40 ఏళ్లు సర్పంచ్‌గా..
కనగల్: కనగల్ మండలంలోని చర్లగౌరారం గ్రామానికి చెందిన చిలకరాజు చిన మారయ్య చర్లగౌరార, పర్వతగిరి, దర్వేశి పురం ఉమ్మడి గ్రామపంచాయతీకి 1957లో సర్పంచ్‌గా నామినేట్ అయ్యారు. అప్పటి నుంచి 1977 వరకు 20 ఏళ్లపాటు సర్పంచ్‌గా పనిచేశారు. ఆ తర్వాత పర్వతగిరి, దర్వేశిపురం, చర్లగౌరారం గ్రామాలు మూడు ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పడ్డాయి. ఈ క్రమంలో 1977లో చర్లగౌరారం గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో చిన మారయ్య విజయం సాధించి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి కంటిన్యూగా 20 ఏళ్ల పాటు సర్పంచ్‌గా కొనసాగారు. ఇలా ఏకధాటిగా 40 ఏళ్లపాటు సర్పంచ్‌గా పనిచేసిన వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కారు. 1997లో ఆయన మృతిచెందారు. ఎలాంటి మద్యం, డబ్బును ఆశించకుండా స్వచ్ఛందంగా మారయ్యకు ఓటేసినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు.
నామినేషన్ తిప్పలు
యాదగిరిగుట్ట రూరల్ : సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ వేయడానికి అభ్యర్థులు నానా పాట్లు పడుతున్నారు. యాదగిరిగుట్ట మండలం లప్పానాయక్ తండా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు శనివారం దాతర్‌పల్లి క్లస్టర్ కేంద్రానికి వచ్చాడు. అయితే అక్కడ జిరాక్స్ మిషన్ అందుబాటులో లేదని తెలుసుకుని.. ఆ అభ్యర్థి స్వయంగా జిరాక్స్ మిషన్‌ను తన వెంట తెచ్చుకున్నాడు. నామినేషన్‌కు వేయడానికి కావాల్సిన పత్రాలను జిరాక్స్ మిషన్ సహాయంతో ప్రింట్ తీసుకుని నామినేషన్ సమర్పించాడు. అతడితో పాటు తన వెంట వచ్చిన వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసే వారు సైతం ఈ జిరాక్స్ మిషన్ సహాయంతో తగిన పత్రాలను జిరాక్స్ తీసుకుని తమ నామినేషన్ల ప్రక్రియ పూర్తిచేశారు.
40 ఏళ్లు సర్పంచ్‌గా..


