సజావుగా నామినేషన్ల స్వీకరణ
వలిగొండ : నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా కొనసాగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. వలిగొండ, పుల్లిగిల్లలో నామినేషన్ కేంద్రాలను సందర్శించి నామినేషన్ ప్రక్రియను పర్యవేక్షించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్‌ఓ)కి సూచనలు చేశారు. నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అనంతరం నాగారం వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును తనిఖీ చేశారు. మద్యం, డబ్బు అక్రమ రవాణా జరగకుండా నిఘా ఉంచాలని, ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని పేర్కొన్నారు. ఆయన వెంట డీఆర్డీఓ నాగిరెడ్డి, ఎంపీడీఓ జలేందర్ రెడ్డి, తహసీల్దార్ దశరథ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు


