘోర పరాభవం పాలైంది.గ్రూప్‌-ఏలో ఉన్న పాక్‌.. తొలుత అమెరికా.. తర్వాత టీమిండియా చేతిలో ఓడింది. ఆ తర్వాత కెనడా.. తాజాగా ఐర్లాండ్‌పై గెలుపొందినా అప్పటికే సూపర్‌-8 నుంచి నిష్క్రమించింది. పాక్‌ కంటే మెరుగైన స్థితిలో ఉన్న అమెరికా టీమిండియాతో పాటు తదుపరి దశకు అర్హత సాధించింది.అందరి ప్లేస్‌లో నేను ఆడలేను కదా!ఈ నేపథ్యంలో బాబర్‌ ఆజం కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడిని వెంటనే రాజీనామా చేయాలంటూ పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్లు డిమాండ్‌ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో బాబర్‌ ఆజం స్పందిస్తూ.. ‘‘కేవలం ఒక వ్యక్తి వల్ల మేము ఓడిపోలేదు. జట్టుగా గెలిచాం.. జట్టుగానే ఓడిపోయాం. చాలా మంది కెప్టెన్‌ వైపు వేలు చూపిస్తున్నారు. కానీ ప్రతి ఆటగాడి స్థానంలో నేను వెళ్లి ఆడలేను కదా! జట్టులోని 11 మంది ఆటగాళ్లకు తమదైన పాత్ర ఉంటుంది. జట్టుగా మేము విఫలమయ్యాం. ఈ విషయాన్ని ముము అంగీకరించక తప్పదు. వైఫల్యానికి ఎవరో ఒకరిని బాధ్యులుగా చూపే పరిస్థితి లేదు’’ అని పేర్కొన్నాడు. తనను విమర్శిస్తున్న వాళ్లకు ఈ మేరకు ఘాటుగానే సమాధానం ఇచ్చాడు బాబర్‌ ఆజం.చదవండి: T20 WC: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్‌ కెప్టెన్‌.. ధోని వరల్డ్‌ రికార్డు బద్దలు View this post on Instagram A post shared by ICC (@icc)

congress leader Sam Pitroda reacts om EVMS debate says Possible to manipulate
ఈవీఎంలను హ్యాక్‌ చేయటం సాధ్యమే: శ్యామ్‌ పిట్రోడా

ఢిల్లీ: పోలింగ్‌లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లు​ (ఈవీఎం) హ్యాకింగ్‌కు గురువుతున్నాయంటూ టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే ఈ వ్యవహారంపై తాజాగా కాంగ్రెస్‌ నేత శ్యామ్‌ పిట్రోడా ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈవీఎం మిషన్లను హ్యాక్‌ చేయడానికి, ఫలితాలను తారుమారు చేయడానికి అవకాశం ఉన్నట్లు అభి​ప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. ‘‘ఎలక్ట్రానిక్స్‌, ఐటీ, సాఫ్ట్‌వేర్‌, కాంప్లెక్స్‌ సిస్టంల రంగాల మీద సుమారు అరవై ఎళ్లపాటు నేను పనిచేశాను. అదే విధంగా నేను ఈవీఎం యంత్రాల వ్యవస్థను కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. ఈవీఎంలను హ్యాక్‌ చేయటం సాధ్యం అవుతుంది.దీని వల్ల ఫలితాలకు కూడా మారిపోతాయి. ఇటువంటి సమయంలో సంప్రదాయ పాత బ్యాలెక్‌ ఓటింగ్‌ విధానమే చాలా ఉత్తమమైంది. ఓట్ల ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు జరగవు. బ్యాలెట్‌ విధానాన్నే ఎన్నికల్లో అనుసరించాలి’’ అని అన్నారు.I have spent about 60 years in the forefront of #electronics, #telecom,IT, #software, #complex systems and a lot more. I have studied #EVM system carefully and believe that it is possible to manipulate. The best approach is the traditional paper ballet to count as casted.— Sam Pitroda (@sampitroda) June 16, 2024 ‘పోలింగ్‌లో ఉపయోగించే ఈవీఎం మిషన్లతో పాటు, వీవీప్యాట్‌ స్లిప్స్‌ కోసం వీవీప్యాట్‌ యాంత్రాలు కూడా అమర్చబడి ఉన్నాయి. ఈ కమ్రంలో ఈవీఎంలను హ్యాక్‌ చేయడానికి అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది’ అని అన్నారు.The #EVM debate in #India continues to get hotter due to a comment from #Elon Musk .The facts are clear. It is not just the stand alone EVM but a complex system with #VVPAT & associated processes and logistics that is open to selective manipulation.— Sam Pitroda (@sampitroda) June 16, 2024 సంబంధిత కథనం: ఈవీఎంల గుట్టు విప్పేదెవరు?

Ex Minister Gudiwada Amarnath Key Comments Over TDP And Rishikonda
‘ప్రభుత్వ ఆస్తుల్ని జగన్‌కు ఎలా అంటగడతారు?’

సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ ఆస్తుల విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని.. రుషికొండ నిర్మాణాలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి చెందినవిగా చూపించేందుకు టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌. టీడీపీ అనుకూల మీడియాలో జరుగుతున్న విష ప్రచారంపై సోమవారం విశాఖలో అమర్నాథ్‌ మాట్లాడారు.. ‘‘వైఎస్సార్‌సీపీ, వైఎస్‌ జగన్‌ను బద్నాం చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్‌.. ఎవరు వచ్చినా ఉండేలా నిర్మాణాలు చేపట్టింది. రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ విశాఖ వచ్చిన సందర్భంలో రుషికొండ భవనాలను వినియోగించుకోవాలి. రుషికొండపై కట్టిన భవనాల్లో వైఎస్‌ జగన్‌ ఏమీ ఉండరు. ప్రారంభించిన భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేయాలి... నాలుగు నెలలు క్రితమే రుషికొండ భవనాలను ప్రారంభించాం. విశాఖను రాజధానిగా ప్రకటన చేసిన తర్వాత రుషికొండ నిర్మాణంపై ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేశారు. కమిటీ ఒకే అన్న తరువాతే రుషికొండ భవనాలను నిర్మించారు. టీడీపీ నేతలు వైఎస్ జగన్ మీద, వారి కుటుంబం మీద బురద జల్లాలని చూడటం ఎంతవరకు సమంజసం? అని అమర్నాథ్‌ ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: రుషికొండ ప్రభుత్వ భవనాలపై విషం కక్కుతున్న టీడీపీ అండ్‌ కో..ఆక్రమణలు జరిగింది రుషికొండలో కాదు.. గీతం యూనివర్సిటీలో జరిగాయి. గీతం యూనివర్సిటీ భూ ఆక్రమణలను గంటా శ్రీనివాసరావు చూపిస్తే బాగుండేది. అమరావతిలో చంద్రబాబు తాత్కాలిక భవనాలు నిర్మిస్తే, వైఎస్ జగన్ రుషికొండపై శాశ్వత భవనాలు నిర్మించారు. టీడీపీ నేతలకు ధైర్యం ఉంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూపించాలి. రుషికొండ భవనం గురించి మీడియోలు, ఫోటోలు తీసి చూపించారు. అదే సమయంలో మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా చూపించండి. .. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం జరుగుతోంది. మెడికల్‌ కాలేజీలు, ఉద్దానంలో కట్టిన ఆసుపత్రిని చూపించండి. వాటర్‌ ప్రాజెక్ట్‌, నర్సీపట్నం మెడికల్‌ కాలేజీ నిర్మాణం, కురపం కాలేజీ, మూలపేటలో పోర్టు నిర్మాణం, పలు ప్రాజెక్ట్‌ల నిర్మాణాలు జరుగుతున్నాయి అవి చూపించండి. .. అమరావతిలో తాత్కాలిక భవనాల పేరిట వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆనాడు ప్రభుత్వధనం ఏమైంది?. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో అందరికీ తెలుసు. మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు కూడా వాస్తవాలు తెలుసుకోవాలి. టీడీపీ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోంది. అధికార పార్టీ ఇలాంటివి మానుకోవాలని కోరారు. రుషికొండపై ఉన్నవి ప్రభుత్వ భవనాలు అని టీడీపీ నేతలు గుర్తించాలి’ అంటూ గుడివాడ అమర్నాథ్‌ వైఎస్సార్‌సీపీ తరఫున ఎల్లో ముఠాకు కౌంటర్‌ ఇచ్చారు.

Ksr Comments On The Chances Of YSRCP Coming Back To Power In Politics
వైఎస్సార్‌సీపీ బౌన్స్‌ బ్యాక్‌ వెరీ సూన్‌!

వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ తనకు అనూహ్యంగా ఎదురైన చేదు అనుభవం నుంచి కోలుకుంటున్నారు. ఆయన తిరిగి రాజకీయ కార్యకలాపాలను ఆరంభించారు. ఆయా వర్గాల వారిని కలుస్తున్నారు. పార్టీ నేతలతో సంభాషిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో వేర్వేరుగా ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశాలలో పార్టీకి ఎదురైన ఓటమి నుంచి కోలుకుని, మళ్లీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే విషయమై చర్చిస్తున్నారు. తాను కచ్చితంగా ప్రజలలో తిరుగుతానని, ప్రజల పక్షాన పోరాటాలు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇది ఒక రకంగా క్యాడర్ కు భరోసా ఇచ్చేది అవుతుంది.టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దాడులపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ వారికి ధైర్యం చెప్పే విధంగా తాను టూర్ చేస్తానని ప్రకటించారు. ఒకసారి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ జనంలో తిరగడం మొదలు పెడితే పరిస్థితి పూర్తిగా మారే అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల హింసాయుత ఘటనలు జరిగాయి. వాటిలో వందల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు. కొద్ది మంది మరణించారు. ఓటమిని భరించలేక కొంతమంది ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. టీడీపీ గూండాలు వైఎస్సార్‌సీపీవారి ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారు. వారి కోసం ఇప్పటికే జిల్లా వారీగా లీగల్ టీమ్ లు ఏర్పాటుచేశారు. నేతలతో కమిటీలు ఏర్పాటు చేసి ఆయా చోట్ల పర్యటించాలని కోరారు. తదుపరి తానే స్వయంగా వెళ్లి పరామర్శించబోతున్నారు.ఏ రాజకీయ పార్టీ నేత అయినా ఇదే పని చేయాలి. గతంలో వ్యక్తిగత కారణాలతో ఎక్కడైనా గొడవ జరిగి, టీడీపీ వ్యక్తి ఎవరైనా గాయపడినా, మరణించినా చంద్రబాబు దానిని రాజకీయం చేసి, అక్కడకు పరామర్శ యాత్ర చేపట్టేవారు. అదంతా టీడీపీ మీడియాలో విస్తారంగా ప్రచారం అవుతుండేది. ఈ రకంగా ఐదేళ్లపాటు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ ప్రభుత్వంపై ఉన్నవి, లేనివి కలిపి దుష్ప్రచారం చేశారు. ఎలాగైతేనేం అధికారం సంపాదించారు. టీడీపీ వారు దానిని సద్వినియోగం పరచుకోవడం మాని వైఎస్సార్‌సీపీ వారిపై కక్ష సాధింపునకు వాడుకుంటున్నారు. టీడీపీ క్యాడర్ యధేచ్చగా హింసాకాండకు పాల్పడడానికి చంద్రబాబు వంటి పెద్ద నేతలు కూడా ప్రోత్సహం ఇవ్వడం దురదృష్టకరం.ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ తన పార్టీవారిలో విశ్వాసం పెంపొందిచడానికి చర్యలు చేపట్టారు. వైఎస్సార్‌సీపీకు భవిష్యత్తు ఉందని ఆయన చెబుతూ ఆత్మ స్థైర్యం కోల్పోవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇది వాస్తవం. రాజకీయాలలో గెలుపు ఓటములు ఉంటాయి. ఆ మాటకు వస్తే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ 1989-94, 2004-2014, 2019-2024 టరమ్ లలో అధికారంలో లేదు. ప్రతిపక్షంగానే ఉంది. అయినా పార్టీ నిలబడింది. తిరిగి పవర్ లోకి వచ్చింది. అబద్ధాలతో వచ్చిందా? లేక కొందరు అనుమానిస్తున్నట్లు ఈవీఎం మోసాలతో వచ్చిందా? అనేది వేరే విషయం. కానీ పార్టీ ఏర్పడిన తర్వాత నాలుగు దశాబ్దాలలో రెండు దశాబ్దాలపాటు అధికారంలో లేదన్న సంగతి గుర్తుంచుకోవాలి.అలాగే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ పార్టీని స్థాపించినప్పుడు దాదాపు ఒంటరిగానే రాజకీయం ఆరంభించారు. ఆ తర్వాత 2014లో అధికారం సాధించలేకపోయినా, నిత్యం ప్రజలతో మమేకమయి 2019లో ప్రభుత్వంలోకి వచ్చారు. కనుక ప్రతిపక్షంలో ఉండడం వైఎస్సార్‌సీపీకి కూడా కొత్త కాదు. కాకపోతే ఒక్కసారిగా ఓటమిని ఊహించని క్యాడర్ కు కాస్త ధైర్యాన్ని ఇచ్చి ప్రజలలో పనిచేసేలా వ్యూహం రచించుకోవాలి. ఏ చిన్న అవకాశం వచ్చినా వదలిపెట్టకుండా ప్రభుత్వాన్ని ఎండగట్టే అవకాశం విపక్షానికి ఉంటుంది. దానిని వినియోగించుకోగలగాలి.