వినియోగంలోకి తెచ్చిన ఈఓ
ఆలయ ఉద్ఘాటన అనంతరం హెడ్‌కౌంట్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అప్పట్లోనే విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు. కానీ, సరిగా వినియోగించే వారు కాదు. ఈఓగా వెంకట్రావ్ బాధ్యతలు చేపట్టిన తరువాత భక్తుల సౌకర్యాలు, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో పాటు రోజువారీగా స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్యలో కచ్చితత్వం ఉండేలా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో హెడ్‌కౌంట్ కెమెరాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చారు. భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలతో పాటు హెడ్‌కౌంట్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా భక్తుల సమస్యలను ఆయన నేరుగా తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు.


