మారథాన్‌లో మెరిశారు
వలిగొండ : తెలంగాణ రన్నర్స్ ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్‌లో నిర్వహించిన ‘ట్రై సిటీ ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ మారథాన్’ పోటీల్లో వలిగొండ మండలానికి చెందిన ఇద్దరు పతకాలు సాధించారు. ఇంటలిజెన్స్ విభాగంలో ఇన్స్‌పెక్టర్‌గా విధులను నిర్వహిస్తున్న ప్రొద్దటూర్‌కు చెందిన దుబ్బ కిషన్ 21 మీలో మీటర్న రన్నింగ్ రేసును ఒక గంట 41 నిమిషాల్లో పూర్తి చేశాడు. అలాగే నాగారం గ్రామానికి చెందిన డాక్టర్ కట్టా శేఖర్ 21 కిలో మీటర్ల రేస్‌ను 2 గంటల 30 నిమిషాల్లో చేరి పతకాలు కై వసం చేసుకున్నారు. దుబ్బ కిషన్, కట్టా శేఖర్‌కు గ్రామస్తులు, స్నేహితులు, బంధువులు అభినందనలు తెలిపారు.


