
నియామకం
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన పలువురిని పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా నియమిస్తూ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. బద్వేల్‌కు చెందిన బీసీ సూరారెడ్డి, జమ్మలమడుగుకు చెందిన ఎంబీ శ్రీనివాసులరెడ్డి, కమలాపురానికి చెందిన షేక్ ఇస్మాయిల్ గఫారి, కిశోర్ బూసిపాటిలను రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా నియమించారు.
బ్రహ్మంగారి సన్నిధిలో ఆమని
బ్రహ్మంగారిమఠం: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీపోతులూరు వీరబ్రహ్మేంద్ర సన్నిధిలో శనివారం సాయంత్రం సినీ యాక్టర్ ఆమని స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్వపు మఠాధిపతి చిన్నకుమారుడు దత్తయ్యస్వామి దగ్గర ఉండి ప్రత్యేక పూజలు చేయించారు. ఈసందర్భంగా ఆమని మాట్లాడుతూ భవిష్య త్ కాలజ్ఞాన ప్రబోధకర్త సజీవ సమాధిని దర్శించుకోవాలన్న కోరిక నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఈశ్వరీదేవిమఠంలో అమ్మవారికి పూజలు నిర్వహించారు. స్థాని క మఠాధిపతి వీరకుమార స్వామితో మాట్లాడి అమ్మవారి గురించి తెలుసుకున్నారు.
తిరుపతి–హిస్సార్ మధ్య ప్రత్యేక రైలు
● ప్రఖ్యాత సూఫీ క్షేత్రం అజ్మీర్ మీదుగా..
కడప కోటిరెడ్డిసర్కిల్: కడప మీదుగా తిరుపతి–హిస్సార్ మధ్య ఈనెల 9 నుంచి సెప్టెంబరు 24వ తేది వరకు ప్రత్యేక రైలును నడపనున్నా రని కడప రైల్వే కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. 07717/07718 నెంబరుగల రైలు ప్రతి బుధవారం తిరుపతిలో రాత్రి 11.45 గంటలకు బయలుదేరి రేణిగుంట, రాజంపేట, కడప (రాత్రి 2.30), ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, డోన్, కర్నూలు, మహబూబ్‌నగర్, కాచిగూడ (మధ్యాహ్నం 3.50), నిజామాబాద్, నాందేడ్, పూర్ణ, సూర త్, వడోదర, చిత్రదుర్గ్, అజ్మీర్ (శనివారం ఉదయం 5.00), సికార్ జంక్షన్ మీదుగా హిస్సార్‌కు శనివారం మధ్యాహ్నం 2.05 గంటలకు చేరుతుందన్నారు. ఇదే రైలు ఈనెల 13 నుంచి సెప్టెంబరు 28 వరకు ప్రతి ఆదివారం హిస్సార్‌లో రాత్రి 11.15 గంటలకు బయలుదేరి ఇదే మార్గంలో బుధవారం ఉదయం 11.30 గంటలకు తిరుపతి చేరుతుందన్నారు. 96 గంటల వ్యవధిలో.. 4000 కి.మీ దూరం ప్రయా ణిస్తుందని.. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.