పూర్వగిరీశా.. ఎన్నాళ్లకెన్నాళ్లకు
యాదగిరిగుట్ట: పంచనారసింహుడు కొలువైన యాదగిరీశుడి దివ్యక్షేత్రానికి అనుబంధంగా ఉన్న పూర్వగిరి(పాతగుట్ట) శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆల య అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. క్షేత్రానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు దేవస్థానం అధి కారులు ప్రణాళికలు రూపొందించారు. నిర్వహణ లోపంతో వందల ఏళ్ల చరిత్ర కలిగిన పాతగుట్ట ఆలయంలోని పలు కట్టడాలు జీర్ణావస్థకు చేరా యి.ఈ క్రమంలో ఈఓ వెంకట్రావ్ ప్రత్యేక చొరవ తీసుకొని ఆలయ ప్రాశస్యాన్ని కాపాడాలని సంకల్పించారు. పలు దఫాలు దేవస్థానం అధికారులు, ప్రధానార్చకులతో పాతగుట్టను సందర్శించి చే యాల్సిన పనులు, తదితర విషయాలపై చర్చించారు.
చేపట్టనున్న పనులు ఇవీ..
పాతగుట్ట దేవస్థానం యాదగిరిగుట్ట పట్టణం నుంచి మూడు కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఈ క్షేత్రానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. స్వయంభూలు తొలుత ఇక్కడే వెలిసినట్లు పురాణాలు చెబుతున్నాయి. కానీ, ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. క్రమేణా భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. పూర్వవైభవం తీసుకురావడానికి దేవస్థానం అధికారులు దృష్టి సారించారు.
● నూతనంగా అద్దాల మండపం నిర్మాణం, ఆంజనేయస్వామి ఆల యం, పుష్కరిణి పునరుద్ధరణ, ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లే మెట్ల మార్గానికి మరమ్మతులు, షెడ్ల నిర్మాణం, ప్రహరీ నిర్మాణంతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు.
ఆలయ నిధులా.. విరాళాలా?
ఈఓ వెంకట్రావ్ చొరవ తీసుకొని ఆలయ అభివృద్ధికి సన్నాహాలు ప్రారంభించారు. కాగా ఆలయ అభివృద్ధికి సహకరించేందుకు దాతలు కూడా ముందుకు వస్తున్నారు. దాతలు ఇచ్చే విరాళాలతో పాటు దేవస్థానం నిధులు ఖర్చు చేయడం ద్వారా పాతగుట్ట అభివృద్ధి వేగంగా జరగనుందని భక్తులు అంటున్నారు. అయితే నిధులను దాతల ద్వారా సమకూరుస్తారా, ఆలయ నుంచి ఖర్చు చేస్తారా.. స్పష్టత రావాల్సి ఉంది. పనులు పూర్తయితే ఆలయ రూపురేఖలు మారడంతో పాటు భక్తులకు సదుపాయాలు సమకూరనున్నాయి.
అభివృద్ధిలో భాగంగా యాదగిరిగుట్ట పట్టణం నుంచి పాతగుట్ట ఆలయం వరకు 2.1 కిలో మీటర్ల రోడ్డును 50 ఫీట్ల మేర విస్తరిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీలు రానున్నాయి. ఇందుకోసం రూ.5 కోట్లు మంజూరయ్యాయి. నిర్మాణ పనులకు గత నెల 17న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శంకుస్థాపన చేశారు. చాలా ఏళ్లుగా ఈ రోడ్డు అభివృద్ధికి నోచుకోకపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విస్తరణ పనులు పూర్తయితే భక్తులు రాకపోకలు సాగించేందుకు ఎంతో సౌలభ్యంగా ఉంటుంది.
పాతగుట్ట ఆలయ అభివృద్ధికి అడుగులు
ఫ ప్రణాళికలు సిద్ధం, త్వరలోనే అమలు
ఫ మారనున్న దేవస్థానం రూపురేఖలు
ఫ తీరనున్న భక్తుల కష్టాలు
పూర్వగిరీశా.. ఎన్నాళ్లకెన్నాళ్లకు
పూర్వగిరీశా.. ఎన్నాళ్లకెన్నాళ్లకు


