ముగిసిన అండర్–19 ఖోఖో ఎంపిక పోటీలు
కనగల్: కనగల్ ఎస్‌ఏవీఎం తెలంగాణ మోడల్ స్కూల్‌లో సోమవారం నిర్వహించిన ఉమ్మడి నల్ల గొండ జిల్లా అండర్–19 బాలబాలికల ఖోఖో ఎంపిక పోటీలు ముగిశాయి. బాలబాలికలు 200 మంది ఎంపిక పోటీలకు హాజరు కాగా.. బాలికల నుంచి 12 మంది, బాలుర నుంచి 12 మందిని ఎంపిక చేసినట్టు ఎస్‌జీఎఫ్ జిల్లా సెక్రటరీ కుంభం నర్సిరెడ్డి తెలిపారు. ఈ నెల 5, 6, 7 తేదీల్లో సికింద్రాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో జిల్లా తరఫున వీరు పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులకు రిటైర్డు ఎస్‌ఐ పందుల శంకరయ్య క్రీడా దుస్తులను బహూకరించారు. కార్యక్రమంలో ఎంఈఓ పద్మ, పాఠశాల ప్రిన్సిపాల్ థామాసయ్య, ఎస్‌ఐ కే.రాజీవ్‌రెడ్డి, తరాల జగదీష్, పీడీ విజయ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అక్రమంగా తరలిస్తున్న
మద్యం పట్టివేత
చివ్వెంల(సూర్యాపేట) : కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన చివ్వెంల మండల పరిధిలోని దురాజ్‌పల్లి గ్రామ స్టేజీ వద్ద సోమవారం జరిగింది. ఎస్‌ఐ వి.మహేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. దురాజ్‌పల్లి గ్రామ స్టేజీ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. సూర్యాపేట నుంచి కారులో అక్రమంగా తరలిస్తున్న 11 కాటన్ల మద్యాన్ని పోలీసులు స్వాఽధీనం చేసుకున్నారు.


