తెలంగాణలో గ్రామాల అభివృద్ధి బాగుంది
యాదగిరిగుట్ట రూరల్ : తెలంగాణలో గ్రామాభివృద్ధి పనులు చాలా బాగున్నాయని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్(ఎన్‌ఐఆర్‌డీ) విభాగం, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఉపాధి హామీ పథకం ప్రోగ్రాం అధికారులు అన్నారు. ఎన్‌ఐఆర్‌డీ ప్రొఫెసర్ షేక్ ఆరిఫ్ ఆధ్వర్యంలో 26 మంది మంగళవారం యాదగిరిగుట్ట మండలం మహబూబ్‌పేట గ్రామాన్ని సందర్శించారు. అంగన్‌వాడీ కేంద్రం, పల్లె ప్రకృతి వనం, సెగ్రిగేషన్ షెడ్‌లు, క్యాటిల్ షెడ్‌లు, ఆయిల్‌పామ్ తోటలు, నీటి తొట్టిలు, ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఇక్కడ అధికారులు చాలా నిబద్ధతతో పనులు చేస్తున్నారని కొనియాడారు. వారి వెంట ఎంపీడీఓ నవీన్‌కుమార్, ఎంపీఓ చంద్రశేఖర్, ఏపీఓ లింగంపల్లి నర్సయ్య, ఈసీ రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శి రమేష్ తదితరులు ఉన్నారు.
కొనియాడిన ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఉపాధి హామీ పథకం ప్రోగ్రాం అధికారులు
మహబూబ్‌పేట గ్రామంలో
పర్యటించిన బృందం


