772 ఫిర్యాదులకు పరిష్కారం | Sakshi
Sakshi News home page

772 ఫిర్యాదులకు పరిష్కారం

Published Tue, May 7 2024 9:15 AM

-

కడప సెవెన్‌రోడ్స్‌ : జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై మొత్తం 775 ఫిర్యాదులు అందగా 772 ఫిర్యాదులకు పరిష్కారం అందించామని జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజు సోమ వారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై వేర్వేరు వేదికల ద్వారా అందిన ఫిర్యాదులపై జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టరేట్‌ లోని జిల్లా ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ సెంటర్‌ ఫిర్యాదుల పరిష్కార నివేదికను విడుదల చేశారు. మొత్తం 775 ఫిర్యాదులు అందగా 772 ఫిర్యాదులను పరిష్కరించగా... 3 ప్రోగ్రెస్‌లో ఉన్నాయని వివరించారు.

● సి–విజిల్‌ ద్వారా మొత్తం 480 కేసులు నమోదు కాగా అందులో 299 నిజనిర్ధారణ కాగా, 181 నిరాధారమైనవిగా గుర్తించడమైంది.

● ఎఫ్‌ఎస్‌టి., ఎస్‌ఎస్‌టి., పోలీసు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీమ్స్‌ ద్వారా చేపట్టిన సీజర్‌ మేనేజ్మెంట్‌ ప్రక్రియ ద్వారా ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా రూ.3,98,44,265ల మేర నగదు, రూ.7,72,82,080 ల విలువైన లిక్కర్‌, ఇతర వస్తువులను సీజ్‌ చేయడం జరిగింది. అలాగే 1,268 ఎఫ్‌ఐఆర్‌ కేసులు నమోదు చేయడం జరిగిందని కలెక్టర్‌ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement