
ఉత్సాహంగా ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్‌లు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్‌లు రెండవ రోజు కొనసాగాయి. కేఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో కడప–నెల్లూరు జట్ల మధ్య మ్యాచ్ కొనసాగుతోంది. మంగళవారం రెండవ రోజు తొలి ఇన్నింగ్స్‌లో కడప జట్టు 129 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మ్యాచ్ ప్రారంభించగా 67.3 ఓవర్లలో 303 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టులోని ధీరజ్‌కుమార్ రెడ్డి 70 పరుగులు చేశాడు. నెల్లూరు జట్టులోని భార్గవ్ మహేష్ 4 వికెట్లు, సయ్యద్ షాహుల్ హుస్సేన్ 3 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 38 ఓవర్లకు 1 వికెట్ కోల్పోయి 144 పరుగులు చేసింది. ఆ జట్టులోని రోహిత్ 62 పరుగులు, కారుణ్య ప్రసాద్ 46 పరుగులు చేశారు. దీంతో రెండవ రోజు ముగిసింది.
వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ స్టేడియంలో..
అదే విధంగా వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 179 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో రెండవ రోజు బ్యాటింగ్ చేసిన అనంతపురం జట్టు 58.2 ఓవర్లలో 260 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టులోని రిహాన్ 159 బంతుల్లో 29 ఫోర్లు, 2 సిక్సర్లతో 163 పరుగులు చేశాడు. తమీమ్ 38 పరుగులు చేశాడు. చిత్తూరు జట్టులోని సాయి చరణ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 6 వికెట్లు తీశాడు. మంజునాఽథ్ 2 వికెట్లు, తేజేష్ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 34.5 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతపురం జట్టులోని వరుణ్ సాయి నాయుడు అద్భుతంగా బౌలింగ్ చేసి 7 వికెట్లు తీశాడు. టీవీ సాయి ప్రతాప్ నాయుడు 3 వికెట్లు తీశాడు. రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 4.2 ఓవర్లకు 29 పరుగులు చేసింది. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది.
7 వికెట్లు తీసిన అనంతపురం బౌలర్ వరుణ్ సాయి నాయుడు
6 వికెట్లు తీసిన చిత్తూరు బౌలర్
సాయి చరణ్

ఉత్సాహంగా ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్‌లు

ఉత్సాహంగా ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్‌లు

ఉత్సాహంగా ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్‌లు

ఉత్సాహంగా ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్‌లు