మద్యం, నగదు రవాణాపై నిఘా
ర్యాలీలు, సభలకు అనుమతి
తప్పనిసరి : సీపీ సుధీర్‌బాబు
ప్రత్యేక బలగాలతో బందోబస్తు
ఫ పంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
ఫ ఆలేరు, పంతంగి, బీబీనగర్,
బొమ్మలరామారం వద్ద చెక్‌పోస్టులు
ఫ రాత్రివేళ గ్రామాల్లో పోలీసుల గస్తీ
ఆలేరు: పల్లెపోరు నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరిగేలా దృష్టిసారించింది. జిల్లాలో ఆలేరు నియోజకవర్గంలోని ఆలేరు, రాజా పేట, తుర్కపల్లి, ఆత్మకూరు(ఎం), బొమ్మలరామా రం, యాదగిరిగుట్ట మండలాల పరిధిలో 154 గ్రామ పంచాయతీల్లో డిసెంబర్ 11న తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఆయా గ్రామాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నామినేషన్ల స్వీకరణకు ఏర్పాటు చేసిన ప్రతి క్లస్టర్ వద్ద ఇద్దరు పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
హైవే కనెక్టివిటీ రూట్‌లపై ప్రత్యేక దృష్టి
ఎన్నికల్లో డబ్బు, మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు పట్ష్టి చర్యలు చేపట్టారు. ముఖ్యంగా జాతీయ కనెక్టివిటీ ఉన్న మార్గాలైన ఆలేరు, పంతంగి, బీబీనగర్, బొమ్మలరామారంలో గురువారం చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సంయుక్తంగా చెక్‌పోస్టుల వద్ద వాహనాలను తనిఖీ చేయనున్నారు. గ్రామాలకు రాకపోకలు సాగించే ప్రతి వాహనం వివరాలను సేకరించనున్నారు.
ఆలేరు: ఎన్నికల సందర్భంగా ముందస్తు అనుమతులు లేకుండా సభలు, ఊరేగింపులు, సమావేశాలు నిర్వహించడాన్ని నిషేధిస్తూ రాచకొండ సీపీ సుధీర్‌బాబు గురువారం ఆదేశాలు జారీ చేశారు. మూడు దశల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఆదేశాలు అమల్లో ఉంటాయన్నారు. ఆదేశాలు ఉల్లంఘించే వ్యక్తులు హైదరాబాద్ సిటీ పోలీసు చట్టం 1348ఫస్లి(చట్టంఐగీ) కింద ప్రాసిక్యూషన్‌కు బాధ్యత వహించాల్సి ఉంటుందని సీపీ స్పష్టం చేశారు.
పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యేక పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. క్లస్టర్లతో పాటు గ్రామాల్లో పోలీసు పికెట్‌లు కొనసాగుతున్నాయి. ఎన్నికల కోడ్‌కు వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాల నియంత్రణతో పాటు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా రాత్రి వేళలో పోలీసుల గస్తీ ఏర్పాటు చేశాం. 29వ తేదీన ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగుతాయి. అపరిచిత వ్యక్తులు కనిపిస్తే సమాచారమివ్వాలి.
–అక్షాంశ్‌యాదవ్, డీసీపీ
మద్యం, నగదు రవాణాపై నిఘా
మద్యం, నగదు రవాణాపై నిఘా


