ఊరు దాటితేనే సెల్ సిగ్నల్
ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ సేవలు పొందాల న్నా, ఇతరులకు ఏదైనా స మాచారం ఇవ్వాలన్నా సెల్‌ఫోన్ తప్పనిసరి అయ్యింది. గ్రామంలో సిగ్నల్స్ అందకపోవడం వల్ల ఎత్తయిన ప్రాంతాలకు వెళాల్సి వస్తుంది. అక్కడ కూడా సిగ్నల్స్ సరిగా రాకపోవడం వల్ల ఊరికి దూరంగా పోతున్నాం.
–చిలుక మల్లయ్య, గోపాల్‌పురం
గ్రామంలో ఎవరికై నా ప్ర మాదం జరిగినా, ఆరోగ్యం బాగోలేకున్నా 108 అంబు లెన్స్‌కు ఫోన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. కలెక్టర్ చొరవచూపి సెల్‌టవర్ ఏర్పాటు చేయించాలి. అధికారులు పట్టించుకోవాలి.
–శమైయిన మహేష్, గోపాల్‌పురం
ఫ సేవలందక అత్యవసర సమయంలో
గోపాల్‌పురం గ్రామస్తుల అవస్థలు
ఫ 108కి కాల్ చేయలేని దైన్యం
ఫ కిలో మీటరున్నర దూరం వెళ్తేనే నెట్‌వర్క్
తుర్కపల్లి: అత్యవసర సమయంలో అంబులెన్స్‌కు కబురు పెట్టాలన్నా, ఉపాధిహామీ కూలీలు బయోమెట్రిక్ వేయాలన్నా, ఆసరా పింఛన్ తీసుకోవాలన్నా, రేషన్ సరుకులు పొందాలన్నా ఆ ఊరికి జనాలకు ప్రయాస తప్పదు. ఊరికి కిలో మీటరున్నర దూరం వెళ్తే కానీ సిగ్నల్స్ దొరకవు. ప్రపంచంలో ఏ మూలన, ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోయే నేటి డిజిటల్ యుగంలో తుర్కపల్లి మండలం గోపాల్‌పురం గ్రామస్తులు మాత్రం ఇంకా సెల్ సిగ్నల్స్ కోసం వెతుకుంటున్నారు. ఊరికి సమీపంలో నెట్‌వర్క్ టవర్లు లేకపోవడంతో ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇతరులతో మాట్లాడుకోవడం అటుంచితే.. అత్యవసర వైద్యం కావాల్సిన సమయంలో పడే ఇబ్బందులు వర్ణణాతీతం.
సేవలకు ఆటంకం
● ఉపాధిహామీ కూలీలు ఉదయం పనులకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా బయోమెట్రిక్ వేయాలి. వారి ఫొటోలను యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. పని చేసే ప్రదేశంలో సిగ్నల్స్ అందకపోవతే నెట్‌వర్క్ కోసం వెతుక్కుంటూ వెళ్లడం వారికి నిత్యకృత్యంగా మారింది.
● ఆసరా లబ్ధిదారులకు పింఛన్ ఇవ్వాలంటే పోస్టల్ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. సిగ్నల్స్ అందే ప్రాంతానికి వెళ్లి బయోమెట్రిక్ తీసుకుంటున్నారు.
● రేషన్ లబ్ధిదారులు సరుకులు పొందాలంటే బయోమెట్రిక్ వేయాలి. గ్రామంలోని ఎత్తయిన భవనాల పైకి, లేదా ఊరికి దూరంగా వెళ్లాల్సి వస్తుందని లబ్ధిదారులు పోతున్నారు.
● గర్భిణులు ప్రసవ సమయంలో, ఎవరైనా అనారోగ్యానికి గురైనా, ఇంకేదైనా అత్యవసర సమయంలో 108 అంబులెన్స్‌కు ఫోన్ చేయాలంటే సిగ్నల్ దొరకడం లేదు.
● పాఠశాలల్లో రోజువారీ కార్యకలాపాలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు తదితర వివరాలు యాప్‌లో అప్‌లోడ్ చేయలేకపోతున్నారు.
ప్రజావాణిలో వినతి
గోపాల్‌పురంలో సెల్ టవర్ ఏర్పాటు చేయించాలని గ్రామస్తులు ఇటీవల ప్రజవాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సెల్‌ఫోన్లు పనిచేయక పోవడంతో తాము ఎదుర్కొంటున్న సమస్యలపై గోడు వెల్ల బోసుకున్నారు.
ఊరు దాటితేనే సెల్ సిగ్నల్
ఊరు దాటితేనే సెల్ సిగ్నల్


