సిటీ సబర్బన్ బస్సులు నడపండి
భూదాన్‌పోచంపల్లి: పర్యాటక కేంద్రమైన పోచంపల్లికి దిల్‌సుఖ్‌నగర్ నుంచి సిటీ సబర్బన్ బస్సులు నడిపించాలని కోరుతూ శనివారం భూదాన్‌పోచంపల్లికి చెందిన పలువురు నాయకులు హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. నిత్యం దేశ, విదేశీయులు వస్తుంటారని, పోచంపల్లి నుంచి హైదరాబాద్‌కు వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు రాకపోకలు సాగిస్తుంటారని పేర్కొన్నారు. వారంతా సరిపోను బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారని, అదనపు సర్వీసులను నడపాలని విజ్ఞప్తి చేశారు. అందుకు ఆర్టీసీ ఎండీ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. ఎండీకి వినతిపత్రం అందజేసిన వారిలో తడక రమేశ్, బిజిలి కుమార్, సీత కృష్ణ, భారత గిరివాసు, తడక విష్ణుదాస్, పెండెం పాండురంగం, కడవేరు వెంకటేశం, గుండు ఉప్పలయ్య, సీత జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.


