ప్రచారం మోత.. మారని బడి రాత!
ఈ తండాల్లో పాఠశాలలకు తాళం
మూతపడిన పాఠశాలలను తెరిపించాలని విద్యా సంవత్సరం ప్రారంభంలో అనేక కార్యక్రమాలు నిర్వహించాం. బడిబాటతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే కలిగే ప్రయోజనాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాం. అయినా వారి నుంచి సహకారం లభించలేదు. ఇద్దరు, ముగ్గురు విద్యార్థులున్న చోట వారు కూడా సక్రమంగా రాకపోవడంతో పాఠశాలలను మూసివేయాల్సి వచ్చింది. మూతపడకుండా అన్ని ప్రయత్నాలు చేసినా తల్లిదండ్రుల నుంచి సహకారం లభించలేదు. వచ్చే విద్యా సంవత్సరం అడ్మిషన్లు ఉంటే తిరిగి ప్రారంభిస్తాం. –వీరజాల మాలతి,
తుర్కపల్లి మండల విద్యాధికారి
తుర్కపల్లి: బడిబాట నిర్వహించినా, ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించినా ప్రభుత్వ బడుల రాత మారలేదు. విద్యార్థులు లేకపోవడంతో తుర్కపల్లి మండలంలో చాలా చోట్ల పాఠశాలలు తాళాలు వేసి దర్శనమిస్తున్నాయి. ఏళ్లుగా ఇదే పరిస్థితి నెలకొనగా.. ఈ విద్యాసంవత్సరం ఎలాగైనా తెరిపించేందుకు ఉపాధ్యాయులు చేసిన కృషి ఫలించలేదు. రామోజీనాయక్‌తండా ప్రాథమిక పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో ముగ్గురు విద్యార్థులు ఉండగా వారికి ఒక ఉపాధ్యాయుడు విద్యాబోధన చేసేవాడు. ఆ ముగ్గురు కూడా సక్రమంగా రాకపోవడంతో నెల రోజుల కిందట విద్యాశాఖ అధికారులు పాఠశాలను మూసివేశారు. ముగ్గురు విద్యార్థులను సమీపంలోని కర్షలగడ్డతండా పాఠశాలకు పంపించారు. ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడిని డిఫ్యూటేషనపై పల్లెపహాడ్ ప్రాథమిక పాఠశాలకు కేటాయించారు. మండలంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది.
పాడైపోతున్న భవనాలు
పాఠశాలలు మూతపడటంతో భవనాల ఆలనాపాలన చూసేవారు లేకు అధ్వానంగా తయారయ్యాయి. కంప చెట్లు, పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. కొన్ని చోట్ల గోదాములుగా వినియోగిస్తున్నారు.
తుర్కపల్లి మండలంలో పది పాఠశాలలకు పైగా తాళం
ఫ బడిబాట, ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించినా తల్లిదండ్రుల అనాసక్తి
ఫ ప్రైవేట్ స్కూళ్లకు విద్యార్థులు
గూగుల్‌గుట్ట తండా, పొట్టిమర్రి తండా, పెద్దతండా, ధర్మారం తండా, పీర్యాతండా, కేవాలతండా, దయ్యంబండ తండా, రాంశెట్టిపల్లి, గంధమల్ల పరిధిలోని బీమరిగూడెంతో పాటు మరికొన్ని చోట్ల పాఠశాలలు తెరుచుకోవడం లేదు. ఆయా తండాల విద్యార్థులు సమీపంలోని తుర్కపల్లి, వడపర్తి, భువనగిరి, బొమ్మలరామారం, జలాల్‌పూర్‌లోని ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్నారు.
ప్రచారం మోత.. మారని బడి రాత!
ప్రచారం మోత.. మారని బడి రాత!


