కుమారులు పట్టించుకోవడం లేదు..
భువనగిరి టౌన్ :
తమ కుమారులు ఆస్తి, డబ్బులు తీసుకుని తమ పోషణను విస్మరిస్తున్నారని పలువురు వృద్ధులు సోమవారం కలెక్టర్ హనుమంతరావుకు ఫిర్యాదు చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వారు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి గోడు చెప్పుకున్నారు. ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన ధర్మసోమిరెడ్డి, రమణమ్మకు ఇద్దరు కుమారులు.పెద్ద కుమారుడు ప్రభు త్వ ఉద్యోగి. ఉద్యోగం వచ్చే సమయంలో అతనికి డబ్బులు కూడా ఖర్చు చేశారు. కానీ, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ బాధ్యతలను పెద్ద కుమారుడు నిర్వహించడం లేదు. దీంతో వారు కొంతకాలంగా చిన్న కొడుకు వద్ద ఉంటున్నారు. పెద్ద కుమారుడిపైవెంటనే చర్యలు తీసుకుని పోషణ బాధ్యలు చేపట్టాలని వారు కలెక్టర్‌ను వేడుకున్నారు.


