శిక్షణకు హాజరుకాని పీఓలు వివరణ ఇవ్వాలి
భువనగిరిటౌన్ : పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బందికి శుక్రవారం మండల పరి షత్ కార్యాలయాల్లో ఇచ్చిన శిక్షణకు హాజరు కాని వారు వివరణ ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. 24 గంటల లోపు రిపోర్ట్ ఇవ్వాలని, లేనిపక్షంలో షోకాజ్ నోటీసు జారీ చేస్తామని, అయినా స్పందించకపోతే సస్పెండ్ చేస్తామన్నారు.
30న ఉమ్మడి జిల్లా స్థాయి ఆర్చరీ ఎంపిక పోటీలు
భువనగిరి : ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి ఆర్చరీ ఎంపిక పోటీలు ఈ నెల 30న నిర్వహిస్తున్నట్లు ఆర్చరీ అసోసియేషన్ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీగిరి విజయకుమార్‌రెడ్డి, తునికి విజయసాగర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్‌లో నిర్వహించే పురుషులు, మహిళల ఎంపీక పోటీలకు ఆసక్తి కలిగిన క్రీడాకారులు తమ వెంట ఆధార్‌కార్డుతో పాటు జనన ధ్రువీకరణ పత్రాలను తీసుకుని ఉదయం 10 గంటలకు వరకు హాజరై వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు కోచ్ సంపత్‌ను 9182842387లో సంప్రదించాలని కోరారు.
అలరించిన ప్లానిటోరియం షో
భువనగిరి : జిల్లా కేంద్రంలోని విజ్ఞాన్ ఐఐటీ స్కూల్‌లో శుక్రవారం నిర్వహించిన ప్లానిటోరియం షో ఆకట్టుకుంది. గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, రాకెట్ లాంచ్ అయ్యే విధానం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. భౌగోళికంగా చోటు చేసుకునే మార్పులను విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోవడానికి ప్లానిటోరియం వంటి ప్రదర్శనలు దోహదపడుతాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పగిడాల జలేందర్‌రెడ్డి, డైరెక్టర్ పురేందర్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నేత్రపర్వంగా
ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట: పంచ నారసింహుడి క్షేత్రంలో శుక్రవారం నిత్యారాధనల్లో భాగంగా ఆండాళ్‌దేవికి ఊంజల్ సేవోత్సవాన్ని అర్చకులు నేత్రపర్వంగా చేపట్టారు. అమ్మవారిని పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పాలతో అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ సమయంలో అమ్మవారికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం అద్దాల మండపంలోకి వేంచేపు చేయించి ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు. అంతకుముందు వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోన స్వయంభూలకు అభిషేకం, తులసీ దళ సహస్రనామార్చన గావించారు. అనంతరం ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, స్వామి, అమ్మవారికి నిత్య తిరుకల్యాణం, బ్రహ్మోత్సం తదితర పూజలు చేపట్టారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.


