ఎంపీటీసీగా ‘దుబ్బాక’ రెఫరెండం | - | Sakshi
Sakshi News home page

ఎంపీటీసీగా ‘దుబ్బాక’ రెఫరెండం

Nov 27 2025 7:37 AM | Updated on Nov 27 2025 7:37 AM

ఎంపీటీసీగా  ‘దుబ్బాక’ రెఫరెండం

ఎంపీటీసీగా ‘దుబ్బాక’ రెఫరెండం

ఎంపీటీసీగా ‘దుబ్బాక’ రెఫరెండం ప్రజలకు అనుగుణంగా పనిచేసేందుకే..

చిట్యాల : మండలం నేరడ గ్రామానికి చెందిన దుబ్బాక నర్సింహారెడ్డి. దుబ్బాక నర్సింహారెడ్డి 1999లో స్వగ్రామం నేరడ ఎంపీటీసీగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి.. 200 ఓట్ల అత్యధికంతో గెలిచారు. గ్రామాభివృద్ధికిగాను శక్తివంచన లేకుండా పనిచేశారు. ఎంపీటీసీగా ఆయన పనితీరుపై మూడేళ్ల పదవీకాలం తర్వాత 2002లో స్వచ్ఛందంగా రెఫరెండం నిర్వహించుకున్నారు. మొత్తం 1600 మంది ఓటింగ్‌లో పాల్గొనగా.. 1510 మంది దుబ్బాక పాలనను మెచ్చుకున్నారు. 90 మంది మాత్రమే వ్యతిరేకించారు. అప్పట్లో ఓ పోటీ పరీక్షలో పార్టీ గుర్తుపై గెలిచి రెఫరెండం నిర్వహించుకున్న ప్రజాప్రతినిధి ఎవరని.. ప్రశ్న వచ్చింది.

ప్రజల అవసరాలకు అనుగుణంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పనిచేయాలి. అందుకుగా నేను ఎంపీటీసీగా పని చేస్తున్న క్రమంలో ప్రజల అలోచనల మేరకు పనిచేస్తున్నానా.. లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు రెఫరెండం నిర్వహించుకున్నాను. 95 శాతం మంది నాకు మద్దతుగా నిలవడం సంతృప్తినిచ్చింది. ప్రజాప్రతినిధులు ప్రజల ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తే సమస్యలన్నీ పరిష్కరమవుతాయి.

– నర్సింహారెడ్డి, నేరడ, చిట్యాల మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement