సర్పంచ్ ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలి
ఫ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తిప్పర్తి : సర్పంచ్ ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రభుత్వం చూడాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కోరారు. తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామ సర్పంచ్ అభ్యర్థి మామిడి నాగలక్ష్మి భర్త యాదగిరిని ఇటీవల కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేయడంతో తీన్మార్ మల్లన్న ఆదివారం బాధితుడు యాదగిరిని పరామర్శించారు, అగ్రవర్ణాల వారు బీసీలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బీసీలకు క్షమాపణలు చెప్పాలని అన్నారు. యాదగిరిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేయడం సరికాదన్నారు. అరాచక శక్తులను కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రోత్సహిస్తున్నారన్నారు. నల్లగొండ నియోజకవర్గంలో బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్ల ప్పుడూ బీసీలకు అండగా ఉంటుందన్నారు. జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి ఎల్లమ్మగూడెంలో సర్పంచ్ ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని, బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలాని తీన్మార్ మల్లన్న కోరారు. ఆయన వెంట వట్టె జానయ్య, సైదులు, బీసీ సంఘం నాయకులు తదితరులు ఉన్నారు.


