దీక్షా దివస్‌ను జయప్రదం చేయాలి
భువనగిరి: బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 29న నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు. భువనగిరిలో దీక్షా దివస్ నిర్వహించే ప్రాంతాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. స్వరాష్ట్ర సాధన కోసం నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిందన్నారు. ఆ దీక్షతో కేంద్రం దిగివచ్చి ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిందన్నారు. కేసీఆర్ చేపట్టిన దీక్షా దివస్ గురించి భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉదయం 10 గంటలకు దీక్షా దివస్ ప్రారంభం అవుతుందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణ, పట్టణ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఏవీ కిరణ్‌కుమార్, రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మున్సిపల్ అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి


