రీజనల్ రింగ్ రోడ్డు భూనిర్వాసితుల వినతి
సంస్థాన్ నారాయణపురం: రీజనల్ రింగ్ రోడ్డు భూనిర్వాసితులు హైదరాబాద్‌లో మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను, సంస్థాన్ నారాయణపురం సర్వేల్ గురుకుల పాఠశాల వద్ద చీఫ్ సెక్రఓటరీ రామకృష్ణారావుకు ఆదివారం వేర్వేరుగా వినతిపత్రాలు అందజేశారు. చౌటుప్పల్‌లోని దివీస్ కంపెనీని కాపాడటం కోసం రీజనల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్చారని భూనిర్వాసితులు ఆరోపించారు. నిబంధనల ప్రకారం ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి సరైన దూరంలో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలని కోరారు. రీజనల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌పై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఈటల రాజేందర్ భూ నిర్వాసితులకు హామీ ఇచ్చారు. సీఎస్ రామకృష్ణారావుకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భూనిర్వాసితుల ఆవేదనను వివరించారు.


