రోడ్డు ప్రమాదంలో రైతు మృతి
తిరుమలగిరి(తుంగతుర్తి): ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రైతును థార్ వాహనం ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన తిరుమలగిరి మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని నీలిబండతండాకు చెందిన ఆంగోత్ బద్యా(56) యూరియా కొనేందుకు ద్విచక్ర వాహనంపై తిరుమలగిరి క్రాస్ రోడ్ వద్దకు వెళ్తుండగా వెనుక నుంచి థార్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బద్యా అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి కుమారుడు వినోద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తుంగతుర్తి ఆస్పత్రికి తరలించారు.
మునుగోడు: కారు, బైక్ ఎదురెదురుగా ఢీకొనడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఆదివారం మునుగోడు మండల కేంద్రంలో జరిగింది. మునుగోడు మండల కేంద్రానికి చెందిన రేవెల్లి వినయ్‌కుమార్ బైక్‌పై చండూరు రోడ్డులోని మొబైల్ దుకాణానికి వెళ్తుండగా.. స్థానిక పెట్రోల్ బంక్ వద్ద చండూరు నుంచి మునుగోడుకు వస్తున్న కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వినయ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని స్థానిక ప్రాథమిక ఆరోగ్యద్రానికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించి అనంతరం నల్లగొండకు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారు, బైక్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
తైక్వాండోలో
అబ్దుల్ ముక్సిత్‌కు కాంస్యం
నల్లగొండ టూటౌన్: 8వ జాతీయ తైక్వాండో పోటీల్లో నల్లగొండ జిల్లాకు చెందిన అబ్దుల్ ముక్సిత్ కాంస్య పతకం సాధించాడు. ఈ నెల 21 నుంచి 23 వరకు పంజాబ్ రాష్ట్రం జలంధర్‌లో జరిగిన తైక్వాండో జాతీయ పోటీల్లో పాల్గొన్న ముక్సిత్ ఉత్తమ ప్రతిభ కనబర్చి కాంస్య పతకం పొందినట్లు కోచ్ ఎండీ యూనుస్ కమాల్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముక్సిత్‌ను తండ్రి ఇలియాజ్ పాషా, కోచ్ అభినందించారు.


