కేసీఆర్ ఆమరణ దీక్షతోనే ఉద్యమం మలుపు
భువనగిరి: బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఈనెల 29న నిర్వహించే దీక్షా దివస్‌ను జయప్రదం చేయాలని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం భువనగిరిలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్షతోనే ఉద్యమం మలుపు తిరిగిందన్నారు. నాటి ఉద్యమ ఘట్టాలు, పోరాట పటిమను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని, దీక్షా దివస్‌లో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ఉద్యమకారులు భారీగా హాజరుకావాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునిత, గాదరి కిషోర్, భిక్షమయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేష్, ఎలిమినేటి సందీప్‌రెడ్డి పాల్గొన్నారు.


