కొత్తిమీర.. లేదు ధర
● రోడ్డుపక్కన పారబోసిన రైతన్న
ఆలేరురూరల్: ఆలేరు పట్టణం నుంచి మంతపురి వెళ్లే దారిలో జంగాల కాలనీ దగ్గర హైవే వెంట సర్వీస్ రోడ్డులో మినీ డీసీఎం లోడ్ కొత్తిమీర కట్టలను మంగళవారం సాయంత్రం పడవేశారు. స్థానికులు, వాహనదారులు కొత్తిమీర కట్టలను సంచుల్లో నింపుకుని వెళ్లారు. సరైన ధర రాకనే రైతులు ఇలా రోడ్డుపక్కన పడేసి ఉంటారని
స్థానికులు భావిస్తున్నారు.
ఆలేరులో సర్వీస్ రోడ్డు పక్కన
పడేసిన కొత్తిమీర


