‘మధ్యాహ్నం’ మరింత రుచిగా..
భువనగిరి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని మరింత రుచిగా అందించేలా విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి ఇచ్చే రూ.6.19ను రూ.6.78కు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో రూ.9.29 నుంచి రూ.10.17కు పెంచింది. జిల్లాలో 715 పాఠశాలలు, 38,187 మంది విద్యార్థులు ఉన్నారు. వారంతా మధ్యాహ్న భోజన పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.
వంట ఏజెన్సీలకు ఊరట
మధ్యాహ్న భోజన ఏజెన్సీలు 1,225 వరకు ఉన్నాయి. ధరల పెంపుతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడమే కాకుండా, ఏజెన్సీలకు ఊరట దక్కింది. వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పంటలు దెబ్బతిని దిగుబడి తగ్గింది. దీంతో కూరగాయల ధరలు అమాంతం పెరగడంతో కొనుగోలు చేయడం ఏజెన్సీలకు భారంగా మారింది. ఈ క్రమంలో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం రేట్లను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడంలో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ విద్యా సంవత్సరం భోజన రేట్లు పెంచడం ఇది రెండవ సారి.
ఫ భోజనం రేట్లు రెండో సారి పెంపు
పెరిగిన ధరలు ఇలా (రూ.లో)
తరగతి గతంలో ఇటీవల తాజాగా
1–5 5.45 6.19 6.78
6–8 8.17 9.29 10.17
9–10 8.17 9.29 10.17