ఈ విషయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌కు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఆయన ప్రభుత్వం నడుపుతున్నప్పుడు చెప్పిన హామీలను నెరవేర్చి ఒక విశ్వసనీయత కలిగిన నేతగా పేరొందారు. అంతవరకు వాస్తవం. ఓటమికి పలు ఇతర కారణాలు ఉండవచ్చు. కానీ చాలా వరకు మాట మీద నిలబడే వ్యక్తిగా జగన్ నిలబడిపోతారు. దానినే ఆయన ప్రస్తావించి మనపట్ల విశ్వసనీయత బతికే ఉందని అన్నారు. అర్హతే ప్రమాణికంగా కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు చూడకుండా స్కీములు అమలు చేసిన చరిత్ర తమది అయితే, కూటమికి ఓటేయలేదనే ఏకైక కారణంతో టీడీపీ వారు తెగబడి రాష్ట్రాన్ని రావణాకాష్టంగా మార్చారని ఆయన పేర్కొన్నారు. దేశ చరిత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ మాదిరి స్కీముల అమలులో పార్టీ, కులం, మతం వంటివి చూడని నేత మరొకరు లేరంటే అతిశయోక్తికాదు.అయితే అదే విశ్వసనీయత పాయింట్ ఆయనను దెబ్బతీసిందని చెప్పాలి. తన ప్రభుత్వం ఏడాదికి సుమారు డెబ్బైవేల కోట్ల రూపాయల మేర వివిధ స్కీములను అమలు చేస్తున్నందున అదనంగా కొత్త స్కీములు ఇవ్వలేమని, పెన్షన్ లు నాలుగువేల రూపాయలు చేయలేమని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ ఎన్నికల మానిఫెస్టో విడుదల సందర్భంగా పేర్కొన్నారు. దానిని జనం పాజిటివ్ గా తీసుకోలేదని అనుకోవాలి. చంద్రబాబు నాయుడు ఇచ్చిన భారీ హామీల ప్రకటనకు ఆశపడి టీడీపీకి ఓటు వేసినట్లు కనబడుతుంది. దానిని దృష్టిలో ఉంచుకుని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ ఒక మాట అన్నారు. "విశ్వసనీయత లేని మనిషిగా రాజకీయాలు చేద్దామా! లేక కష్టాలు ఎదుర్కుంటూ హూందాగా నిలబడి ముందడుగు వేద్దామా?" అని ప్రశ్నించారు. మాట ప్రకారం నిలబడితేనే మళ్లీ అధికారంలోకి వస్తామని ఆయన నమ్ముతున్నారు.తాత్కాలికంగా ప్రజలు చంద్రబాబు హామీలను నమ్మినా, వాటిని అమలు చేయడం కష్టం కనుక, 2014 టరమ్ లో మాదిరి చంద్రబాబు ప్రభుత్వం ఈసారి కూడా చతికిలపడుతుందని పలువురు భావిస్తున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ ఉద్దేశం కూడా అదే కావచ్చు. అందుకే నిబ్బరంగా ఉండి పార్టీ కోసం పనిచేయాలని ఆయన అన్నారు. శాసనమండలిలో వైఎస్సార్‌సీపీకి అత్యధిక మెజార్టీ ఉన్నందున చంద్రబాబు నాయుడు రకరకాల ప్రలోభాలు పెట్టడమో, లేక తప్పుడు కేసులు పెట్టించడమో చేస్తారని ఆయన అనుమానిస్తున్నారు. దానిని తట్టుకుని నిలబడాలని ఎమ్మెల్సీలను ఆయన కోరారు. దానికి ఎంతమంది కట్టుబడి ఉంటారన్నది కాలమే తేల్చుతుందని చెప్పాలి.ప్రత్యేక హోదా గురించి కూడా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ ప్రస్తావించారు. గతంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ ఒక మాట చెప్పేవారు. తనకు 25 ఎంపీ సీట్లు ఇస్తే, కేంద్రంలో ఏ కూటమికి తక్కువ సీట్లు వస్తే, దానికి మద్దతు ఇవ్వడానికి ప్రత్యేక హోదా డిమాండ్ పెడతానని అనేవారు. అప్పట్లో బీజేపీకి పూర్తి మెజార్టీ వచ్చింది. దాంతో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ ఏమీ చేయలేని పరిస్థితిలో పడ్డారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి రావడం ప్లస్ పాయింట్. అయినా ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించకపోవడం ఆయన బలహీనత. దానిని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ బాగా ఎక్స్ పోజ్ చేశారు. మరో మాట కూడా అన్నారు. ఏపీ శాసనసభలో ప్రతిపక్షంగా ఉన్నది ఒక్క వైఎస్సార్‌సీపీ మాత్రమే. దానికి ప్రతిపక్ష హోదాకు తగినన్ని సీట్లు లేవు. అందువల్ల ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవచ్చు. అంత ఉదారత తెలుగుదేశం పార్టీకి ఉంటుందని ఆశించనవసరం లేదు.1994లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ కు ఉమ్మడి ఏపీలో ఇరవైఆరు సీట్లే వచ్చాయి. దీని ప్రకారం ప్రతిపక్ష హోదా దక్కలేదు. అప్పట్లో కాంగ్రెస్ నేత పి. జనార్ధనరెడ్డి పలుమార్లు డిమాండ్ చేసినా, ఆయనను ప్రతిపక్ష నేతగా గుర్తించడానికి చంద్రబాబు అంగీకరించలేదు. అలాంటిది ఇప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌కు ఆ హోదా ఇస్తారని అనుకోనవసరం లేదు. అయితే శాసనమండలిలో వైఎస్సార్‌సీపీకి బలం ఉన్నంతకాలం ప్రభుత్వంపై గట్టి పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా పార్టీలో పునరుత్తేజానికి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వడానికి ఇంకా కొంత సమయం పడుతుందని చెప్పక తప్పదు. అంతవరకు ఓపిక పడితే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ చెప్పినట్లు వైఎస్సార్‌సీపీకు భవిష్యత్తు ఆశాజనకంగానే ఉంటుంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు

