భూదాన్‌పోచంపల్లిలో ఫ్రాన్స్ దేశస్తులు
భూదాన్‌పోచంపల్లి : ఇండియా పర్యటనలో భాగంగా పలువురు ఫ్రాన్స్ దేశస్తులు సోమవారం భూదాన్‌పోచంపల్లిని సందర్శించారు. రూరల్ టూరిజం పార్కులో మగ్గాలు, చీర తయారీ, డిజైన్లను పరిశీలించారు. ఇక్కత్ వస్త్రాల ప్రాముఖ్యత, భూదానోద్యమ చరిత్రను తె లుసుకున్నారు. వారం రోజుల ఇండియా పర్యటనలో భాగంగా తెలంగాణలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రాల సందర్శనకు వచ్చామని ఫ్రాన్స్ దేశస్తులు తెలిపారు. వీరికి టూరిజం పోలీసులు రాజశేఖర్, జాహ్నవి మార్గదర్శకం చేశారు.
హక్కులపై మహిళలను చైతన్యపరచాలి
భువనగిరి టౌన్ : అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈనెల 25నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు మహిళల హక్కులపై వారిని చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలు, డిజిటల్ హింసను అంతం చేయడానికి మహిళల్లో చైతన్యం తేవాలన్నారు. అంతకుముందు మానవ హక్కుల దినోత్సవ పోస్టర్‌ను అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్‌రావు, అధికారులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.
భువనగిరి టౌన్ : భవన నిర్మాణంతో పాటు ఇతర రంగాల్లోని కార్మికులకు సంబంధించి బీమా పెంచినట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. అదనపు కలెక్టర్లతో కలసి బీమా పెంపు వివరాలకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. బీమాతో కార్మికలు దీమాగా ఉండవచ్చన్నారు.
ట్రావెల్స్ బస్సుల తనిఖీ
చౌటుప్పల్ రూరల్: హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను సోమవారం చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. స్లీపర్ కోచ్‌లలో నిబంధనల ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తలను పరిశీలించారు. ఎమర్జెన్సీ సమయంలో తెరుచుకోవడానికి డోర్ ఉందా లేదా.. ఉంటే పనిచేస్తుందా అనే అంశాలను తనిఖీ చేశారు.ఫైర్ సేఫ్టీ పరికరాలు లేని బస్సులకు భారీగా జరిమానా విధించినట్లు సమాచారం. అనుమతులు లేకుండా గూడ్స్ పార్సిళ్లను తీసుకెళ్లవద్దని సూచించారు.బస్సుల ఫిట్‌నెస్‌ను పరిశీలించారు.తనిఖీల్లో ఎంవీఐలు ఎండీ ఇమ్రాన్, ఆనంద్, సిబ్బంది పాల్గొన్నారు.
నిత్యారాధనలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం, అనుబంధ శివాలయంలో సోమవారం సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం అర్చకులు ఘనంగా నిర్వహించారు. కొండపైన గల శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో రుద్రాభిషేకం, బిల్వార్చన, ఆలయ ముఖమండపంలోని స్పటిక లింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ప్రధానాలయంలో నిత్యారాధనలు కొనసాగాయి.వేకువజామున సుప్రభాత సేవ, గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, సహస్రనామార్చన, ప్రాకార మండపంలో సదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం నిర్వహించారు.
భూదాన్‌పోచంపల్లిలో ఫ్రాన్స్ దేశస్తులు
భూదాన్‌పోచంపల్లిలో ఫ్రాన్స్ దేశస్తులు
భూదాన్‌పోచంపల్లిలో ఫ్రాన్స్ దేశస్తులు


