బీసీలకు తగ్గాయ్!
సాక్షి యాదాది : గ్రామ పంచా యతీ ఎన్నికల రిజర్వేషన్లు బీసీలను నిరాశపరిచాయి. 2019 సంవత్సరంతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. రొటేషన్ విధానంతో ఆయా కేటగిరీల్లో సర్పంచ్ స్థానా లకు కోత పడింది. రిజర్వేషన్లకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను సోమవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 427 గ్రామ పంచాయతీలు, 3,407 వార్డులు ఉన్నాయి. బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేశారు. మొత్తంగా మహిళలకు 45 శాతం, జనరల్‌కు 55 శాతం సీట్లు కేటాయించారు.
2011 జనాభా లెక్కల ప్రకారం..
2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు, బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక మేరకు బీసీల రిజర్వేషన్లు కేటాయించారు. ఆదివారం ఉదయం భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీఓలు తమ డివిజన్ల పరిధిలోని సర్పంచ్ స్థానాలకు, ఎంపీడీఓలు మండల పరిషత్ కార్యాలయాల్లో వార్డు స్థానాల రిజర్వేషన్లకు సంబంధించి కసరత్తు పూర్తి చేసి జాబితాలను కలెక్టర్‌కు పంపించారు. కలెక్టర్ హనుమంతరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, డీపీఓ విష్ణువర్ధన్‌రెడ్డి, ఆర్డీఓలు కలిసి రాత్రి పొద్దుపోయే వరకు తుది జాబితాలను రూపొందించారు. అనంతరం రాజకీయ ప్రతినిధుల సమక్షంలో రిజర్వేషన్లు వెల్లడించారు.
2019లో బీసీలకు 105 స్థానాలు
2019లో జరిగిన పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీసీ రిజర్వేషన్లు స్వల్పంగా తగ్గాయి. అప్పట్లో 421 సర్పంచ్ స్థానాలు ఉండగా బీసీలకు 108 రిజర్వ్ అయ్యాయి. ఈసారి గ్రామ పంచాయతీలు 427కు పెరిగాయి. అయినా 105 సీట్లే బీసీలకు కేటాయించబడ్డాయి. రొటేషన్ విధానం ద్వారా మూడు సీట్లను బీసీలు కోల్పోయారు. ఇక 2019లో బీసీ మహిళలకు 54 స్థానాలు దక్కగా, ప్రస్తుతం 47 స్థానాలే రిజర్వ్ అయ్యాయి. జనరల్ కేటగిరీలో మాత్రం 54 నుంచి 58కి పెరిగాయి. ఎస్టీ పంచాయతీల్లో మహిళలకు 15, జనరల్ 21, ఎస్టీ రిజర్వుడ్ సీట్లలో మహిళలకు 5, జనరల్ 8 కేటాయించారు. ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో మహిళలకు 33, జనరల్ 41 సీట్లు దక్కాయి. బీసీ రిజర్వుడ్ స్థానాల్లో మహిళలకు 47, జనరల్ 58, జనరల్ కేటగిరీలో మహిళలకు 95, జనరల్ 195 స్థానాలు రిజర్వ్ అయ్యాయి.
వార్డుల కేటాయింపు ఇలా..
జిల్లాలోని 427 గ్రామ పంచాయతీల్లో 3,704 వార్డులు ఉన్నాయి. వీటిలో ఎస్సీ గ్రామ పంచాయతీల్లో మహిళలకు 130, జనరల్ 130, ఎస్టీ రిజర్వుడ్ సీట్లలో మహిళలకు 43, జనరల్ 62, ఎస్సీ రిజర్వుడ్ స్థానాల్లో మహిళలకు 241, జనరల్ 395 ఖరారయ్యాయి. బీసీ రిజర్వుడ్ స్థానాల్లో మహిళలకు 397, జనరల్ 572, జనరల్ కేటగిరీలో మహిళలకు 789, జనరల్ 945 స్థానాలను రిజర్వ్ చేశారు.
కొన్ని పంచాయతీల్లో మారని రిజర్వేషన్లు
రొటేషన్ విధానం పాటించినప్పటికీ కొన్ని గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్లు మారలేదు. భువనగిరి ని యో జకవర్గం భూదాన్‌పోచంపల్లి మండలం ధర్మారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ 2019లో జనరల్ కేటగిరీలో ఉంది. ఈసారి కూడా జనరల్‌కే కేటాయించారు.
రొటేషన్ విధానం ద్వారా దక్కింది 105 స్థానాలే
ఫ 2019తో పోలిస్తే స్వల్పంగా తగ్గుదల
ఫ గ్రామ పంచాయతీ రిజర్వేషన్ల
గెజిట్ నోటిఫికేషన్ విడుదల
ఫ కొన్ని చోట్ల యథావిధిగా..
గ్రామ పంచాయతీలు 427
వార్డు స్థానాలు 3,704
మహిళలకు..
మొత్తం 195
జనరల్ 232
ఎస్టీ రిజర్వ్ 13
మహిళలకు 05
జనరల్ 08
వంద శాతం ఎస్టీ జీపీలు 36
మహిళలకు 15
జనరల్ 21
జనరల్ 199
మహిళలకు 95
జనరల్ 104
బీసీ రిజర్వ్ 105
మహిళలకు 47
జనరల్ 58
ఎస్సీ రిజర్వుడ్ 74
మహిళలకు 33
జనరల్ 41


