సాక్షి స్పెల్ బీకి అపూర్వ స్పందన
అక్షర దోషాలు లేకుండా రాస్తున్నాం
నల్లగొండ: సాక్షి స్పెల్ బీ, మ్యాథ్ బీ రెండో లెవెల్ పరీక్షకు అపూర్వ స్పందన లభించింది. ఆదివారం నల్లగొండ పట్టణంలోని ఏకలవ్య ఫౌండేషన్ స్కూల్‌లో సాక్షి మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెల్ బీ, మ్యాథ్ బీ పరీక్షలకు ప్రధాన స్పాన్సర్‌గా డ్యూక్స్ వాఫీ, అసోసియేట్ స్పాన్సర్‌గా ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్– రాజమండ్రి వారు వ్యవహరించారు. జిల్లాలోని నార్కట్‌పల్లిలోని శ్రీవిద్యాపీఠ్‌్, మిర్యాలగూడలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్, వర్డ్ అండ్ డీడ్ ప్రైమరీ స్కూల్, కోదాడలోని తేజ విద్యాలయం, బీబీనగర్‌లోని బిర్లా ఓపెన్ మైండ్ ఇంటర్నేషనల్ స్కూల్, నల్లగొండలోని మైత్రీ అకాడమీ విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. నాలుగు కేటగిరీల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు మొత్తం 196 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సాక్షి బ్రాంచ్ మేనేజర్ కందికట్ల రుక్మాధర్, యాడ్స్ అకౌంట్స్ డిప్యూటీ మేనేజర్ రాపోలు నాగేశ్వర్‌రావు, ఫొటోగ్రాఫర్ కంది భజరంగ్ ప్రసాద్, కెమెరామెన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, ఉపాధ్యాయులు శ్యాంప్రసాదరావు, అలేఖ్య, తదితరులు పాల్గొన్నారు.
ఫ నల్లగొండ పట్టణంలోని ఏకలవ్య
ఫౌండేషన్ స్కూల్‌లో పరీక్ష
ఫ అధిక సంఖ్యలో హాజరైన విద్యార్థులు
అక్షర దోషాలు లేకుండా రాయడం ఈ పరీక్షల ద్వారా నేర్చుకోగలుగుతాం. మాకు ఉపయోగకరంగా పరీక్షలు ఉన్నాయి. భవిష్యత్‌లో అందరూ ఈ స్పెల్ బీ, మ్యాథ్ బీ పరీక్షలు రాయాలి. – మహ్మద్ అజ్‌హాన్‌ఖాన్,
7వ తరగతి, శ్రీవిద్యాపీఠ్, నార్కట్‌పల్లి
సాక్షి స్పెల్ బీకి అపూర్వ స్పందన
సాక్షి స్పెల్ బీకి అపూర్వ స్పందన
సాక్షి స్పెల్ బీకి అపూర్వ స్పందన
సాక్షి స్పెల్ బీకి అపూర్వ స్పందన
సాక్షి స్పెల్ బీకి అపూర్వ స్పందన


