ఒక కుటుంబం.. ముగ్గురు సర్పంచ్‌లు
మఠంపల్లి: మఠంపల్లి మండలం పాతదొనబండతండాకు చెందిన సామాన్య గిరిజన కుటుంబానికి చెందిన ముగ్గురు సర్పంచ్‌లుగా పని చేశారు. గతంలో పెదవీడు గ్రామ పంచాయతీకి ఆవాసంగా ఉన్న దొనబండతండాకు చెందిన భూక్యా భక్షానాయక్ 1981లో పెదవీడు గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 1995లో పెదవీడు నుంచి దొనబండతండా విడిపోయి ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పడింది. 1995లో పంచాయతీకి మొదటి సారి జరిగిన ఎన్నికల్లో భక్షానాయక్ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. భక్షానాయక్ సతీమణి చాందీబాయి కూడా 2000 నుంచి 2005 వరకు దొనబండతండాకు సర్పంచ్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఆయన పెద్ద కుమారుడు హనుమానాయక్ 2006 నుంచి 2011 వరకు సర్పంచ్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ప్రజాక్షేత్రంలోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం వృద్ధాప్యంలో ఉన్న చాందీబాయి కూడా గ్రామంలోని గిరిజనులకు నేటికీ అన్ని రంగాల్లో సహాయ సహకారాలు అందిస్తున్నారు. భక్షానాయక్ కుటుంబం ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు సేవలందించి ఆదర్శంగా నిలిచింది.
ఒక కుటుంబం.. ముగ్గురు సర్పంచ్‌లు
ఒక కుటుంబం.. ముగ్గురు సర్పంచ్‌లు


