హైవేలపై ఇక నో టెన్షన్
ఆలేరు బైపాస్ వద్ద జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ బోర్డు
ఆలేరు: నేషనల్ హైవేలపై ప్రయాణించే వారికి భద్రత, మెరుగైన సౌకర్యం కల్పించేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రత్యేక దృష్టి సారించింది. జాతీయ రహదారుల పొడవునా క్యూఆర్ (క్విక్ రియాక్షన్)కోడ్‌లతో కూడిన సమాచార సైన్‌బోర్డులను ఏర్పాటు చేస్తోంది. ప్రయాణికులకు ఏదైనా అత్యవసర సమయం ఎదురైనపుడు తక్షణమే సులభంగా సేవలు కల్పించేందుకు క్యూఆర్ కోడ్‌లు దోహదపడుతాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
13 చోట్ల క్యూఆర్ కోడ్‌లు
హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారిపై రాయగిరి 53 నుంచి వరంగల్ బైపాస్ వరకు క్యూఆర్ కోడ్ బోర్డులు ఏర్పాటు చేశారు. కోమల్ల, కోమటిపల్లి టోల్‌ప్లాజాలతో పాటు పెట్రోల్ బంక్‌లు, ముఖ్యమైన కూడళ్ల వద్ద మొత్తం 13 చోట్ల క్యూఆర్ కోడ్ బోర్డులు సేవలందిస్తున్నాయి.
సమాచారం పొందడం ఇలా..
వాహనదారులు క్యూఆర్ కోడ్‌ను తమ సెల్‌ఫోన్ ద్వారా స్కాన్ చేయాలి. స్కాన్ చేయగానే ఫోన్‌లో జాతీయ కిలో మీటర్ల పరిధి, గస్తీ అధికారుల నంబర్లు, రెసిడెంట్ ఇంజనీర్ల ఫోన్ నంబర్లు, పోలీసుస్టేషన్లు, ఆస్పత్రులు,హైవే నిర్వహణ అధికారుల సమాచారం,హెల్ప్‌లైన్ నంబర్లు, టాయిలెట్లు, హోటళ్లు, వాహన సర్వీస్ కేంద్రాలు, సెల్ చార్జింగ్ సెంటర్లు, ట్రక్‌ల పార్కింగ్ స్థలాలు, టోల్‌ప్లాజాలు, ఫంక్చర్ షాప్‌లు.. తదితర వాటికి సంబంధించిన సమాచారం స్క్రీన్‌పై వస్తుందని ఎన్‌హెచ్‌ఐఏ రెసిడెంట్ ఇంజనీర్ మధుసూదన్ తెలిపారు.
ఫ ఎన్‌హెచ్–163పై క్యూఆర్
కోడ్‌లతో సైన్ బోర్డులు ఏర్పాటు
ఫ అత్యవసర సమయంలో
తక్షణమే సులభంగా సేవలు
హైవేలపై ఇక నో టెన్షన్