Harish Rao Questioning Congress Govt Over Jobs And Pensions
ఉద్యోగాలు, పెన్షన్ల సంగతేంటి.. భట్టి మాటలు ఏమయ్యాయి?: హరీష్‌రావు

సాక్షి, తెలంగాణభవన్‌: తెలంగాణలో ఉద్యోగ నియామకాలపై కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. నిరుద్యోగుల డిమాండ్లు నెరవేర్చకపోతే త్వరలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.కాగా, తెలంగాణభవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ గ్రూప్స్‌ ఉద్యోగాలు పెంచాలని అడిగింది. మరి ఇప్పుడు ఎందుకు పోస్టులు పెంచడం లేదు. అసెంబ్లీలో భట్టి విక్రమార్క చెప్పిన మాటలు ఏమయ్యాయి. ఉద్యోగాల విషయంలో నిరుద్యోగులకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నిరుద్యోగులకు అన్యాయం చేయకండి. ప్రభుత్వం భేషజాలకు పోకుండా వారికి న్యాయం చేయాలి.గ్రూప్1, గ్రూప్-2 నిరుద్యోగ యువత మమ్మల్ని కలిశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు వారిని రెచ్చగొట్టి తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రజాభవన్ వద్దకు వెళ్ళి చిన్నారెడ్డి కాళ్ళు పట్టుకున్నా కనికరించటం లేదని ఆవేదన చెందుతున్నారు. నిరుద్యోగులకు అన్యాయం చేయకండి, ప్రభుత్వం భేషజాలకు పోకుండా వారికి న్యాయం చేయాలి.గ్రూప్స్‌ పరీక్షల్లో 1:50 ఇస్తామంటే 1:100 ఉద్యోగాలు బడుగు బలహీనవర్గాలకు ఇవ్వాలని అడిగారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక తాము ఇస్తామని భట్టి చెప్పారు. కానీ, ఇప్పుడు ఇవ్వటం లేదు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని అన్నారు. ఆరు నెలలు అయిన జాబ్ క్యాలెండర్‌ ఎందుకు ఇవ్వటం లేదు. మీ మాటలు గడప దాటడం లేదు. రాష్ట్రంలో మెగా డీఎస్సీతో 25వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని అన్నారు. కానీ, 11వేలకే పరిమితం ఎందుకు చేస్తున్నారు.నో పెన్షన్లు..కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయ్యింది. ఇప్పటికీ ఇంకా పెన్షన్లు ఇవ్వలేదు. కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు నెల నెలా పెన్షన్‌ వచ్చింది. కానీ, ఇప్పుడు ఆ పాత పెన్షన్లు కూడా ఇప్పటికీ ఇవ్వలేదు. ఇందిరమ్మ రాజ్యం రాగానే నాలుగు వేలు ఇస్తామని అన్నారు. నాలుగు వేలు కాదు కదా, ఉన్న రెండు వేల పెన్షన్లు కూడా ఇవ్వటం లేదు. అభాగ్యులకు ఇచ్చే పెన్షన్ కూడా ప్రభుత్వానికి భారం అవుతుందా?. ఓట్ల కోసం జనవరి నుంచి రావాల్సిన పెన్షన్లు ఆపారు. ఏప్రిల్, మే నెల పెన్షన్లు కచ్చితంగా ఇవ్వాలి. ఇంటికి రెండు పెన్షన్లు ఎక్కడ?. అవ్వాతాతలకు ఇద్దరికీ ఇస్తామన్నారు ఏమైంది?.ఒకటో తేదీన జీతాల్లేవ్‌..ఆశా వర్కర్లు వైద్య విధాన పరిషత్‌ను ముట్టడించారు. వారికి ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని అడుగుతున్నారు. కానీ, ప్రభుత్వం అందరికీ ఒకటో తారీఖు జీతాలు ఇస్తున్నామని చెప్తున్నారు. ఒకటో తారీఖు ఇస్తే వాళ్ళు ఎందుకు ధర్నా చేస్తారు. వారి జీతాలు వెంటనే చెల్లించాలి. గ్రామ పంచాయతీ వర్కర్లకు కూడా జీతాలు ఇవ్వటం లేదు. నిన్న మొన్న కొన్ని వార్తలు చూసాను, ఐదు నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని చెప్తున్నారు.గ్రామ పంచాయతీలు నడపటం ఇబ్బందిగా ఉన్నది. ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప పని చేత కాదా?. సఫాయి కార్మికులు, ట్రాక్టర్లు నడవక డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వానికి మానవత్వం లోపించింది. 65 లక్షల చెక్కులు ప్రింట్ అయిన సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఆపారు. కేసీఆర్ ఫోటో చెక్కుల మీద ఉందని ఇవ్వటం లేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. నీట్‌పై కీలక వ్యాఖ్యలు..అలాగే, నీట్ పరీక్షపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కేంద్రంలో బీజేపీ తీరుతో విద్యా విధానం కుంటుపడుతుంది. 24 లక్షల మంది వైద్య విద్యార్థులు ఆగమయ్యే పరిస్థితి ఉంది. పేపర్ లీకేజీ, గ్రేస్ మార్కలు కలపటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 67 మందికి మొదటి ర్యాంక్ వచ్చింది. పరీక్ష రాసిన ఆరు మంది విద్యార్థులకు 720 మార్కులు వచ్చాయి. కేంద్ర మంత్రులు, ప్రధాన మంత్రి దీనిపై అస్సలు మాట్లాడటం లేదు. 1563 మంది విద్యార్థులకు ఏ విధంగా గ్రేస్ మార్కులు కలిపారు. వారి పేర్లు, నంబర్లు ఎందుకు తెలపడం లేదు. పేపర్ లీకేజీ జరిగింది అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి. ఎన్నికల ఫలితాల కంటే ముందే ఈ ఫలితాలు రావటం అంటే ఏంటో అర్థం చేసుకోవచ్చు. పేపర్ లీకేజీపైన ఈడీ, సీబీఐ విచారణ ఎందుకు జరపటం లేదు’ అని ప్రశ్నించారు.

