మహిళలు అప్పు ఇచ్చే స్థాయికి ఎదగాలి
ఆలేరు: ‘నాకు అప్పు ఇచ్చే స్థాయికి మహిళలు ఆర్థికంగా ఎదగాలి.. తీసుకున్న అప్పును వడ్డీతో సహా చెల్లిస్తాను’ అని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. మంగళవారం ఆలేరులో నిర్వహించిన మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాకు మంజూరైన రూ.18కోట్ల వడ్డీలేని రుణాల్లో ఆలేరు నియోజకవర్గానికే రూ.7.49కోట్ల రుణాలు కేటాయించినట్లు తెలిపారు. భవిష్యత్తుల్లో గ్రామాల్లో చేపట్టబోయే సీసీ రోడ్లు తదితర అభివృద్థి పనులతోపాటు సోలార్ ప్లాంట్‌ల ఏర్పాటులో మహిళా సంఘాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు చెప్పారు. అడిషనల్ కలెక్టర్ భాస్కర్‌రావు, రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇజాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ముదిగొండ శ్రీకాంత్, నాయకులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య


