
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ విజయరామరాజు
కడప సిటీ : పారిశ్రామికరంగ అభివృద్ధితోనే జిల్లా ఆర్థిక పురోభివృద్ధి సాధ్యమవుతుందని, అందుకోసం పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ)సభ్యులను జిల్లా కలెక్టర్ విజయరామరాజు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి కడప నగర పాలక సంస్థ కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్‌చంద్ హాజరయ్యారు.
● కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 81 యూనిట్లకుగాను రూ.9.47 కోట్ల రాయితీ విడుదలకు కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. ఈ మేరకు పరిశ్రమలశాఖ జనరల్ మేనేజర్ జయలక్ష్మి వివరాలను సమావేశంలో కలెక్టర్‌కు వివరించగా, ఆయా అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.
● ఈ సమావేశంలో ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ శ్రీనివాసమూర్తి, డీపీఓ ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ప్యాక్టరీస్ కృష్ణమూర్తి, ఎల్‌డీఎం దుర్గాప్రసాద్, పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు ఈఈ జావిద్‌బాష, వాణిజ్య పన్నులశాఖ, ఏపీఎస్ పీడీసీఎల్, కార్మికశాఖ అధికారులు పాల్గొన్నారు.
జిల్లాను మాదక ద్రవ్య రహితంగా మార్చాలి
జిల్లాలో మాదక ద్రవ్యాల విక్రయాలు, అక్రమ రవాణాను సమూలంగా నిషేధించి జిల్లాను మాదక ద్రవ్య (మత్తు పదార్థాల) రహిత జిల్లాగా మార్చా లని కలెక్టర్ విజయరామరాజు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని స్పందన హాలులో జిల్లాలో మత్తు పదార్థాల నివారణ, మాద క ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధంపై కలెక్టర్ అధ్యక్షతన జాయింట్ యాక్షన్ కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్, నగర పాలక సంస్థ కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్‌చంద్, డీఆర్వో గంగాధర్‌గౌడ్, సెంట్రల్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ మాధురిలతో కలిసి కలెక్టర్ సంబంధిత అధికారులతో పలు అంశాలపై సమీక్షించారు.
● ఆర్డీఓలు ధర్మచంద్రారెడ్డి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, వెంకట రమణ, సాంఘిక సంక్షేమశాఖ జేడీ జయప్రకాశ్, వ్యవసాయశాఖ జేడీ నాగేశ్వరరావు, పోలీసు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ విజయరామరాజు