Ram Charan: I Had Parties When My Films Failed
సినిమా ఫ్లాప్‌ అయితే పార్టీ చేసుకుంటా: రామ్‌ చరణ్‌

మెగాస్టార్‌ చిరంజీవి పేరు నిలబెట్టాల్సిన బాధ్యత రామ్‌చరణ్‌దే! కెరీర్‌ ప్రారంభంలో తడబడ్డప్పటికీ రానూరానూ నటనలో ఆరితేరాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీతో గ్లోబల్‌ స్టార్‌ అయ్యాడు. తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చరణ్‌కు.. తండ్రి వారసత్వాన్ని కొనసాగించే క్రమంలో ఏదైనా ఒత్తిడికి లోనయ్యారా? అన్న ప్రశ్న ఎదురైంది. ఒత్తిడిగా ఫీలవనుఇందుకు చరణ్‌ స్పందిస్తూ.. ఒత్తిడిని ఎలా తీసుకోవాలో నాకు తెలియదు. నా కెరీర్‌ విషయానికే వస్తే సినిమా ఫలితాల గురించి మరీ అంత ఒత్తిడిగా ఫీలవను. చెప్పాలంటే ఏదైనా సినిమా బాగా ఆడలేదంటే రిలాక్స్‌ అయ్యేందుకు పార్టీ చేసుకుంటాను. అలాగే ఆర్‌ఆర్‌ఆర్‌ సక్సెస్‌ అయినప్పుడు వారం రోజుల దాకా ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టలేదు. నా కుటుంబంతో కలిసి ఇంట్లోనే ఎంజాయ్‌ చేశాను. ప్రస్తుతం ఏం చేస్తున్నా..సక్సెస్‌, ఫెయిల్యూర్‌ల గురించి అంతగా ఆలోచించను. ఇప్పుడు ఏం చేస్తున్నాననేదే నమ్ముతాను. రేపటి గురించి ఆందోళన చెందను' అని చెప్పుకొచ్చాడు. కాగా రామ్‌ చరణ్‌ ప్రస్తుతం గేమ్‌ చేంజర్‌ సినిమా చేస్తున్నాడు. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా యాక్ట్‌ చేస్తోంది. అలాగే బుచ్చిబాబు సన దర్శకత్వంలో విలేజ్‌ స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో ఓ చిత్రం చేస్తున్నాడు. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌. ఇందులో చరణ్‌ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు టాక్‌ నడుస్తోంది. దీని తర్వాత సుకుమార్‌ డైరెక్షన్‌లో మరో మూవీ చేయనున్నాడు.చదవండి: బాహుబలి పోస్టర్‌ను రీక్రియేట్‌ చేసిన స్టార్‌..హీరో దర్శన్ అరెస్ట్.. సంబంధం లేదని తేల్చేసిన మరో కన్నడ హీరో

Eid Ul Adha 2024: The History Of An Ancient Dish Biryani
ఈద్ ఉల్ అధా 2024: బిర్యానీ ఎక్కడ పుట్టింది? దీని కథేంటీ..?

బక్రీ ఈద్‌గా పిలిచే ఈద్‌ ఉల్‌ అధా ఈ ఏడాది ఇవాళే(జూన్‌ 17) బంధుమిత్రులతో చాలా ఆనందంగా జరుపుకుంటారు. ఇది త్యాగానికి గుర్తుగా జరుపుకునే విందు. అబ్రహం ప్రవక్త కొడుకు ఇస్మాయిల్‌ని బలి ఇవ్వమని కోరడం..దేవుడు జోక్యం చేసుకుని బలిగా పొట్టేలుని ఇవ్వడం గురించి ఖురాన్‌లో ఒక కథనం ఉంటుంది. అందుకు గుర్తుగా ఈ రోజున పొట్టేలు(మేక) బలి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ..ఒక వ్యక్తి స్థానంలో మరోక జీవిని బలి ఇవ్వడం అనేది.. త్యాగం లేదా ఖుర్బానీ చరిత్రను గౌరవించేందుకు గుర్తుగా ఈ రోజుని ముస్లింలంతా జరుపుకుంటారు. ఈ రోజు మాంసంతో కలిపి వండే బిర్యానీని తయారు చేసి కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో పంచుకుని తింటారు. ఈ పండుగ పురుస్కరించుకుని అసలు ఈ బిర్యానీ ఎక్కడ పుట్టింది..? ఎలా మన భారతదేశానికి పరిచయం అయ్యింది వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!భారతదేశంలో అత్యంత మంది ఎక్కువగా ఆర్డర్‌ చేసే వంటకంగా ప్రసిద్ధ స్థానంలో ఉంది బిర్యానీ. కుల మత భేదాలు లేకుండా ప్రజలంతా ఇష్టంగా తినే వంటకం కూడా బిర్యానీనే. ఇంతలా ప్రజాధరణ కలిగిన ఈ వంటకం చరిత్ర గురించి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం!. బిర్యానీ అన్న పదం 'బిరింజ్ బిరియాన్' (ఫ్రైడ్ రైస్) అనే పర్షియన్ పదం నుంచి పుట్టింది. అందుకే బిర్యానీ ఇరాన్‌లో పుట్టలేదన్న వాదనా వినిపిస్తుంటుంది. కానీ ఇరాన్‌లో ధమ్ బిర్యానీది ఘనమైన చరిత్ర. ఓ కుండలో మాంసాన్ని వేసి సన్నని మంటపైన చాలా సేపు దాన్ని ఉడికించి, ఆ మాంసంలోని సహజసిద్ధ రసాలు నేరుగా అన్నంలోకి ఊరేలా చేసి, ఆ పైన సుగంధ ద్రవ్యాలు జోడించి బిర్యానీ తయారుచేస్తారని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ బిర్యానీ మొఘల్ చక్రవర్తుల ద్వారానే భారత్‌లోకి వచ్చిందన్న ప్రచారం ఉన్నా దానికి సరైన ఆధారాలు లేవు. అంతేగాదు దక్షిణ భారతంలోని దక్కన్ ప్రాంతానికి చెందిన నవాబులూ, యాత్రికుల ద్వారానే ఇరాన్ నుంచి అది దేశంలోకి ప్రవేశించిందన్నది ఎక్కుమంది చెబుతున్న వాదన. ఏదీఏమైనా..నవాబుల కుటుంబాలకే పరిమితమైన బిర్యానీ, నెమ్మదిగా తన రూపం మార్చుకుంది. భిన్నమైన ప్రాంతాల్లోని ప్రజల ఇష్టాలకు అనుగుణంగా విభిన్న సుగంధ ద్రవ్యాలను తనలో కలుపుకుంటూ, ఇప్పుడు ప్రతి ఒక్కరికీ కమ్మని రుచితో చేరువైంది. ఇక చరిత్ర కారుల అభిప్రాయం ప్రకారం..ఈ బిర్యానీ వంటకం మొఘల్ శకం, చక్రవర్తి షాజహాన్ భార్య బేగం ముంతాజ్ మహల్ కాలం నాటిదని ప్రసిద్ధ కథనం. ఆమె ఒకసారి పోషకాహార లోపంతో కనిపించిన సైనిక అధికారులను చూసి, వారి కోసం పోషకమైన, చక్కటి సమతుల్య భోజనాన్ని తయారు చేయమని తన రాజ ఖన్సామాలను (వంటచేసేవాళ్లుకు) ఆదేశించింది. దాని ఫలితంగా సుగంధ ద్రవ్యాలతో కూడిన ఈ బిర్యానీ వంటకం రూపొందిందని చెబుతుంటారు. మరో కథనం ప్రకారం..1398లో టర్క్-మంగోల్ విజేత తైమూర్ భారత సరిహద్దులను చేరుకున్నప్పుడు అతని సైన్యం కోసం ఈ బిర్యానీని వినియోగించారిని చెబుతారు. సైనికులు కోసం బియ్యం, సుగంధద్రవ్యాలు, మాంసంతో నిండిన కుండను వేడి గొయ్యిలో పాతి పెట్టేవారట. కొంత సమయం తర్వాత తీసి చూడగా బిర్యానీ తయారయ్యి ఉండేదట. ఇది యోధులకు మంచి పోషకాహార భోజనంగా ఉండేదట. ఎక్కువ సేపు ఆకలిని తట్టుకుని ఉండేవారట. ఇక పర్షియన్‌ పదంలో బిరియన్‌ అనే పదానికి అర్థం కాల్చడం. బిరింజ్‌ అంటే అన్నం. పూర్వకాలంలో చాలమంది గొప్ప పండితులు పర్షియా దేశం నుంచి భారతదేశానికి రావడం వల్లే ఈ ప్రత్యేకమైన వంటకం మనకు పరిచయమయ్యిందని చెబుతారు. అయితే మన దేశంలో మాత్రం ఈ బిర్యానీ మాంసం, బియ్యం సుగంధ ద్రవ్యాలతో కూడిన బిర్యానీని మాన్సోదన్‌ అని పిలుస్తారు. ప్రస్తుతం భారతదేశం అంతటా అనేక రూపాల్లో బిర్యానీ లభిస్తుంది. మన హైదరాబాద్‌ బిర్యానీ ఉత్తర, దక్షిణ అంశాలను టర్కిష్‌ ప్రభావాన్ని మిళితం చేస్తుంది. ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఢిల్లీ, లక్నోలలో బాస్మతీ వంటి పొడవైన బియ్యంతో తయారు చేయగా, తమిళనాడు, కర్ణాటక, కేరళ సీరగ సాంబ లేదా కైమా బియ్యం వంటి పొట్టి ధాన్యాలతో తయారు చేస్తారు. ప్రతి బిర్యానీ సుగంధ్ర ద్రవ్యాలు, మాంసంతో ఆయా ప్రాంతాలకు అనుగుణమైన శైలిలో రూపొందుతుంది. ఈ బిర్యానీ వంటకం ఎలా ఏర్పడిందన్నది తెలియకపోయిన మన రోజూవారీ ఆహారంలో అందర్భాగం అయ్యింది. ముఖ్యంగా ఇలాంటి ఈద్‌ సమయంలో ప్రతి ముస్లిం ఇంట ఘుమఘమలాడే మటన్‌ బిర్యానీ ఉండాల్సిందే. (చదవండి: Eid Al-Adha 2024: మౌలిక విధులు..)

