దొడ్డు రకం వరిపైనే మక్కువ
దొడ్డు రకాలు సన్నాల కంటే అధిక దిగుబడి వస్తాయి. విత్తనాల ఆధారంగా దొడ్డు రకాలు యాసంగి సీజన్‌లోనూ 20 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా, నీరు అందకపోయినా తట్టుకునే శక్తి ఉంటుంది. ధాన్యం అమ్మకం సులభం. చేనుపైనే హార్వెస్టింగ్ చేసి నేరుగా మిల్లులకు తరలించి అమ్మకోవచ్చు. తేమ శాతం ఉన్నా విక్రయించే సమయంలో పెద్దగా ఇబ్బందులుండువు.
ఫ పంటకాలం, చీడపీడలు తక్కువ, దిగుబడి ఎక్కువ రావడమే కారణం
ఫ మార్కెటింగ్ సులభం
ఫ సన్నాలకు బోనస్ ఇస్తున్నా
ఆసక్తి చూపని రైతులు
సంస్థాన్ నారాయణపురం: జిల్లాలో యాసంగి సీజన్ పరిస్థితి మారిపోతోంది. మునుపటితో పోలిస్తే ఎక్కువగా దొడ్డు రకాలపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. సన్నాలకు పెట్టుబడి పెరగడం, దిగుబడి తక్కువ, చివరి సమయంలో నీరు సరిగా అందకపోతే నూక అధికంగా వస్తుండటంతో తదితర కారణాల వల్ల అధికంగా దొడ్డు రకాలను ఎంచుకుంటున్నారు. ప్రస్తుత యాసంగిలో మొత్తం 3,12,500 ఎకరాల్లో వరి సాగు కానున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇందులో సన్నాలు 62,500 ఎకరాలు, దొడ్డు రకాలు2,50,00 ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉంది. వానాకాలం జిల్లా వ్యాప్తంగా 2,95,000 ఎకరాల్లో వరి సాగు కాగా.. అందులో 1,03,250 ఎకరాల్లో సన్నాలు, 1,91,750 ఎకరాల్లో దొడ్డు రకం వరి సాగు చేశారు. వానాకాలంతో పోలిస్తే యాసంగిలో సన్నాల వరి సాగు 40,750 ఎకరాలు తగ్గే అవకాశం ఉంది. దొడ్డు రకాలు 58,250 ఎకరాలు పెరగనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
సన్నాలకు సమస్యలెన్నో..
సన్న వడ్లకు మద్దతు ధర అధిక ఉండటంతో పాటు ప్రభుత్వం బోనస్ ఇస్తున్నా రైతులు అసక్తి చూపడం లేదు. ప్రధానంగా పంట చేతికి వచ్చే సమయానికి వేసవి కాలం వస్తుంది. అప్పుడు ధాన్యం మరపట్టిస్తే(మిల్లింగ్) ఆధిక నూక శాతం ఉంటుంది. నీరు సరిగా అందకపోతే బియ్యపు గింజ నూకగా మారే అవకాశం ఉంది. సన్నాల సాగు కాలం అధికంగా ఉంటుంది. నీటి సరిగా అందకపోతే చేను తట్టుకొదు. పొట్ట దశలో దోమకాటు వస్తే గింజ మీద మచ్చలు ఏర్పడుతున్నాయి. మచ్చలు పడిన ధాన్యానికి మార్కెంటింగ్ కష్టమవుతుంది. అకాల వర్షాలు వస్తే దిగుబడి తగ్గుతుంది.సరైన మార్కెటింగ్ సదుపాయం లేదు. సన్నాలు తేమ శాతం ఉంటే రంగు మారుతుంది. కాబట్టి తేమ, తాలు లేకుండా, శుభ్రంగా ఉంటేనే కొనుగోలు చేస్తారు.
యాసంగి అంచనా.. ఎకరాల్లో
మొత్తం సాగు 3,12,500
దొడ్డు రకాలు 2,50,500
సన్నాలు
62,500
వానాకాలం
సాగైంది
మొత్తం
2,95,000
దొడ్డు రకాలు 1,91,750
సన్నాలు
1,03,250


