చారిత్రక కట్టడాల పరిరక్షణ అందరి బాధ్యత
భువనగిరి: చారిత్ర కట్టడాల పరిరక్షణ అందరి బాధ్యత అని పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున్‌రావు అన్నారు. వారసత్వ వారోత్సవాల్లో భాగంగా సోమవారం భువనగిరి ఖిలా వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వారసత్వ సంపదను భావితరాలకు అందించాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందన్నారు. విద్యార్థులకు చారిత్రక కట్టడాల ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ఏటా వారసత్వ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాములునాయక్, టెక్నికల్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ నర్సింగ్, ఇంజనీరింగ్ విభాగం సూపరింటెండెంట్ రాజు, సాయి కిరణ్, ఏడీ నాగలక్ష్మి, జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి ధనుంజనేయులు, సద్ది వెంకట్‌రెడ్డి, దిడ్డి బాలాజీ, జంపాల అంజయ్య, బాలేశ్వర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
ఫ పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున్‌రావు
చారిత్రక కట్టడాల పరిరక్షణ అందరి బాధ్యత