T20 WC: Saurabh Netravalkar Wife Devi Snigdha Muppala: Who Is She High Achiever
సౌరభ్‌ నేత్రావల్కర్‌ భార్య: తెలుగు మూలాలున్న అమ్మాయి.. బ్యాగ్రౌండ్‌?

టీ20 ప్రపంచకప్‌-2024లో ఆతిథ్య జట్టు అమెరికా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆటగాళ్లలో సౌరభ్‌ నేత్రావల్కర్‌ ఒకడు. ముంబైలో పుట్టిపెరిగిన ఈ పేస్‌ బౌలర్‌.. ఉన్నత విద్య ‍కోసం అమెరికాకు వెళ్లి అక్కడే సెటిలయ్యాడు.ప్రముఖ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సౌరభ్‌.. గత కొన్నేళ్లుగా అమెరికా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతున్నాడు. జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగిన ఈ ముంబైకర్‌.. ఈ ఐసీసీ టోర్నీలో దుమ్ములేపుతున్నాడు.లీగ్‌ దశలో కెనడా, పాకిస్తాన్‌పై విజయాల్లో తన వంతు పాత్ర పోషించిన సౌరభ్‌.. టీమిండియాతో మ్యాచ్‌లో తనదైన ముద్ర వేశాడు. ఈ మ్యాచ్‌లో అమెరికా ఓడినా.. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ వంటి వరల్డ్‌క్లాస్‌ బ్యాటర్ల వికెట్లు తీసి ప్రత్యేకతను చాటుకున్నాడు ఈ లెఫ్టార్మ్‌ ఫాస్ట్‌ మీడియం బౌలర్‌‌.ఇంతకీ ఎవరీమె?ఈ నేపథ్యంలో సౌరభ్ నేత్రావల్కర్‌‌ కెరీర్‌తో పాటు అతడి వ్యక్తిగత జీవితం గురించి కూడా నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. సౌరభ్‌ నేత్రావల్కర్‌ భార్య తెలుగు మూలాలున్న అమ్మాయి కావడం విశేషం.ఒకే హోదాలో దంపతులుసౌరభ్‌ నేత్రావల్కర్‌ భార్య పేరు దేవి స్నిగ్ధ ముప్పాల. సౌరభ్‌ మాదిరే ఆమె కూడా కార్నెల్‌ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశారు.భర్తతో కలిసి ఒరాకిల్‌ సంస్థలో ప్రిన్సిపల్‌ అప్లికేషన్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. కెరీర్‌ పరంగా ఒకే హోదాలో పనిచేస్తున్న సౌరభ్‌- స్నిగ్ధలు తమకు ఇష్టమైన భిన్న రంగాల్లో రాణిస్తున్నారు.కథక్‌ డాన్సర్‌32 ఏళ్ల సౌరభ్‌కు క్రికెట్‌ ఇష్టమైతే.. స్నిగ్ధకు కథక్‌ నృత్యంపై మక్కువ. ప్రొఫెషనల్‌ కథక్‌ డాన్సర్‌ అయిన ఆమె.. దేవీ బాలీఎక్స్‌ డాన్స్‌ ఫిట్‌నెస్‌ ప్రోగ్రాం ద్వారా మరింత పాపులర్‌ అయ్యారు. అమెరికా వ్యాప్తంగా ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు స్నిగ్ధ.స్నిగ్ధ ఆంధ్రప్రదేశ్‌ మూలాలున్న అమ్మాయి. మహారాష్ట్రకు చెందిన సౌరభ్‌తో 2020లో ఆమె వివాహం జరిగింది. ఇరు కుటుంబాల సమక్షంలో దక్షిణ భారత, మహరాష్ట్ర సంప్రదాయ పద్ధతిలో వీరు పెళ్లి చేసుకున్నారు.అన్యోన్య దాంపత్యంప్రొఫెషనల్‌గా ఎంత బిజీగా ఉన్నా.. సౌరభ్‌- స్నిగ్ధ ఒకరి కోసం సమయం కేటాయించుకుంటారు. సౌరభ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు వీక్షించేందుకు స్నిగ్ధ స్వయంగా స్టేడియానికి వచ్చి.. భర్తను చీర్‌ చేస్తారు.అదే విధంగా.. సౌరభ్‌ సైతం భార్య అభిరుచులకు అనుగుణంగా ఆమె నిర్వహిస్తున్న డాన్స్‌- ఫిట్‌నెస్‌ బ్లెండ్‌ ప్రోగ్రామ్స్‌కి మద్దతుగా నిలుస్తున్నాడు. అలా ఒకరికి ఒకరు తోడుగా ముందుకు సాగుతున్న స్నిగ్ధ- సౌరభ్‌ కపుల్‌ గోల్స్‌ సెట్‌ చేస్తున్నారు.చదవండి: T20 WC: కోహ్లి, రోహిత్‌ వికెట్లు తీసిన భారత టెకీ.. దిమ్మతిరిగే బ్యాక్‌గ్రౌండ్‌!

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement